
జీఎం రావుకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.ఎం.రావుకు ఆసియన్ బిజినెస్ లీడర్‌షిప్ ఫోరం(ఏబీఎల్‌ఎఫ్) నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వరించింది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఏబీఎల్‌ఎఫ్ ఆరవ ఎడిషన్‌లో జీఎం రావు ఈ అవార్డును అందుకున్నారు. అంతర్జాతీయంగా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన సంస్థలు, వ్యక్తులకు ఏబీఎల్‌ఎఫ్ ఏటా అవార్డులతో సత్కరిస్తోంది.