![T20 World Cup 2021: Stuart Broad Funny Reply ICC Post Featuring Pak Fan - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/3/Stuart.jpg.webp?itok=_QrXrQrH)
Stuart Broad Super Reply To ICC Post.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటూ నాలుగు వరుస విజయాలతో ఐదోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్ 12 గ్రూఫ్-2లో టీమిండియా, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లతో పాటు అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. తాజాగా నమీబియాపై విజయం అందుకున్న పాకిస్తాన్ టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్, నమీబియా మ్యాచ్‌కు హాజరైన ఒక పాక్ అభిమాని '' ఈసారి వరల్డ్ కప్ మాదే.. పాకిస్తాన్ జిందాబాద్'' అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు.
చదవండి: PAK Vs NAM: 'ఓడిపోయామని బాధపడకండి.. బాగా ఆడారు'..
ఈ ఫోటోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''పాకిస్తాన్ ఈసారి కప్ కొడుతుందని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు... వారి అంచనాలు నిజమవుతాయా'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన ఫోటోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ''మరి ఇంగ్లండ్ '' అంటూ ఒక్క డైలాగ్‌తో అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఐసీసీ పోస్టును 2లక్షల మంది లైక్ చేయగా.. అందులో బ్రాడ్ పెట్టిన రిప్లైకి 3వేలకి పైగా లైక్స్ వచ్చాయి.
వాస్తవానికి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో పాటు ఇంగ్లండ్ కూడా టైటిల్ ఫెవరెట్‌గా ఉంది. సూపర్ 12 దశలో గ్రూఫ్-1లో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్‌గా నిలిచి మెరుగైన రన్‌రేట్‌తో పాక్ కంటే ముందే సెమీస్‌కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ .. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ మెరుపు సెంచరీతో 26 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అడుగుపెట్టింది.
చదవండి: IND VS AFG: ముగ్గురు స్పిన్నర్లను ఆడించినా తప్పులేదు.. అశ్విన్ మాత్రం
Comments
Please login to add a commentAdd a comment