girlfriend murder
-
వాట్సాప్ స్టేటస్‌గా గర్ల్ ఫ్రెండ్ డెడ్‌బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్‌ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్‌లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్‌గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్‌ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి
న్యూఢిల్లీ: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. దీనికి తోడు హత్య చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం మరింత గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసు వివరాలను ఢిల్లీ సౌత్ పోలీసు ఇన్ఛార్జ్ అంకిత్ చౌహాన్ తెలిపారు. 300 లీటర్ల ఫ్రిడ్జి కొని 24 ఏళ్ల యువతితో సహజీవనం చేసిన ప్రియుడు చివరికి ఆమె పాలిట మృత్యుపాశంగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయిదు నెలల క్రితమే ప్రియురాలని హత్య చేసినట్లు తేలింది. యువతిని అంతమొందించి.. ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా కోశాడు. అయితే ఆమె శరీర భాగాలను భద్రపరిచేందుకు ఓ భారీ(300 లీటర్ల) ఫ్రిడ్జిని కొనుగోలు చేశాడు. చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య దుర్వాసన రాకుండా అగర్బత్తీలు హత్య చేసిన 18 రోజుల్లో వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మొహహ్రౌలీ అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయటకు వచ్చి ముక్కలుగానరికిన శరీర భాగాలను పారేశాడు. అపార్ట్మెంట్ ఇరుగుపొరుగు వారికి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగర్బత్తిలు వెలిగించినట్లు అంగీకరించాడు. అంతేగాక అమెరికన్ క్రైం షో ‘డెక్స్టర్’ నుంచి ప్రేరణ పొంది ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికితోడు చెఫ్‌గా శిక్షణ పొందిన నిందితుడు మాంసం కత్తిని ఉపయోగించడంలో ప్రవీణుడని తేలింది. హత్యకు ముందు ఏం జరిగిందంటే ముంబైలో పనిచేస్తుండగా అఫ్తాబ్ అనే 28 ఏళ్ల యువకుడు శ్రద్ధా(26) యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో యువతి వాళ్ల ఇంట్లో వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్లో పనిచేస్తూ ఛతర్‌పూర్‌లోని అపార్ఠ్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. మే నెలలో ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెద్దగా అయ్యాయి. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా నిత్యం ఒత్తిడి తేవడంతో మే 18న ప్రియురాలిని అఫ్తాబ్ గొంతు కొసి చంపాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కూతురు సహజీవనం విషయంలో విభేదాలు రావడంతో తల్లిదండడ్రులు ఆమెతో మాట్లాడటం మానేశారు. అయితే కొంతకాలంగా శ్రద్ధా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఆమె స్నేహితురాలు చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి కూతురు కోసం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు హంతకుడిని ఐదు రోజుల కస్టడీకి తరలించారు. అటవీ ప్రాంతంలో కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవి మానవ అవశేషాలు కాదా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. నిందితుడు ఉపయోగించిన కత్తి ఇంకా లభ్యం కాలేదని పేర్కొన్నారు. -
బంధువుతో వివాహేతర సంబంధం.. వేరే వాళ్లతో కూడా సన్నిహితంగా ఉండటంతో..
తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రియురాలిని హతమార్చిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారైక్కాల్ సమీపం అక్కరైవట్టం గ్రామానికి చెందిన కందకుమార్ భార్య వసంతి (42). వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల క్రితం గొడవ పడి దంపతులు విడిపోయారు. కందకుమార్తో పెద్ద కుమార్తె, రెండో కుమార్తె ఉన్నారు. చిన్న కుమార్తెతో వసంతి నిట్టేస్వరంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అక్కరై వట్టంలో ఉన్న బంధువు సుందరమూర్తి (42)తో వసంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వసంతి ఇతరులతో సన్నిహితంగా ఉండడంతో సుందరమూర్తి ఖండించాడు. చదవండి: మనోడి రూటే సెపరేటు.. దొంగతనానికి వెళ్లే ముందు అది కంపల్సరీ! ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కారైకాల్ గోల్డెన్ నగర్లో ఇంటి పని చేస్తున్న వసంతి వద్దకు వచ్చిన సుందరమూర్తి దీనిపై గొడవ చేశాడు. చీరతోనే ఆమె గొంతు బిగించి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న కారైక్కాల్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వసంతి మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం కారైక్కాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి శుక్రవారం సుందరమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. -
పెళ్లి చేసుకుందాం.. ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు
ముంబై: ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆరు నెలలపాటు ప్రేమలో మునిగితేలారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తీరా కట్‌చేస్తే ప్రేమించిన లవర్‌కు మాయమాటలు చెప్పి ప్రియుడే అంతమొందించాడు. పెళ్లి పీటల ఎక్కాల్సిన యువతికి కెటామైన్ ఇంజక్షన్(డ్రగ్) ఇచ్చి కాటికి పంపాడు. మరి జీవితం పంచుకోవాలనుకున్న యువతిని చంపడానికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.. మహారాష్ట్రలోని నవీ ముంబైకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా కాలం గడుపుతున్న సమయంలో యువతికి ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసింది. ఇది జీర్ణించుకోలేకపోయిన యువకుడు.. ప్రియురాలికి దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో కొన్ని రోజుల నుంచి ఆమెతో నిత్యం గొడవ పెట్టుకుంటున్నాడు. ఓ రోజు తెగించి ఆమెకు మత్తుమందువంటి ఇంజక్షన్ ఇచ్చి హతమార్చాడు. అనంతరం తనకేం తెలియదన్నట్లు ఊరుకున్నాడు. అయితే మే 29న పన్వెల్ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె వద్ద ఎలాంటి ఐడీ పత్రాలు లేనందున పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా రమేశ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని తన సోదరిగా గుర్తించాడు. అయితే తన చెల్లికి పన్వెల్‌లోని ఆసుపత్రిలో పనిచేస్తున్న చంద్రకాంత్ గైకర్ అనే వ్యక్తితో ఎఫైర్ ఉందని పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని పోలీసులు పంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని వాళ్ల స్టైల్లో పోలీసులు విచారించడంతో గైకర్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆరు నెలలు మహిళతో ప్రేమలో ఉన్నట్లు, కానీ ఆమెకు ఇటీవల జబ్బు ఉందని తెలిసి వెంటనే పెళ్లి చేసుకుందామని బెదిదిస్తోందని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన తను ఆమెను చంపాలని నిర్ణయంచుకున్నట్లు తెలిపాడు. ఆ ఇంజక్షన్ అనారోగ్యాన్ని నయం చేస్తోందని అబద్ధం చెప్పి యువతికి కెటమైన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేసినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. నేరానికి సంబంధించిన సాక్షాలను నాశనం చేసేందుకు ఆమె మొబైల్లో ఫోన్, అన్ని వస్తువులు పెట్టి బయట పడేసినట్లు తెలిపాడు. చదవండి: ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది రాసలీల సీడీ కేసు: నా కూతురు ఆచూకీ చెప్పండి -
లవర్ ఆహ్వానంపై అసంతృప్తి, ఆరుగురిని చంపిన ప్రియుడు
వాషింగ్టన్: తన కుటుంబంలో జరగాల్సిన బర్త్‌డే వేడుకుల్లో పాల్గొనాలంటూ పంపిన ప్రియురాలి ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు బాధితురాలి కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. అమెరికా కొలరాడో పోలీసులు కథనం ప్రకారం.. మే 9న కొలరాడోలో సాండ్రా అనే యువతి ఇంట్లో బర్త్‌డే పార్టీ జరగాల్సి ఉంది. అయితే ఆ బర్త్‌డే పార్టీకి ఆమె ప్రియుడు మాకియాస్ను ఆహ్వానించింది. కానీ, ప్రియురాలు అందించిన ఆహ్వానంపై అసహనం వ్యక్తం చేసిన మాకియాస్ బాధితురాలి బంధువులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సాండ్రాతో పాటు మెల్విన్ పెరెజ్(30) పెరెజ్ (33) జోనా క్రజ్(52),జోస్ గుటిరెజ్(21) జోస్ ఇబ్రారా(26) దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలరాడో పోలీస్ అధికారి నిస్కి మాట్లాడుతూ.. ప్రాథమిక విచారణలో యువతి సాండ్రా, ప్రియుడు మాకియాస్లు సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సాండ్రా ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు పంపిన ఆహ్వానంపై నిందితుడు కోపానికి గురై కాల్పులు జరిపినట్లు తేలింది. గతంలో నిందితుడిపై ఎలాంటి నేర చరిత్రలేదు. నిందితుడు మాకియాస్ ఈ కాల్పులు ఎందుకు జరిపాడు? నిందితుడు వద్ద ఉన్న 15 రౌండ్ల మ్యాగజైన్ ఎక్కడిది? ప్రియురాలి ఆహ్వానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కాల్పులు జరిపాడా? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు నిస్కి మీడియా సమావేశంలో వెల్లడించారు. -
ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
-
ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య
ఇల్లంతకుంట (మానకొండూర్): పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో గురువారం జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతారానికి చెందిన వొల్లాల ఎల్లయ్య– భారతమ్మల చిన్న కొడుకు మధు(25) హైదరాబాద్‌లోని ఓ బ్రెడ్ కంపెనీలో కార్మికుడు. వీరి ఇంటి సమీపంలోనే ఉండే మిట్టపల్లి వెంకటమ్మ కుమార్తె సుస్మిత(22) బీఈడీ చదువుతోంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుష్మిత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరుకావడం, కూతురు పుట్టినప్పుడే తనను భర్త వదిలేసి వెళ్లటం, తనలాగే కూతురి జీవితం కాకూడదని భావించింది. వీరు దూరంగా ఉంటున్నట్లు నమ్మించేందుకు మధు హైదరాబాద్‌కు వెళ్లాడు. అయితే, గురువారం సిద్దిపేటలో మధు స్నేహితుడి వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన మధు సుస్మిత కు ఫోన్ చేశాడు. అప్పటికే కళాశాలకు వెళ్లిన సుస్మిత అనుమతి తీసుకొని ఎప్పుడూ కలుసుకునే ముస్కాన్‌పేటలోని కోళ్లఫారం వద్దకు వెళ్లింది. మధు కూల్‌డ్రింక్, క్రిమిసంహారక మందు తీసు కొచ్చాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో కలసి చనిపోదామని చెప్పాడు. సుస్మిత నిరాకరించి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, మధు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్నుపోయింది. తర్వాత ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. తర్వాత కోళ్లఫారంలో దూలానికి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందే విషయాన్ని సిద్దిపేటలోని స్నేహితుడికి అతడు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. స్నేహితులు వచ్చి చూడగా, ఇద్దరూ శవాలై కనిపించారు. ఇరువురి కుటుంబాలకు వారు సమాచారం అందించారు. -
పిస్టోరియస్ ను మళ్లీ దోషిగా తేల్చారు..
బ్లొమ్ఫోంటిన్ : గర్ల్ ఫ్రెండ్‌ను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ను దోషిగా దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు తేల్చింది. పిస్టోరియస్కు సంబంధించిన కేసుపై వచ్చిన అప్పీల్‌పై అక్కడి సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది. అయితే గతంలో ఇచ్చిన తీర్పు చాలా తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో ఈ కేసుపై పరిస్థితులు మరింత కఠినతరం అయ్యాయి. హౌస్ అరెస్ట్ కింద శిక్ష కాలాన్ని పూర్తి చేయడానికి స్థానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో నిందితుడికి తగిన శిక్ష విధించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన విషయం అందరికీ విదితమే. దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు గతంలో ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితోనే గర్ల్ ఫ్రెండ్‌ను హత్యచేశాడని జడ్జి జస్టీస్ ఎరిక్ లీచ్ మీడియాకు తెలిపారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం పిస్టోరియస్ను దోషిగా తేల్చుతూ తగిన శిక్ష విధించాలని ట్రయల్ కోర్టుకు కేసును తిప్పిపంపింది. 'బ్లేడ్ రన్నర్' ఆస్కార్ పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే.