కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ.. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లపై నుంచి వెళ్తుందనే కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు. ఈ సంబంధిత అధికారులతో పాటు ఫీల్డ్ అంపైర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
అనంతరం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి.. స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి నోరుపారేసుకున్నాడు. కోహ్లితో పాటు అశ్విన్, కేఎల్ రాహుల్ సైతం మైక్ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంపైర్‌ను ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉండటంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లిపై ఓ మ్యాచ్‌లో నిషేధం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్ అనంతరం కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ''కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి'' అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఓవర్ నైట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. పీటర్సన్ ఔటయ్యే సమయానికి స్కోర్ 155/3గా ఉంది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బావుమా ఉన్నారు. దక్షిణాఫ్రికా.. తమ లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది.
చదవండి: Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు?
Comments
Please login to add a commentAdd a comment