BGT 2023: ఆసీస్‌తో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన | India Squad For Last Two Tests Of BGT Announced | Sakshi
Sakshi News home page

BGT 2023: ఆసీస్‌తో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ప్రకటన

Published Sun, Feb 19 2023 5:58 PM | Last Updated on Sun, Feb 19 2023 5:58 PM

India Squad For Last Two Tests Of BGT Announced - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా భారత-ఆస్ట్రేలియా జట్లు 4 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2 మ్యాచ్‌లు పూర్తి కాగా రెండిటిలో టీమిండియానే గెలుపొందింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యంలోకి కొనసాగుతోంది. గతంలో మొదటి రెండు టెస్ట్‌లకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు ఇవాళ (ఫిబ్రవరి 19) మూడు, నాలుగు టెస్ట్‌లతో పాటు తదుపరి జరిగే వన్డే సిరీస్‌ కోసం కూడా జట్టును ప్రకటించారు.

ఈ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టునే యధాతథంగా కొనసాగించారు. మూడో టెస్ట్‌ ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు జరుగనుండగా.. నాలుగో మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరుగనుంది. 

ఆసీస్‌తో మూడు, నాలుగు టెస్ట్‌లకు టీమిండియా..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, కేఎస్‌ భరత్‌, ఇషాన్ కిషన్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement