
వాషింగ్టన్: తన కుటుంబంలో జరగాల్సిన బర్త్‌డే వేడుకుల‍్లో పాల్గొనాలంటూ పంపిన ప్రియురాలి ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు బాధితురాలి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. అమెరికా కొలరాడో పోలీసులు కథనం ప్రకారం.. మే 9న కొలరాడోలో సాండ్రా అనే యువతి ఇంట్లో బర్త్‌డే పార్టీ జరగాల్సి ఉంది. అయితే ఆ బర్త్‌డే పార్టీకి ఆమె ప్రియుడు మాకియాస్‌ను ఆహ్వానించింది. కానీ, ప్రియురాలు అందించిన ఆహ్వానంపై అసహనం వ్యక్తం చేసిన మాకియాస్ బాధితురాలి బంధువులపై కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో సాండ్రాతో పాటు మెల్విన్ పెరెజ్(30) పెరెజ్ (33) జోనా క్రజ్(52),జోస్ గుటిరెజ్(21) జోస్ ఇబ్రారా(26) దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలరాడో పోలీస్ అధికారి నిస్కి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో యువతి సాండ్రా, ప‍్రియుడు మాకియాస్‌లు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు పంపిన ఆహ్వానంపై నిందితుడు కోపానికి గురై కాల్పులు జరిపినట్లు తేలింది.
గతంలో నిందితుడిపై ఎలాంటి నేర చరిత్రలేదు. నిందితుడు మాకియాస్ ఈ కాల్పులు ఎందుకు జరిపాడు? నిందితుడు వద్ద ఉన్న 15 రౌండ్ల మ్యాగజైన్ ఎక్కడిది? ప్రియురాలి ఆహ్వానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కాల్పులు జరిపాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు నిస్కి మీడియా సమావేశంలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment