Most Batsmen Out Caught In A Test Series: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా సరికొత్త సృష్టించింది. కనీసం మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అత్యధిక క్యాచ్ ఔట్‌లు అయిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. రెండో ఇన్నింగ్స్‌లో రబాడ బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి రహానే(1) వెనుదిరగడంతో ఈ రికార్డు భారత్ ఖాతాలోకి చేరింది.
ప్రస్తుత సిరీస్‌లో ఇప్పటివరకు 49 మంది భారత బ్యాటర్లు క్యాచ్ ఔటై వెనుదిరిగారు. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది. 2009/10 న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 48 పాక్ ఆటగాళ్లు క్యాచ్ ఔట్‌ల రూపంలో వెనుదిరిగారు. కాగా, 2006/07లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో సైతం 47 మంది భారత ఆటగాళ్లు క్యాచ్ ఔట్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు కట్టడి చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(16), రిషబ్ పంత్ క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 73 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022 Auction: ఐపీఎల్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ అరంగేట్రం!.. అయితే..
Comments
Please login to add a commentAdd a comment