కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ కగిసో రబడా అవార్డుల్లో మరోసారి రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్‌ఏ) అందజేసిన తాజా అవార్డుల్లో రబడా అత్యధికంగా ఆరు అవార్డులను గెలుచుకోవడం ద్వారా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు, టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ప్లేయర్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఫాన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, డెలివరీ ఆఫ్ ద ఇయర్ అవార్డులను రబడా కైవసం చేసుకున్నాడు. 2016లో అత్యధికంగా ఆరు అవార్డులు గెలుచుకుని ఐదు, అంతకంటే ఎక్కువ అవార్డులు గెలిచిన ఏకైక దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా నిలిచిన రబడా.. మరోసారి అవార్డుల్లో దుమ్మురేపాడు.
ప‍్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న రబడా రెండు సార్లు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల గెలుచుకున్న సఫారీ ఆటగాళ్ల జాబితాలో సైతం చేరిపోయాడు. అంతకుముందు రెండుసార్లు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న వారిలో హషీమ్ ఆమ్లా, జాక్వస్ కల్లిస్, ఎన్తిని, ఏబీ డివిలియర్స్‌లు ఉండగా, వారి సరసన రబడా నిలిచాడు. కాగా, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఏబీ డివిలియర్స్‌కు టీ 20 ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment