
కేప్‌టౌన్: టీమిండియా అభిమానులకు శుభవార్త. మూడో టెస్ట్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్నాడు. ఈ మేరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనప్రాయంగా వెల్లడించాడు. ఆదివారం కోహ్లి నెట్స్‌లో పాల్గొనడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. కోహ్లి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. నెట్స్‌లో కోహ్లి చాలా సేపు ప్రాక్టీస్ చేయడం చూస్తే.. అతని గాయం పూర్తిగా మానినట్లు తెలుస్తోంది.
It's GO time here in Cape Town 👏 👏#TeamIndia all set and prepping for the series decider 👍 👍#SAvIND pic.twitter.com/RgPSPkNdk1
— BCCI (@BCCI) January 9, 2022
కీలక మ్యాచ్ సమయానికి కోహ్లి కోలుకోవడంతో అతని అభిమానులు సహా టీమిండియా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, వెన్ను నొప్పి కారణంగా కోహ్లి రెండో టెస్ట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కోహ్లి గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో సఫారీల చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో చెరో గెలుపుతో ఇరు జట్లు సమంగా నిలిచాయి. జనవరి 11 నుంచి సిరీస్‌లో చివరిదైన మూడో టెస్ట్ ప్రారంభంకానుంది.
చదవండి: IND Vs SA 3rd Test: సిరాజ్ స్థానంలో ఎవరంటే..?
Comments
Please login to add a commentAdd a comment