సాక్షి, స్పోర్ట్స్ : ఫార్మాట్ ఏదైనా అత్యంత అరుదైన రికార్డులు మాత్రం క్రికెట్ పుస్తకంలో ఈ మధ్య నమోదవుతున్నాయి. విక్టోరియన్ థర్డ్ గ్రేడ్ క్రికెటర్ నిక్ గూడెన్ ఊహకందని ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
కౌంటీ క్రికెట్ లో భాగంగా యాల్లౌర్న్ నార్త్ తరపున ఆడుతున్న నిక్ గూడెన్, పది బంతుల్లో ఎనిమిది వికెట్లను తీశాడు. ఇందులో ఐదు వరుస బాల్స్ లో ఐదు వికెట్లు తీయడం గమనార్హం.ఇందులో ఆరుగుర్ని బౌల్డ్ చేయగా, ఒక ఆటగాడ్ని లెగ్ బి ఫోర్ గా పెవిలియన్ కు పంపడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో నమోదైన ఈ రికార్డులో నిక్ గూడెన్ మొత్తం 17 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత డిసెంబర్ నుంచి క్రికెట్ కు దూరమైన ఈ కుడి చేతి బౌలర్ రీఎంట్రీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించటం మరో విశేషం.
ఇదెలా జరిగిందో తనకూ అర్థం కాలేదని, కానీ ఓ మరపురాని అనుభూతి మాత్రం కలిగిందని మ్యాచ్ అనంతరం 'వీకెండ్ సన్ రైజ్' పత్రికతో గూడెన్ పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టర్ అగస్టా బీ గ్రేడ్ కు చెందిన ఆటగాడు ఒకరు 40 సిక్సులతో 307 పరుగులు కొట్టి ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment