'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' రేసులో ధోని
ముంబై: క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరు మీద ఐసీసీ అందించే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కు స్థానం లభించింది. వన్డే ఆటగాళ్ల జాబితాలో ధోనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు అషిమ్ ఆమ్లా, జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), మైఖేల్ క్లార్క్(ఆసీస్), అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), కుమార సంగక్కారా(శ్రీలంక) పేర్లను చేర్చారు. భారత్ తరుపున నిలకడగా ఆడుతున్న ధోని ఒక్క్డడే ఈ రేసులో ఉండటం గమనార్హం. ఇండియా నుంచి శిఖర్ థావన్, రవీంద్ర జడేజాల పేర్లు ప్రస్తావనకు వచ్చినా, వీరి పక్కకు నెట్టిన ధోని అవార్డు రేసులో స్థానం సంపాదించాడు.
టెస్టు ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్, బ్యాట్స్మెన్ చటేశ్వరా పుజారాకు చోటు లభించింది. అషిమ్ ఆమ్లా, అండర్సన్, మైఖేల్ క్లార్క్లు ఇటు వన్డే జాబితాలోనూ, టెస్టు జాబితాలోనూ స్థానం సంపాదించడం విశేషం. దీనికి సంబంధించి మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్స్న్ వివరాలను వెల్లడించారు. 32 మందితో కూడిన ఐసీసీ ప్యానెల్ విజేతలను ఎంపిక చేస్తుందన్నారు.