Ind Vs Aus 3rd Test Indore 2nd Day Updates:
ముగిసిన రెండో రోజు ఆట
163 పరుగుల వద్ద టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఆస్ట్రేలియా కంటే కేవలం 75 పరుగుల ఆధిక్యం మాత్రమే సంపాదించగలిగింది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ అత్యధికంగా 8 వికెట్లు తీయగా.. మరో స్పిన్నర్ మథ్యూ కుహ్నెమన్‌కు ఒకటి, పేసర్ స్టార్క్‌కు ఒక వికెట్ దక్కాయి. టీమిండియా బ్యాటర్లలో ఛతేశ్వర్ పుజారా 59 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
57: టీమిండియా స్కోరు: 155-9. కేవలం 67 పరుగుల ఆధిక్యం
56.4: తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
లియోన్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు.
56.3: ఎనిమిదో వికెట్ డౌన్
లియోన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పుజారా (59) అవుట్.
54: టీమిండియా స్కోరు: 145/7
48.1: అశ్విన్ రూపంలో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
నాథన్ లియోన్ బౌలింగ్‌లో అశ్విన్(16) బౌల్డ్ అయ్యాడు.
40.1: ఆరో వికెట్ కోల్పోయిన భారత్
నాథన్ లియోన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.స్కోరు- 118/6 (40.1). పుజారా (46), అశ్విన్ (0) క్రీజులో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
37.2: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అయ్యర్ అవుటయ్యాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు. పుజారా, శ్రీకర్ భరత్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 115-5(38)
జడేజా ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్..
ఆస్ట్రేలియా స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు తడబడుతున్నారు. క్రీజులో కుదురుకున్నట్లే కన్పించిన ఆల్‌రౌండర్ జడేజా.. లయోన్ బౌలింగ్‌లో ఎల్బీబ్ల్యూగా వెనుదిరిగాడు. 36 బంతులో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, పుజారా 36(76) ఉన్నారు.
విరాట్ కోహ్లి ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్
టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. క్రీజ్‌లో కుదురుకుని టీమిండియాను గట్టెక్కిస్తాడని ఆశించిన విరాట్ కోహ్లి మరోసారి విఫలమై పెవిలియన్‌కు చేరాడు. కుహ్నేమన్ మరోసారి కోహ్లిని (13) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కోహ్లి ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 54/3గా ఉంది. పుజారా (20), జడేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 34 పరుగులు వెనుకపడి ఉంది.
రెండో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ ఔట్
32 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. లయోన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (12) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు టీమిండియా ఇంకా 56 పరుగులు వెనుకపడే ఉంది. పుజారా (11), కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ క్లీన్ బౌల్డ్
లంచ్ విరామం తర్వాత లయోన్ వేసిన తొలి ఓవర్‌లోనే భారత్ వికెట్ కోల్పోయింది, లయోన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో గిల్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
లంచ్ సమయానికి భారత్ స్కోర్ 13/0
156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. లంచ్ విరామం సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
197 పరుగులకే ఆలౌటైన ఆసీస్
156/4 స్కోర్ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. ఈ రోజు ఆసీస్ కోల్పోయిన 6 వికెట్లలో అశ్విన్, ఉమేశ్ చెరి సగం పంచుకున్నారు. వీరిద్దరు ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాకు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ యాదవ్ రెచ్చిపోతున్నాడు. ఇవాళ ఆసీస్ కోల్పోయిన 5 వికెట్లలో ఉమేశ్ ఒక్కడే 3 వికెట్లు పడగొట్టాడు. మర్ఫీని ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
196 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ అలెక్స్ క్యారీ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
వారెవ్వా ఉమేశ్.. స్పిన్ పిచ్‌పై ప్రతాపం చూపిస్తున్నావు..!
డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. హ్యాండ్స్‌కోంబ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపగా.. గ్రీన్, స్టార్క్‌లను ఉమేశ్ ఔట్ చేశాడు. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఉమేశ్ నిప్పులు చెరుగుతూ వికెట్లు పడగొడుతున్నాడు. గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన ఉమేశ్.. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 74 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 196/7.
వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన ఆసీస్
రెండో రోజు చాలా సమయం వరకు నిలకడగా ఆడిన ఆసీస్.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. తొలు హ్యాండ్స్‌కోంబ్‌ను యాష్ బోల్తా కొట్టించగా.. మరుసటి ఓవర్‌లో ఉమేశ్ యాదవ్.. గ్రీన్ (21)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 72 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 188/6గా ఉంది. అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ క్రీజ్‌లో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
రెండో రోజు ఆట మొదలయ్యాక చాలా సేపు నిలకడగా ఆడిన హ్యాండ్స్‌కోంబ్‌ను (19) ఎట్టకేలకు అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 71వ ఓవర్‌లో షార్ట్ లెగ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి హ్యాండ్స్‌కోంబ్ వెనుదిరిగాడు. 71 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 186/5గా ఉంది. గ్రీన్ (19), అలెక్స్ క్యారీ (0) క్రీజ్‌లో ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న గ్రీన్, హ్యాండ్స్‌కోంబ్
ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతుంది. హ్యాండ్స్‌కోంబ్ (16), గ్రీన్ (17) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. క్రీజ్‌లో కుదురుకునే ప్రయత్నం చేస్తున్నారు. 66 ఓవర్లు ముగిసే ఆసీస్ స్కోర్ 177/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 68 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
రెండో రోజు ఆట ప్రారంభం.. రవీంద్రుడి మాయాజాలం కొనసాగేనా..?
ఓవర్‌నైట్ స్కోర్ 156/4 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్‌కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తుది జట్లు..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ , నాథన్ లియోన్, మార్క్ కుహ్నేమన్
Comments
Please login to add a commentAdd a comment