కుప్పకూలిన వెస్టిండీస్ | West Indies hit back after batting collapse | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన వెస్టిండీస్

Published Thu, Jun 4 2015 10:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

West Indies hit back after batting collapse

రోసీయూ: ఆస్ట్రేలియాతో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ 148 ఆలౌటైంది. షై హోప్ (36) ఒక్కడే రాణించాడు. బ్రాత్‌వైట్ (10), డారెన్ బ్రేవో (19), శామ్యూల్స్ (7), బ్లాక్‌వుడ్ (2), రామ్‌దిన్ (19), హోల్డర్(21), డౌరిచ్(15)  టేలర్(6), గాబ్రియెల్(2) విఫలమయ్యారు. 85 పరుగులకు విండీస్ చివరి 9 వికెట్లు చేజార్చుకోవడం విశేషం.

ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 3 , జాన్సన్ 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. లియాన్, స్మిత్ ఒక్కో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. వార్నర్(8), మార్ష్(19), క్లార్క్(18) అవుటయ్యారు. స్మిత్ 17, వోగ్స్ 20 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement