ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు కేఎల్ రాహుల్ బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమయ్యాడని సమాచారం. దీంతో రాహుల్ మూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది. మరోవైపు రాహుల్‌తో పాటు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేశాడని సమాచారం.
రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా అతని కర్ణాటక సహచరుడు దేవ్‌దత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పడిక్కల్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 92.67 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు చేశాడు.
ఇప్పటికే వివిధ కారణాల చేత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమీ సేవలు కోల్పోయిన టీమిండియాకు రాహుల్ గైర్హాజరీ మరింత ఇబ్బందికరంగా పరిగణించబడుతుంది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన రాహుల్ రెండో టెస్ట్ కూడా ఆడలేదు. వారం తర్వాత రాహుల్‌కు మరోసారి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారని సమాచారం.
సీనియర్లంతా ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతుండటంతో టీమిండియా అభిమానులు కలవరపడుతున్నారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నారు. మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది.
ఇదిలా ఉంటే,ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్ట్‌లకు భారత జట్టును రెండ్రోజుల కింద ప్రకటించారు. జట్టును ప్రకటించే సమయంలోనే ఆటగాళ్లంతా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంటుందని సెలెక్టర్లు చెప్పారు. గాయాల కారణంగా రెండో టెస్ట్‌కు దూరమైన రాహుల్, జడేజాను దృష్టిలో ఉంచుకునే సెలెక్టర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment