ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్‌ ఆసక్తికర ట్వీట్‌ | IND Vs SA: Jasprit Bumrah Looks Back At Test Debut In 2018 In Cape Town Ahead Of Final Test | Sakshi
Sakshi News home page

Jasprit Bumrah: ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్‌ ఆసక్తికర ట్వీట్‌

Published Mon, Jan 10 2022 4:50 PM | Last Updated on Mon, Jan 10 2022 4:50 PM

IND Vs SA: Jasprit Bumrah Looks Back At Test Debut In 2018 In Cape Town Ahead Of Final Test - Sakshi

IND Vs SA 3rd Test: కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రేపటి(జనవరి 11) నుంచి ప్రారంభంకానున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. టెస్ట్‌ కెరీర్‌ను ఎక్కడ మొదలుపెట్టానో నాలుగేళ్ల తర్వాత అక్కడే ఉన్నానంటూ తన టెస్ట్‌ అరంగేట్రాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. 2018 జనవరిలో ఇదే వేదికపై టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. నాలుగేళ్ల  కాలంలో ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగానూ పరిణితి చెందానని, తిరిగి కేప్‌టౌన్‌కు రావడం మధుర స్మృతులను నెమరువేసుకున్నట్లు ఉందని భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ చేశాడు.
 


విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ద్వారా బుమ్రా టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. 3 మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా..  23.24 సగటుతో 106 వికెట్లు సాధించాడు. ఇదిలా ఉంటే, 3 టెస్ట్‌ల ప్రస్తుత సిరీస్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమంగా నిలిచాయి. రేపటి నుంచి ప్రారంభంకాబోయే నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇరు జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి. 
చదవండి: విరాట్‌ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement