వెస్టిండీస్‌తో బుధవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది.
రొసియూ (డొమినికా): వెస్టిండీస్‌తో బుధవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. మసూద్ (9) అవుటవ్వగా... అజహర్ అలీ (38 బ్యాటింగ్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బాబర్ ఆజమ్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.