రాజ్‌కోట్ టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. డకెట్‌తో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 326/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 119 పరుగులు జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 112 పరుగుల వద్ద ఔట్ కాగా.. మరో ఓవర్‌నైట్ ఆటగాడు కుల్దీప్ తన స్కోర్ మరో 3 పరుగులు జోడించి 4 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఇవాళ క్రీజ్‌లో వచ్చిన అరంగేట్ర బ్యాటర్ దృవ్ జురెల్ 46 పరుగులు, అశ్విన్ 37, బుమ్రా 26 పరుగులు చేసి ఔటయ్యారు. సిరాజ్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో బుమ్రా బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ ఆండర్సన్, టామ్ హార్ట్లీ, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆటలో జాక్ క్రాలేను ఔట్ చేయడం ద్వారా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment