Vamika First Birth Day: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకే ఆలౌటై నిరాశపరిచింది. కెప్టెన్ కోహ్లి(201 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) ఓంటరి పోరాటం చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రెండేళ్లకుపైగా శతక దాహంతో ఉన్న కోహ్లి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. అయితే, వారికి మరోసారి నిరాశే ఎదురైంది.
33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి ఎంతో ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించినప్పటికీ, మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతుండడంతో ఒత్తిడికి లోనై 211 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా, తన వ్యక్తిగత జీవితంలో చాలా ప్రత్యేకమైన ఈ రోజున సెంచరీ మార్కును అందుకోవాలని కోహ్లి సైతం ఎంతో పట్టుదలగా కనిపించాడు. అయితే, రబాడ అద్భుతమైన బంతితో కోహ్లిని బోల్తా కొట్టించాడు.
ఇదిలా ఉంటే, కోహ్లి వ్యక్తిగత జీవితంలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. తన గారాల పట్టి వామిక ఇవాళ మొదటి పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కూతురికి శతకం సాధించి స్పెషల్ గిఫ్ట్ ఇద్దామని కోహ్లి భావించాడు. అయితే, అతని ఆశలు అడియాశలు అయ్యాయి. చాలా కాలంగా ఊరిస్తున్న సెంచరీ మైలరాయి కోసం కోహ్లి మరో ఇన్నింగ్స్ వరకు వేచి చూడాల్సి ఉంది. కాగా, విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులకు గతేడాది జనవరి 11న వామిక జన్మించిన సంగతి తెలిసిందే. వామిక ఫోటోను సైతం కోహ్లి దంపతులు ఇప్పటివరకు బయటి ప్రపంచానికి తెలీనివ్వకపోవడం విశేషం.
చదవండి: 'తగ్గేదేలే' డైలాగ్‌తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్
Comments
Please login to add a commentAdd a comment