భారత్ వేదికగా అక్టోబర్-5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం అగ్రశ్రేణి జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఇప్పటికే తమతమ ప్రొవిజనల్ జట్లను (దాదాపుగా ఇవే జట్లు వరల్డ్‌కప్ బరిలో నిలిచే అవకాశం ఉంటుంది) ప్రకటించాయి. ఆసీస్ తమ ప్రొవిజనల్ జట్టును ఆగస్ట్ 7న ప్రకటించగా.. ఇంగ్లండ్ తమ ప్రొవిజనల్ టీమ్ వివరాలను ఇవాళ (ఆగస్ట్ 16) వెల్లడించింది. ఆసీస్ జట్టులో లబూషేన్‌ను ఎంపిక చేయకపోవడం మినహాయించి ఎలాంటి సంచలనాలు నమోదు కాకపోగా.. అందరూ ఊహించిన విధంగానే బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు సౌతాఫ్రికా (ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టు) కూడా పరోక్షంగా తమతమ ప్రొవిజనల్ జట్టును ప్రకటించిన నేపథ్యంలో క్రికెట్ సర్కిల్స్ ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ జట్లలో ఏ జట్టు అత్యుత్తమంగా ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. సోషల్‌మీడియాలో జరుగుతున్న డిస్కషన్ ప్రకారమయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో పోలిస్తే ఇంగ్లండ్ టీమ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది.
డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లీష్ టీమ్ అన్ని విభాగాల్లో ఇతర జట్ల కంటే చాలా రెట్లు మెరుగ్గా ఉంది. ఆ జట్టులో విధ్వంసకర బ్యాటర్లు (బట్లర్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, మలాన్, రాయ్), అరివీర భయంకరులైన పేసర్లు (మార్క్ వుడ్, వోక్స్, స్టోక్స్, సామ్ కర్రన్), తమ స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేసే బౌలర్లు (మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఉన్నారు. వీళ్లు చాలదన్నట్లు వీరికి టాప్ క్లాస్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జతయ్యాడు. ఇలాంటి జట్టును కలిగిన ఇంగ్లండ్‌ను వరల్డ్‌కప్‌లో ఆపడం సాధ్యమా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ ప్రొవిజనల్ జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్
వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా ప్రొవిజనల్ జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా , ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్.
ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, సిసంద మగాలా, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షంషి, వేన్ పార్నెల్, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్
Comments
Please login to add a commentAdd a comment