
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(తమిళనాడు): ప్రియురాలిని హతమార్చిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారైక్కాల్ సమీపం అక్కరైవట్టం గ్రామానికి చెందిన కందకుమార్ భార్య వసంతి (42). వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ల క్రితం గొడవ పడి దంపతులు విడిపోయారు. కందకుమార్‌తో పెద్ద కుమార్తె, రెండో కుమార్తె ఉన్నారు. చిన్న కుమార్తెతో వసంతి నిట్టేస్వరంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అక్కరై వట్టంలో ఉన్న బంధువు సుందరమూర్తి (42)తో వసంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వసంతి ఇతరులతో సన్నిహితంగా ఉండడంతో సుందరమూర్తి ఖండించాడు.
చదవండి: మనోడి రూటే సెపరేటు.. దొంగతనానికి వెళ్లే ముందు అది కంపల్సరీ!
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కారైకాల్ గోల్డెన్ నగర్‌లో ఇంటి పని చేస్తున్న వసంతి వద్దకు వచ్చిన సుందరమూర్తి దీనిపై గొడవ చేశాడు. చీరతోనే ఆమె గొంతు బిగించి హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న కారైక్కాల్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వసంతి మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం కారైక్కాల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి శుక్రవారం సుందరమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment