కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు. సఫారీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో జట్టు కోచ్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కునెట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 11 టెస్ట్‌ల్లో 624 పరుగులు చేయగా, ప్రస్తుత ఇన్నింగ్స్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ద్రవిడ్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (15 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో నిలిచాడు.
దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్‌లు ఆడిన కోహ్లి.. 50కి పైగా సగటుతో 626* పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 28 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్(15), కేఎల్ రాహుల్(12) ఔట్ కాగా.. కోహ్లి(15), పుజారా(26) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: టీమిండియాకు భారీ షాక్.. జట్టు సభ్యుడికి కరోనా
Comments
Please login to add a commentAdd a comment