ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి పరుగు చేసిన అనంతరం విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును (ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు, 656) బద్దలు కొట్టిన యశస్వి.. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన అనంతరం ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉండింది. సచిన్.. ఆసీస్‌పై 74 ఇన్నింగ్స్‌ల్లో 25 సిక్సర్లు బాదితే.. యశస్వి ఇంగ్లండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్సర్లు బాది సచిన్ పేరిట ఉండిన రికార్డును చెరిపేశాడు.
ఈ రికార్డుతో పాటు యశస్వి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బౌండరీ బాది టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి.. టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న సెకెండ్ ఫాస్టెస్ట్ ఇండియన్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వికి 1000 పరుగుల మార్కును తాకేందుకు 16 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. వినోద్ కాంబ్లీ ఈ మైలురాయిని కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకున్నాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన సచ్‌క్లిఫ్ పేరిట ఉంది. ఇతను కేవలం 12 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులను పూర్తి చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత.. దూకుడుగా ఆడుతుంది. 15 ఓవర్లలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి (33; ఫోర్, 3 సిక్సర్లు) పరిమిత ఓవర్ల క్రికెట తరహాలో రెచ్చిపోతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 146 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా..
- సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై 774 పరుగులు
- సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌పై 732 పరుగులు
- యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్‌పై 712 పరుగులు
- విరాట్ కోహ్లి 2014/15లో ఆస్ట్రేలియాపై 692 పరుగులు
డబ్యూటీసీ 2023-25 సైకిల్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు జైస్వాల్
Comments
Please login to add a commentAdd a comment