3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో పాకిస్థాన్ బొక్క బోర్లా పడింది. 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ 235 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆఖరి టెస్ట్‌లో115 పరుగుల తేడాతో ఓటమిపాలై, 0-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా పాక్ గడ్డపై దాదాపు రెండున్నర దశాబ్దాల (24 ఏళ్లు) చరిత్రను తిరగరాసింది. 1998/99లో మార్క్ టేలర్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు చివరిసారిగా పాక్ గడ్డపై సిరీస్ విజయం (1-0) సాధించింది. ఈ పర్యటనలోని తొలి రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.
కాగా, 351 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి రోజు ఆటను 73/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన పాక్.. ఓ దశలో చారిత్రక విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ బౌలర్లు నాథన్ లియోన్ (5/83), పాట్ కమిన్స్ (3/23) పాక్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీశారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (55), ఇమామ్ ఉల్ హక్ (70) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించగా, మిగతా వారంతా దారుణంగా నిరుత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగిన కమిన్స్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవగా, సిరీస్ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఉస్మాన్ ఖవాజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.
స్కోరు బోర్డు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 391 ఆలౌట్ (ఉస్మాన్ ఖ్వాజా 91, స్టీవ్ స్మిత్ 59, గ్రీన్ 79, అలెక్స్ క్యారీ 67, షాహీన్ అఫ్రిది 4/79, నసీమ్ షా (4/58))
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ 268 ఆలౌట్ (షఫీక్ 81, అజహర్ అలీ 78, బాబర్ ఆజమ్ 67, పాట్ కమిన్స్ 5/56, స్టార్క్ (4/33))
ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్ 227/3 డిక్లేర్డ్ (ఉస్మాన్ ఖ్వాజా 104 నాటౌట్, వార్నర్ 51)
పాకిస్థాన్ సెకెండ్ ఇన్నింగ్స్ 235 ఆలౌట్ (ఇమామ్ ఉల్ హాక్ 70, బాబర్ ఆజమ్ 55, నాథన్ లియోన్ (5/83), కమిన్స్ (3/23))
చదవండి: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment