బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా రేపటి నుంచి (మార్చి 1) ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ పలు రికార్డులపై కన్నేశారు. మూడో టెస్ట్‌లో కోహ్లి మరో 77 పరుగులు చేస్తే.. సొంతగడ్డపై 4000 పరుగులు పూర్తి చేసిన ఐదో భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
కోహ్లికి ముందు సచిన్ (7216), ద్రవిడ్ (5598), గవాస్కర్ (5067), సెహ్వాగ్ (4656) స్వదేశంలో 4000 పరుగుల మైలురాయిని క్రాస్ చేశారు. ఈ రికార్డుతో పాటు కోహ్లి మరో భారీ రికార్డుపై కూడా కన్నేశాడు. మూడో టెస్ట్‌లో కోహ్లి మరో క్యాచ్ అందుకుంటే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు.
ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 299 క్యాచ్‌లు అందుకున్న కోహ్లి.. ద్రవిడ్ (334) తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. అంతరర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఘనత మహేళ జయవర్ధనే (440) పేరిట నమోదై ఉంది.
రోహిత్ శర్మ విషయానికొస్తే.. ఆసీస్‌తో మూడో టెస్ట్‌లో హిట్‌మ్యాన్ మరో 57 పరుగులు చేస్తే స్వదేశంలో టెస్ట్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకు స్వదేశంలో 22 టెస్ట్‌లు ఆడిన కోహ్లి.. 71.96 సగటున 8 సెంచరీలు (ఓ డబుల్ సెంచరీ), 6 హాఫ్ సెంచరీల సాయంతో 1943 పరుగులు చేశాడు. స్వదేశంలో సర్ డాన్ బ్రాడ్‌మన్ (98.22) తర్వాత అత్యధిక సగటు హిట్‌మ్యాన్‌దే కావడం మరో విశేషం.
స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. ఆసీస్ తాత్కాలిక సారధి భారత్‌తో జరిగే మూడో టెస్ట్‌లో సెంచరీ చేస్తే.. స్టీవ్ వా, అలెన్ బోర్డర్ రికార్డులను బద్దలు కొడతాడు. స్టీవ్ స్మిత్, స్టీవ్ వా, అలెన్ బోర్డర్‌లు ఆసీస్ కెప్టెన్లుగా తలో 15 సెంచరీలు బాదారు. మూడో టెస్ట్‌లో స్మిత్ శతక్కొడితే వా, బోర్డర్‌లను అధిగమిస్తాడు. ఆసీస్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీల రికార్డు రికీ పాంటింగ్ (19) పేరిట ఉంది.
Comments
Please login to add a commentAdd a comment