Director Ram Gopal Varma Tweet On A Video Over Dance With Girl In Birthday Party Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆ వ్యక్తి నేను కాదు.. జో బైడెన్‌ మీద ఒట్టు!: వర్మ

Published Mon, Aug 23 2021 4:07 PM | Last Updated on Mon, Aug 23 2021 6:14 PM

Ram Gopal Varma Tweet On A Video Over Dance With Girl In Birthday Party - Sakshi

Ram Gopal Varma Dance Video: వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవల బిగ్‌బాస్‌ భామలు ఆరియాన, అషురెడ్డిలతో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఆరియానతో బోల్డ్‌ ఇంటర్య్వూ చేశాడు, అషురెడ్డిని డిఫరెంట్‌ యాంగిల్‌లో ఫొటో తీసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా మరో అమ్మాయితో బర్త్‌డే పార్టీలో హంగామా చేసి సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ అయ్యాడు. ఇందులో ఆర్జీవీ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దీంతో ‘ఇది ఆయనకేం కొత్త కాదుగా, అమ్మాయిలు, హీరోయిన్లతో రచ్చ చేయడం ఆయనకు మామూలే’ అని నెటిజన్లు చర్చించుకుంటున్న నేపథ్యంగా వర్మ అలాంటి వీడియో మరోకటి తన ట్వీటర్‌లో షేర్‌ చేసి షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్‌ అనుమానాస్పద మృతి..

‘మీ అందరికి ఓ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నేను కాదు. ఆ రెడ్‌డ్రెస్‌లో ఉన్న అమ్మాయి ఇనయా సుల్తానా అసలే కాదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మీద ఒట్టు’ అంటూ తనదైన స్టైల్‌లో ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ వీడియోలో వర్మ రంగీలా మూవీలోని పాటకు ఇనయాతో కలిసి స్టెప్పులు వేశాడు. అంతేగాక మధ్యలో ఆమె కాళ్లు పట్టుకుని విచిత్రంగా వ్యవహరించాడు. కాగా ఇనయా సుల్తానా ఆర్జీవీ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఆమె ధన్ రాజ్ హీరోగా వస్తోన్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.  ఈ క్రమంలో ‘బుజ్జి ఇలా రా’ యూనిట్ శనివారం ఆమె బర్త్ డే వేడుకను సెలెబ్రేట్ చేశారు. ఇందులో భాగంగా మద్యం సేవించిన ఆర్జీవీ ఆమెతో ఇలా డ్యాన్స్‌ చేశాడు.

చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement