పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది.
రొసియూ (డొమినికా): పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో వెస్టిండీస్ జట్టు కష్టాల్లో పడింది. 304 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆట చివరి రోజు ఆదివారం కడపటి వార్తలు అందే సమయానికి 59 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. అంతకుముందు పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఎనిమిది వికెట్లకు 174 పరుగులవద్ద డిక్లేర్ చేసింది.