టీమిండియాకు గుడ్ న్యూస్. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న నాలుగో టెస్ట్‌కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రానున్నాడు. గాయం కారణంగా గత రెండు టెస్ట్‌లకు (రెండు, మూడు) దూరంగా ఉన్న రాహుల్ ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని తెలుస్తుంది. మోకాళ్ల సమస్యతో బాధపడుతున్న రాహుల్ వైద్యుల పర్యవేక్షణలో ఉండి పూర్తిగా కోలుకున్నాడని సమాచారం.
ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు రాహుల్ అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా ప్రస్తావించాడు. రాహుల్ ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి అందుబాటులోకి వస్తే గత రెండు మ్యాచ్‌ల్లో అతనికి ప్రత్యామ్నాయంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న రజత్ పాటిదార్‌పై వేటు పడే అవకాశం ఉంది.
పాటిదార్ గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయి ప్రభావం చూపించలేకపోయాడు. విశాఖ టెస్ట్‌లో (32, 9) కాస్త పర్వాలేదనిపించిన పాటిదార్.. రాజ్‌కోట్ టెస్ట్‌లో (5, 0) పూర్తిగా తేలిపోయాడు. కాగా, రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో మూడో టెస్ట్‌కు ముందు అతనికి ప్రత్యామ్నాయంగా దేవ్‌దత పడిక్కల్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వరుసగా రెండు, మూడు టెస్ట్‌లను గెలిచిన టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. నిన్న ముగిసిన మూడో టెస్ట్‌లో భారత్ 434 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు జరిగిన విశాఖ టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో గెలవగా.. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గట్టెక్కింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment