
నాంపల్లి: మల్లేపల్లి డివిజన్ మాన్గార్ బస్తీలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తల్వార్లతో నృత్యం చేసిన తొమ్మిది మందిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించామని బీబ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఎం.నరేందర్ తెలిపారు. ఇన్‌స్పెక్టర్ కథనం ప్రకారం.. మాన్గార్ బస్తీలో సాయిరామ్ యాదవ్ అలియాస్ రాజు యాదవ్, అర్జున్‌లు బుధవారం రాత్రి తమ పుట్టిన రోజు వేడుకలను సుమారు 40 మంది అనుచరులతో కలిసి రోడ్డుపై జరుపుకున్నారు.
వీరంతా తాగి నృత్యం చేయగా, వీరిలో 9 మంది యువకులు తల్వార్లతో నృత్యం చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్వార్లు పట్టుకుని నృత్యాలు చేసిన వారిని అరెస్టు చేశారు. వీరిపై ఆయుధాల చట్టం యాక్టు కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: టీఆర్‌ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment