ఇంగ్లండ్‌ 302/7  | Dom Bess and Jos Buttler impress as England turn screw on Pakistan | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 302/7 

Published Sun, Jun 3 2018 1:34 AM | Last Updated on Wed, Jul 25 2018 1:51 PM

 Dom Bess and Jos Buttler impress as England turn screw on Pakistan - Sakshi

హెడింగ్లే: పాకిస్తాన్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. చేతిలో మరో 3 వికెట్లు ఉన్న ఆ జట్టు ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 106/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ (45; 6 ఫోర్లు) వికెట్‌ త్వరగానే కోల్పోయింది. బెస్‌ (49; 7 ఫోర్లు), మలాన్‌ (28), బెయిర్‌స్టో (21), వోక్స్‌ (17) తలా కొన్ని పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం బట్లర్‌ (34 బ్యాటింగ్‌; 4 ఫోర్లు),  కరన్‌ (16 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement