పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటలో గురువారం జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతారానికి చెందిన వొల్లాల ఎల్లయ్య– భారతమ్మల చిన్న కొడుకు మధు(25) హైదరాబాద్‌లోని ఓ బ్రెడ్ కంపెనీలో కార్మికుడు. వీరి ఇంటి సమీపంలోనే ఉండే మిట్టపల్లి వెంకటమ్మ కుమార్తె సుస్మిత(22) బీఈడీ చదువుతోంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుష్మిత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరుకావడం, కూతురు పుట్టినప్పుడే తనను భర్త వదిలేసి వెళ్లటం, తనలాగే కూతురి జీవితం కాకూడదని భావించింది. వీరు దూరంగా ఉంటున్నట్లు నమ్మించేందుకు మధు హైదరాబాద్‌కు వెళ్లాడు.