లండన్: గత ఆరు సంవత్సరాల క్రితం తమతో టెస్టు మ్యాచ్ సందర్బంగా స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఎటువంటి ద్వేషమూ లేదని ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు ఆమిర్ తో ఎటువంటి సమస్య ఉండబోదని బ్రాడ్ అన్నాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో ఆమిర్ కు చోటు దక్కడంపై బ్రాడ్ తాజాగా స్పందించాడు. 'ఆమిర్ ను వేరేగా చూడబోం. ఆనాడు జరిగింది ప్రత్యేకమైన కథ.ఆ టెస్టు మ్యాచ్కు, జరగబోయే టెస్టు మ్యాచ్కు ఒకగాటిన కట్టలేం. అప్పటి జట్టులో ముగ్గురో, నలుగురో ఆటగాళ్లు ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆ ఘటనతో ఒక ఆటగాడ్ని వేరే కోణంలో చూసి కించపరిచే ఉద్దేశం లేదు'అని బ్రాడ్ పేర్కొన్నాడు.
వచ్చే నెలలో పాకిస్తాన్ తన సుదీర్ఘ పర్యటనలో ఇంగ్లండ్లో నాలుగు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ 20 ఆడనుంది. జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 7 వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య సిరీస్లు జరుగనున్నాయి. ఇదిలా ఉండగా శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 2-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
'ఆమిర్పై మాకు ద్వేషం లేదు'
Published Tue, Jun 7 2016 8:16 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement