విలియమ్సన్‌ సెంచరీ | Williamson Century kwis lead in the test match | Sakshi
Sakshi News home page

విలియమ్సన్‌ సెంచరీ

Published Tue, Mar 28 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

Williamson Century  kwis  lead in the test match

హామిల్టన్‌: కేన్‌ విలియమ్సన్‌ (216 బంతుల్లో 148 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించడంతో న్యూజిలాండ్‌ భారీస్కోరు దిశగా పయనిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో సోమవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 67/0తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ జట్టులో ఓపెనర్లు లాథమ్‌ (50; 10 ఫోర్లు), రావల్‌ (88; 10 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ఈ క్రమంలో విలియమ్సన్‌ తన టెస్టు కెరీర్‌లో 17వ సెంచరీ పూర్తిచేశాడు. తద్వారా కివీస్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన మార్టిన్‌ క్రో (17) సెంచరీల రికార్డును సమం చేశాడు. సఫారీ బౌలర్లలో రబడా, మోర్కెల్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement