
లుడోవిక్ వొర్బన్ (వృత్తంలో)
బర్త్‌డే పార్టీని మించిన ఈవెంట్ ఉండదు లోకంలో. ఎవరికి వారే కింగ్ / క్వీన్ ఆ రోజు. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. మరి ఆల్రెడీ కింగ్‌లో, క్వీన్‌లో అయినవాళ్లు బర్త్‌డే రోజు ఏమౌతారు? రొమేనియా ప్రధాని లుడోవిక్ వొర్బన్ మాత్రం అపరాధి అయ్యాడు! 52 వేల రూపాయల ఫైన్ కట్టాడు. మే 25న ఆఫీసులో ఆయన తన బర్త్ డే పార్టీ ఇచ్చారు. ముఖ్యులైన కేబినెట్ సభ్యులు కొందరు పార్టీకి హాజరు అయ్యారు. తాగారు. తిన్నారు. ఆనందించారు. ఆ ఫొటోలు బయటికి వచ్చాయి. మాస్కులు కట్టుకోకుండా, దూరం పాటించకుండా కరోనా ఆంక్షలు ఉల్లంఘించినందుకు, తలుపులు మూసి ఉంచిన గదిలో సిగరెట్ తాగినందుకు ప్రధాని సహా అందరూ అపరాధ రుసుము చెల్లించవలసి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment