కేరెళ్లి గ్రామానికి చెందిన పెంటారెడ్డిని ఇంజినీర్లు అంతా కలిసి సన్మానిస్తున్న దృశ్యం
సాక్షి, ధారూరు: అన్నాదమ్ముళ్లిద్దరూ సేవాభావంతో విశే ష సేవలందిస్తున్నారు. డబ్బులకు ప్రాధాన్యత ఇ వ్వకుండా సంపాదించింది చాలు, ప్రజలకు ఎంతోకొంత సేవ చేద్దామన్న తపన వారిలో నాటుకుపోయింది. అన్న తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సలహాదారుగా పనిచేస్తూ సేవలందిస్తున్నారు. తమ్ముడు సర్పంచ్‌గా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. వారిది వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని కేరెళ్లి గ్రామం.
అన్న పెంటారెడ్డి ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొంది అమెరికాలో ఉన్న సమయంలో.. సీఎం కేసీఆర్ పిలిపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారునిగా నియమించారు. ఆయన ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించి అందరి మన్ననలు పొందారు. సీఎం కేసీఆర్ సైతం ఆయనను అభింనందించారు. దీంతో పెంటారెడ్డికి లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు రాగా గురువారం ఇంజినీర్స్‌డే సందర్భంగా ఆలిండియా ఇంజినీర్స్ అసోషియేషన్ సభ్యులు ఆయనను, ఆయన భార్య మంజులను హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఘనంగా సన్మానించారు. అవార్డును రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందజేసి సన్మానించారు. తమ్ముడు కె. నర్సింహారెడ్డి ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన స్వగ్రామంలో సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. కాతా అవార్డును అందుకున్న పెంటారెడ్డిని సోదరులు నర్సింహారెడ్డి, సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డిలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment