
దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అందించిన విశేష కృషికి గాను ప్రముఖ నటి, కలైమామణి డాక్టర్ కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్ చేస్తూ పక్వాన్ చెన్నై ఆధ్వర్యంలో 5వ వార్షిక రియలిస్టిక్ అవార్డ్స్ 2022 ప్రదానోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.
పక్వాన్ చెన్నై నిర్వాహకులు సంజయ్ డాంగి, అనిల్ డాంగి మరియు హితేష్ కొఠారి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల విజయాలను కొనియాడుతూ అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా చెన్నై కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్ ఎంవిఎస్ చౌదరి (చెన్నాల్ కస్టమ్స్ జోన్) పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో ప్రము ఖ నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment