రాంఛీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. 40/0 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైశ్వాల్(37) తొలి వికెట్‌గా రూట్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ(55), రజిత్ పాటిదార్(0) పెవిలియన్‌కు చేరారు. భారత విజయానికి ఇంకా 80 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో గల్(13), జడేజా(2) పరుగులతో ఉన్నారు.
ఆండర్సన్ కళ్లు చెదిరే క్యాచ్..
ఇక నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. యశస్వీ జైశ్వాల్‌ను స్టన్నింగ్ క్యాచ్‌తో ఆండర్సన్ పెవిలియన్‌కు పంపాడు. భారత సెకెండ్ ఇన్నింగ్స్‌లో 17 ఓవర్ వేసిన జో రూట్ బౌలింగ్‌లో మూడో బంతిని జైశ్వాల్ ఆఫ్ సైడ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిలో టర్న్ ఎక్కువగా వుండడంతో ఎడ్జ్ తీసుకుని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది.
ఈ క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న 41 ఏళ్ల ఆండర్సన్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Sitaraman (@Sitaraman112971) February 26, 2024
Comments
Please login to add a commentAdd a comment