టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసకందాయంలో పడింది. ఇరు జట్లకు విజయావకాశాలు సమంగా ఉండటంతో శనివారం నాలుగో రోజు ఆట కీలకం కానుంది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా(2 బ్యాటింగ్), డీన్ ఎల్గర్( 11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.