
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. రోహిత్ (12), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), అక్షర్ పటేల్ (12 నాటౌట్), ఉమేశ్ యాదవ్ (17) అతికష్టం మీద రెండంకెల స్కోర్ సాధించగా.. విరాట్ కోహ్లి (22) భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 48.5 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్‌కోంబ్ (3), గ్రీన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి.
ఇదిలా ఉంటే, ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఉన్నట్లుండి ఒక్కసారిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. 109 పరుగులకే చాపచుట్టేసిందన్న బాధలో టీమిండియా, అభిమానులు ఉంటే కోహ్లి ఇలా చేయడం ఏంటని అంతుచిక్కక ఫ్యాన్స్ జట్టు పీక్కుంటున్నారు.
కోహ్లి అసందర్భంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లి ఏంటి ఇలా చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోహ్లికి ఏమైనా పిచ్చా.. అసందర్భంగా ఇలా డ్యాన్స్‌లు చేయడమేంటని కామెంట్లు చేస్తున్నారు. గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో సంబంధం లేనట్లు కోహ్లి ప్రవర్తించడం సరికాదని హితవు పలుకుతున్నారు.
అయితే, కోహ్లి డ్యాన్స్ చేయడానికి కారణాలు లేకపోలేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. కోహ్లి డ్యాన్స్ చేసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అయితే అప్పటిదాకా బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్.. ఆసీస్ బ్యాటర్లకు తోడ్పాటునందించడం చూసి కోహ్లి అసహనంతో డ్యాన్స్ చేసినట్లు సోషల్‌మీడియాలో సర్కులేట్ అవుతున్న కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. కోహ్లి పిచ్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. పాపులర్ హిందీ సాంగ్ అయిన బత్తమీజ్ దిల్.. బత్తమీజ్ దిల్‌ను బత్తమీజ్ పిచ్.. బత్తమీజ్ పిచ్ అంటూ పాడుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment