జనార్ధన్ మిట్టాకు పురస్కారం అందిస్తున్న శ్రీదేవి తదితరులు
సాక్షి, చెన్నై: వివిధ భాషల్లో 25 వేలకు పైగా పాటలకు సితార వాయిద్య సంగీతాన్ని అందించిన పండిట్ జనార్ధన్ మిట్టాను ఘంటసాల జీవిత సాఫల్య పురస్కారం వరించింది. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరపున ఆదివారం జరిగిన ఘంటసాల శత జయంతి అంతర్జాల ఉత్సవాల్లో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఈమేరకు చెన్నైలో ఉంటున్న సితార విద్వాంసులు పండిట్ జనార్ధన్ మిట్టాకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సభ్యులు లేళ్లపల్లి రమేష్, శ్రీదేవి దంపతులతో పాటు మాడభూషి సంపత్ కుమార్, సంగీత కారులు కిడాంబి లక్ష్మీ కాంతం జ్ఞాపిక, ప్రసంసాపత్రం అందించి సన్మానించారు. సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందర రావు, ప్రధాన కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్, మాజీ ఉపరాష్ట్రపతి వి.వి.గిరి కోడలు మోహినీ గిరి ప్రసంగించారు. చివరిగా లేళ్లపల్లి రమేష్, శ్రీదేవి దంపతులు మిట్టా జనార్ధన్‌కు సంగీత చక్రాన్ని బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment