Garfield Sobers
-
బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టు రసవత్తరంగా మారుతుంది. రెండో రోజు రెండో సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 26 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. అయితే తాను మొదటినుంచి చెప్పుకుంటున్న బజ్‌బాల్ ఆటను మరోసారి ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఫలితం సంగతి ఎలా ఉన్నా స్టోక్స్ మాత్రం తాను ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న స్టోక్స్ ఆ తర్వాత ఫాస్ట్‌గా ఆడాడు. అయితే ఏ జట్టైనా వికెట్లు కోల్పోతుంటే బ్యాటర్ కూడా స్లో ఆడడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టోక్స్ మాత్రం ఎదురుదాడి చేశాడు.ఇంగ్లండ్ 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 106 బంతుల్లో 80 పరుగులు చేసిన స్టోక్స్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఆరువేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్(13289 పరుగులు, 292 వికెట్లు), రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్(8032 పరుగులు, 235 వికెట్లు) ఉన్నాడు. చదవండి: #TamimIqbal: దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్‌తో మరో దిగ్గజం
ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో వన్డేకు భారత్ నుంచి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా సహా మరికొంతమంది ముఖ్య అతిథులుగా వచ్చారు. ఇదే మ్యాచ్‌కు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో సచిన్.. గారీ సోబర్స్‌తో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ''సర్ గారీతో లార్డ్స్‌లో మ్యాచ్ చూసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఇది నిజంగా స్పెషల్ మూమెంట్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక గార్ఫీల్డ్ సోబర్స్ వెస్టిండీస్ నుంచి వచ్చిన దిగ్గజ ఆల్‌రౌండర్. విండీస్ తరపున సోబర్స్ 93 టెస్టుల్లో 8032 పరుగులు సహా బౌలింగ్‌లో 235 వికెట్లు పడగొట్టాడు. వన్డే కెరీర్లో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా సోబర్స్ నిలిచాడు. కాగా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరిట 2004 నుంచి ఐసీసీ అవార్డు కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐసీసీ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును(ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్) పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది దక్కించుకున్నాడు. ఇక భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చెప్పినా సరిపోదు. క్రికెట్ గాడ్‌గా పేరు పొందిన సచిన్ క్రికెట్లో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు(టెస్టుల్లో 51, వన్డేల్లో 49) కొట్టిన తొలి ఆటగాడిగా సచిన్ చరిత్ర పుటల్లో నిలిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,246 పరుగులు సాధించాడు. ఇక రెండో వన్డే విషయానికి వస్తే.. ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రీస్ టాప్లీ ఆరు వికెట్లతో దుమ్మురేపడంతో భారత్ 143 పరుగులకే ఆలౌటైంది. అంతకముందు ఇంగ్లండ్ 49 ఓవర్లలో 243 పరుగులుకు ఆలౌట్ అయింది. ఇరుజట్ల మధ్య చివరి వన్డే(జూలై 17న) ఆదివారం జరగనుంది. Got to watch the game at Lord's with the One and Only Sir Gary!#SpecialMoment😀 pic.twitter.com/9WzYi91Z1a — Sachin Tendulkar (@sachin_rt) July 15, 2022 చదవండి: England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే Scott Styris: 'స్విచ్‌హిట్ బ్యాన్ చేస్తే ఎక్కువగా సంతోషించేది నేనే' -
'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' రేసులో ధోని
ముంబై: క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరు మీద ఐసీసీ అందించే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కు స్థానం లభించింది. వన్డే ఆటగాళ్ల జాబితాలో ధోనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు అషిమ్ ఆమ్లా, జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్), మైఖేల్ క్లార్క్(ఆసీస్), అలిస్టర్ కుక్(ఇంగ్లండ్), కుమార సంగక్కారా(శ్రీలంక) పేర్లను చేర్చారు. భారత్ తరుపున నిలకడగా ఆడుతున్న ధోని ఒక్క్డడే ఈ రేసులో ఉండటం గమనార్హం. ఇండియా నుంచి శిఖర్ థావన్, రవీంద్ర జడేజాల పేర్లు ప్రస్తావనకు వచ్చినా, వీరి పక్కకు నెట్టిన ధోని అవార్డు రేసులో స్థానం సంపాదించాడు. టెస్టు ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి ఆఫ్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్, బ్యాట్స్‌మెన్ చటేశ్వరా పుజారాకు చోటు లభించింది. అషిమ్ ఆమ్లా, అండర్సన్, మైఖేల్ క్లార్క్‌లు ఇటు వన్డే జాబితాలోనూ, టెస్టు జాబితాలోనూ స్థానం సంపాదించడం విశేషం. దీనికి సంబంధించి మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్స్న్ వివరాలను వెల్లడించారు. 32 మందితో కూడిన ఐసీసీ ప్యానెల్ విజేతలను ఎంపిక చేస్తుందన్నారు.