ఆండర్సన్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన జైస్వాల్‌ | Yashasvi Jaiswal Smokes James Anderson For Hat Trick Sixes In Rajkot Test | Sakshi
Sakshi News home page

ఆండర్సన్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన జైస్వాల్‌.. కనికరం లేకుండా వీర బాదుడు

Published Sun, Feb 18 2024 1:02 PM | Last Updated on Sun, Feb 18 2024 1:41 PM

Yashasvi Jaiswal Smokes James Anderson For Hat Trick Sixes In Rajkot Test - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మరో డబుల్‌ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సెంచరీ అనంతరం నిన్న రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగి ఇవాళ తిరిగి బరిలోకి దిగిన యశస్వి మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్నాడు. ప్రస్తుతం 187 పరుగుల వద్ద ఉన్న యశస్వి.. వెటరన్‌ పేసర్‌ ఆండర్సన్‌పై కనికరం లేకుండా విచుకుపడ్డాడు.

నాలుగో రోజు ఆటలో లంచ్‌ విరామం తర్వాత గేర్‌ మార్చిన అతను.. ఇన్నింగ్స్‌ 85వ ఓవర్‌లో ఆండర్సన్‌కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది 180ల్లో​కి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు.

సౌరవ్‌ గంగూలీ తర్వాత మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లో 500 పరుగులు దాటిన రెండో భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2007లో స్వదేశంలో పాక్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో గంగూలీ 534 పరుగులు సాధించాడు. 

ఓ ఇన్నింగ్స్‌లో, ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత ఇన్నింగ్స్‌లో యశస్వి ఇప్పటివరకు 10 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో అతను 20 సిక్సర్లు కొట్టాడు. యశస్వికి ముందు టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్‌ శర్మ (19) పేరిట ఉండేది.

ఆండర్సన్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించిన ఐదో భారత ప్లేయర్‌గా (2002 తర్వాత) రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి ముందు ధోని (రెండు సార్లు), హార్దిక్‌ పాండ్యా, రోహిత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ ఈ ఘనత సాధించారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. యశస్వికి (194) జతగా సర్ఫరాజ్‌ ఖాన్‌ (38) క్రీజ్‌లో ఉన్నాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్‌ 378/4గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 504 పరుగుల లీడ్‌లో ఉంది.

స్కోర్‌ వివరాలు..
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 445 ఆలౌట్‌ (రోహిత్‌ 131, జడేజా 112)
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 319 ఆలౌట్‌ (బెన్‌ డకెట్‌ 153)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement