
గ్రేసియా పుట్టిన రోజు వేడుకల్లో రైనా, చెన్నై ఆటగాళ్లు
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్‌లు హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విటర్ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది.
లీగ్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో చెన్నై తలపడనుంది. రైనా గారాలపట్టి వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆటగాళ్లు సందడి చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Here is your midnight dose of cuteness to begin a super happy Wednesday! #WhistlePodu #GraciaTurns2 @ImRaina @_PriyankaCRaina @msdhoni @DJBravo47 @Geeta_Basra 🦁💛 pic.twitter.com/UbIRi7m0F6
— Chennai Super Kings (@ChennaiIPL) 15 May 2018
Comments
Please login to add a commentAdd a comment