DRS controversy
-
నిషేధం గండం నుంచి గట్టెక్కిన కోహ్లి అండ్ కో..!
కేప్‌టౌన్ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ వివాదంలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, అశ్విన్, కేఎల్ రాహుల్‌లకు ఊరట లభించినట్లు తెలుస్తుంది. మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 60 పరుగుల వద్ద ఎల్గర్‌ను ఫీల్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్‌గా ప్రకటించడం, ఆ వెంటనే థర్డ్ అంపైర్ జోక్యం చేసుకుని నాటౌట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ విషయమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కోహ్లి అండ్ కో(అశ్విన్, కేఎల్ రాహుల్).. దక్షిణాఫ్రికా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని తప్పుగా వాడి టెస్ట్ సిరీస్‌ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బహిరంగంగా ఆరోపించడంతో పాటు స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి థర్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ గెలవాలనుకుంటే సరైన పద్ధతులు ఎంచుకుంటే బెటర్ అని అశ్విన్ అనగా, మా పదకొండు మందిని ఔట్ చేసేందుకు దేశమంతా కలిసి ఆడుతున్నట్టుందని రాహుల్ కామెంట్ చేశాడు. ఇదే సందర్భంగా కోహ్లి.. అందరూ చూస్తుండగా స్టంప్ మైక్ దగ్గరకు వచ్చి.. కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద కూడా దృష్టి సారించండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. థర్డ్ అంపైర్‌ను ఉద్ధేశించి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లి అండ్ కో పై ఓ మ్యాచ్ నిషేధం లేదా భారీ జరిమానా పడే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే, ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సీరియస్‌గా తీసుకోకపోవడంతో కోహ్లి అతని సహచరులు నిషేధం ముప్పు నుంచి తప్పించుకున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోహ్లి అండ్ కో ను ఐసీసీ మందలించినట్లు తెలుస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్.. -
IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం..?
కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా డీన్ ఎల్గర్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌పై థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ.. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లపై నుంచి వెళ్తుందనే కారణంగా థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు. ఈ సంబంధిత అధికారులతో పాటు ఫీల్డ్ అంపైర్ సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అనంతరం థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కోహ్లి.. స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి నోరుపారేసుకున్నాడు. కోహ్లితో పాటు అశ్విన్, కేఎల్ రాహుల్ సైతం మైక్ వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అంపైర్‌ను ఉద్దేశించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉండటంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ప్రవర్తన నియమావళి 2.8 ప్రకారం కోహ్లిపై ఓ మ్యాచ్‌లో నిషేధం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, డీన్ ఎల్గర్ డీఆర్ఎస్ కాల్ అనంతరం కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ''కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు, మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి'' అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 101/2 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించింది. ఓవర్ నైట్ బ్యాటర్ కీగన్ పీటర్సన్ 82 పరుగుల వద్ద ఔటయ్యాడు. పీటర్సన్ ఔటయ్యే సమయానికి స్కోర్ 155/3గా ఉంది. క్రీజ్‌లో వాన్ డెర్ డస్సెన్(18), బావుమా ఉన్నారు. దక్షిణాఫ్రికా.. తమ లక్ష్యానికి మరో 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Ind Vs Sa: కోహ్లి మరీ ఇంత చెత్తగా ప్రవర్తిస్తావా.. అసలేం అనుకుంటున్నావు? -
కోహ్లి చెప్పిందంతా చెత్త!
మెల్బోర్న్: ఈ ఏడాది మార్చిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘బుర్ర పని చేయని’ ఘటనను ఎవరూ మరచిపోలేరు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంతో రివ్యూ కోసం స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరుల సహాయం కోరే ప్రయత్నం చేయడం... దానిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభ్యంతరం వ్యక్తం చేయడం సిరీస్ మొత్తంలో అతి పెద్ద వివాదంగా నిలిచింది. మ్యాచ్ తర్వాత కూడా దీనిని తీవ్రంగా విమర్శించిన కోహ్లి... అంతకుముందు కూడా స్మిత్ రెండు సార్లు అలాగే చేశాడని, దాంతో తాను అంపైర్లకు ఫిర్యాదు కూడా చేశానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై మళ్లీ స్మిత్ పెదవి విప్పాడు. తన పుస్తకం ‘ది జర్నీ’లో దీని గురించి రాస్తూ కోహ్లి చేసిన ఆరోపణలను ‘చెత్త’ అంటూ కొట్టి పారేశాడు. ఇదంతా ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బ తీసేందుకు భారత్ పన్నిన వ్యూహంలో భాగమని అతను అన్నాడు. ‘ నేను అప్పటికే రెండు సార్లు రివ్యూ కోసం సహాయం కోరడం చూశానంటూ అంపైర్లకు తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పి మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి దీనికి ఆజ్యం పోశాడు. ఈ అంశం ఇంత పెద్ద వివాదంగా ఎందుకు మారిందో నాకు అప్పటికి గానీ అర్థం కాలేదు. నాకు తెలిసి నేను అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎలాంటి సూచనలు తీసుకోలేదు. నేను నిబంధనలను ఉల్లంఘించానంటూ ఆ తర్వాత కూడా మ్యాచ్ అంపైర్లు గానీ రిఫరీ క్రిస్ బ్రాడ్ గానీ నన్ను కనీసం అడగకపోవడమే అందుకు నిదర్శనం. సిరీస్‌లో వేడి పెంచేందుకు కోహ్లి తనదైన శైలిలో చేసిన పని అది. అసలు కోహ్లి సరిగ్గా ఏ విషయం గురించి ఆ ఆరోపణలు చేశాడో కూడా నాకు తెలీదు’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. సిరీస్ ముగిశాక కూడా ఐసీసీ నుంచి ఆ ఘటనల గురించి ఎలాంటి స్పందన రాలేదని, అసలు ఆ తర్వాత ఎప్పుడూ దాని గురించి విరాట్ వివరంగా మాట్లాడలేదన్న స్మిత్... ఆ తర్వాత తాము కలిసినప్పుడు కోహ్లి స్నేహపూర్వకంగానే ఉన్నాడని, తన దృష్టిలో అదంతా ఒక మిస్టరీగా మిగిలి పోయిందని తన మనసులో మాటను వెల్లడించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి ‘డెడ్’గా మారిపోయిన తర్వాత స్టంప్ మైక్రోఫోన్లలో వినిపించే సంభాషణలను బయట పెట్టరాదని... అయితే బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ సమయంలో బీసీసీఐ తమకు కావాల్సిన విధంగా వాటిని బయటపెట్టి ఆస్ట్రేలియాను తప్పు పట్టే ప్రయత్నం చేసిందని కూడా స్మిత్ ఆరోపించాడు. -
అలా ఐతే క్రికెట్లో మజా ఉండదు: గంభీర్
న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా-భారత్ జట్లు ఆటతో పాటు వివాదాలతోనూ ముందుకు సాగుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. స్లెడ్జింగ్ అనేది ఆటలో తప్పదని వ్యాఖ్యానించాడు. దానివల్ల ఆటలో భిన్న మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని సందర్భాలలో ఆసక్తికర అంశాలు జరుగుతాయని పేర్కొన్నాడు. బ్యాట్, బంతి వరకు మాత్రమే పరిమితమైతే క్రికెట్లో మజా ఉండదని, అయితే వ్యక్తిగత కక్ష పెంచుకునేందుకు మాత్రం పరిస్థితులు దారితీయకూడదని చెప్పాడు. 'ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఆటలో కాస్త మజా ఉండాలి. అయితే ఈ సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔట్ విషయంలో డీఆర్ఎస్ రివ్యూ కోసం చేసిన తప్పిదంతో ఆట మరింత రసవరత్తరంగా మారింది. ఆటగాళ్లు రోబోలేం కాదు కనుక కొన్నిసార్లు స్లెడ్జింగ్ చేస్తారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కొన్ని బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అయితే ఏం చేసినా వ్యక్తిగత దూషణ చేయకుండా.. ఆటవరకే అది పరిమితం కావాలి. గత రెండు టెస్టులు క్రికెట్ అభిమానులకే కాదు.. తాజా, మాజీ క్రికెటర్లకు వినోద విందును రుచిచూపించాయి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.