Raina
-
మరోసారి గ్రౌండ్లో దిగనున్న మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా.. రేటు ఎంతంటే..?
-
ధోనీ, రైనా వీర బాదుడు.. సంబరాల్లో సీఎస్కే ఫ్యాన్స్
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021) సెకెండ్ లెగ్ మ్యాచ్‌ల కోసం కొద్ది రోజుల కిందటే దుబాయ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ధోనీ, రైనా, అంబటి రాయుడు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ధోనీ, రైనా అయితే నెట్స్‌లో భారీ షాట్లు ఆడుతూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బంతి పడడమే ఆలస్యం.. వీర బాదుడు బాదుతూ.. మాంచి జోష్‌లో కనిపించారు. వీరి నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 1🤩 Shots!#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/lTlaQOmZHL — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 23, 2021 ఇందులో ధోనీ, రైనా బాధుడును చూసి సీఎస్కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌ల్లో తమ స్టార్లకు పట్టపగ్గాలుండవని కాలర్ ఎగరేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19న చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజన్లో చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌ల్లో ధోనీ, రైనా పెద్దగా రాణించింది లేదు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు ఫారిన్ ప్లేయర్, ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ జట్టుతో చేరడం సీఎస్కేలో నయా జోష్ వచ్చింది. చదవండి: తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్ క్రికెట్ చీఫ్‌గా ఫజ్లీ -
ధోనీని వేధించాను.. కిట్ బ్యాగ్ కూడా మోయించాను: రైనా
న్యూఢిల్లీ: సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని సరదాగా ఆటపట్టించిన సందర్భాన్ని సహచరుడు సురేష్ రైనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ధోనీతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం గురించి వివరిస్తూ.. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్‌కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటన గురించి రైనా వివరించాడు. 2018లో ఐర్లాండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ భాయ్ 12వ ఆటగాడిగా ఉన్నాడని, తాము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రింక్స్ అందించాడని పేర్కొన్నాడు. నేను క్రీజ్‌లో ఉన్నప్పుడు పదేపదే గ్లోవ్స్, బ్యాట్ల కోసం పిలుస్తుండటంతో.. ధోనీ నా కిట్ బ్యాగ్ మొత్తం మోసుకొచ్చాడని, తాను సరదాగా ఆటపట్టించాలని అనుకుంటే ధోనీ కాస్త సీరియస్‌గానే రియాక్ట్య్యాడని గుర్తు చేసుకున్నాడు. ఏం కావాలో ఒకేసారి తీసుకో, మళ్లీ మళ్లీ పిలవకని కోపడ్డాడని, దానికి బదులుగా నేను.. నా బ్యాట్ హ్యాండ్ గ్రిప్ తీసుకురా అని చెప్పడంతో భలే మంచోడివే దొరికావని అన్నాడని తెలిపాడు. మాహీ భాయ్ కోప పడటాన్ని తాను ఆస్వాధించానని, ఆ రోజు అతను నాకు దొరికాడని సంతోషించానని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా ధోనీతో జరిగిన మరో సరదా సంభాషణను రైనా వెల్లడించాడు. 2016లో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. దాంతో రైజింగ్ పుణే జట్టుకు ధోనీ, గుజరాత్ లయన్స్‌కు సురేష్ రైనా సారథ్యం వహించారు. ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా, నేను స్ట్రయిక్‌లో, బ్రెండన్ మెక్‌కలమ్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో, ఫస్ట్ స్లిప్‌లో డుప్లెసిస్, ధోనీ భాయ్ కీపింగ్ చేస్తున్నాడని, ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటే పొరుగింటి వాళ్లతో క్రికెట్ ఆడినట్టు అనిపించిందని వివరించాడు. పైగా నేను క్రీజులోకి వెళ్లినపుడు 'రండి కెప్టెన్ సాబ్' అని ధోనీ అన్నాడని, వస్తున్నాను భాయ్.. ముందు మీరు జరగండి అని నేను బదులిచ్చానని గుర్తు చేసుకున్నాడు. కాగా, రైనా, ధోనీ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకే రోజు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ప్రస్తుతం వారిద్దరూ చెన్నై జట్టుకు ఆడుతున్నారు. -
బట్లర్ జట్టులో విధ్వంసకర వీరులకు దక్కని చోటు
లండన్: ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్ టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో తనతో పాటు టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఓపెనర్‌గా ప్రకటించాడు. అయితే బట్లర్ ఎంపిక చేసిన జట్టులో విధ్వంసకర వీరులైన గేల్, వార్నర్, ధవన్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. వీరితో పాటు అతను మిస్టర్ ఐపీఎల్ రైనాను కూడా పక్కన పెట్టాడు. మిడిలార్డర్లో టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, సీఎస్కే సారధి ధోనీలను తీసుకున్నాడు. ధోనీని ఆరాధ్య క్రికెటర్‌గా భావించే బట్లర్.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఎంచుకున్నాడు. ఇక ఆటకు దూరంగా ఉన్న మిస్టర్ 360 ఆటగాడు డివిలియర్స్‌ను ఎంపిక చేయడాన్ని ఆయన సమర్ధించుకున్నాడు. ఆల్‌రౌండర్ల కోటాలో విండీస్ విధ్వంసకర యోధుడు పోలార్డ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. పేస్ విభాగాన్ని భారత పేసు గుర్రం బుమ్రా, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగాలతో భర్తీ చేశాడు. ఈ ముగ్గురు కొత్త బంతిని స్వింగ్ చేయడంతో పాటు డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో సమర్ధులని వీరి వైపు మొగ్గు చూపానన్నాడు. స్పిన్ విభాగంలో జడేజాకు తోడుగా హర్భజన్ సింగ్‌ను ఎంపిక చేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 150కి పైగా వికెట్లు తీసిన హర్భజన్ అనుభవం జట్టుకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. జట్టు వివరాలు: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కీపర్), కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, లసిత్ మలింగా. చదవండి: కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి -
ముగ్గురు తల్లుల ముచ్చట
కాలేజీ రోజుల నుంచి కన్న కల వారికి పిల్లలు పుట్టిన తర్వాత నెరవేరింది. వియని, పూనమ్, రైనా ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఉండేది ముంబయ్‌లో. ఈ ముగ్గురూ కలిసి ఏదైనా మంచి గుర్తింపు వచ్చే వ్యాపారం చేయాలని కలలు కన్నారు. ముగ్గురూ కాలేజీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల్లో చేరారు. రోజులో ఎక్కువ సమయం ఉద్యోగానికే కేటాయించేవారు. పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఓ వైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల పనులతో తీరికలేకుండా ఉండేవారు. ఆ సమయంలోనే పిల్లల దుస్తుల బ్రాండ్ ప్రారంభించాలనుకున్నారు. ముగ్గురూ ఒక్కొక్కరూ రూ.30 వేలతో రెండేళ్ల క్రితం ‘ఓయి ఓయి’ అనే పేరుతో కిడ్స్ బ్రాండ్‌ని ప్రారంభించారు. దానర్ధం ఫ్రెంచ్‌లో ‘ఎస్ ఎస్’. ‘నేను తల్లినయ్యాక ఇంటి నుండి ఆఫీసు పని చేసేదాన్ని. ఒక రోజు నా పై అధికారి వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు, ఉద్యోగం వదులుకోమని చెప్పారు’ కొన్ని కంపెనీలు ఇప్పటికీ పని చేసే తల్లుల స్థితిని పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమె ఈ పరిస్థితిని చెబుతూ ‘మేం ముగ్గురం చిన్నప్పటి నుంచీ స్నేహితులం. మాకు ఒకరి స్వభావాలు మరొకరికి బాగా తెలుసు. మా ముగ్గురికీ చిన్నపిల్లలు ఉన్నారు. మేం ఈ వ్యాపారం ప్రారంభించాక ఒక్కొక్కరం ఒక్కోసారి వీలును బట్టి వర్క్ చేసుకునే అవకాశం లభించింది’ అని తెలిపారు వియని. రెండేళ్ల క్రితం ప్రారంభం ‘2018లో ముందు తెలిసిన వారి ద్వారా, ఇన్‌స్ట్రాగామ్ ఆర్డర్ల ద్వారా మా వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నాం. ఇందుకు మా బ్రాండ్ దుస్తులను మా పిల్లలకే వేసి ఫొటో షూట్ చేయించాం. వాటిని ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశాం. దీంతో మా ఫ్రెండ్స్, ఇతర కుటుంబ సభ్యులు, తెలిసినవారు మా నుండి బట్టలు కొన్నారు. వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చినప్పుడు మా ఇన్సా ్టగ్రామ్ ఖాతాలో వాటిని పోస్ట్ చేస్తూ ఆర్డర్లను పెంచడంపై దృష్టి పెట్టాం’ అని రైనా చెప్పారు. ‘మొదట్లో పెద్దగా డబ్బు సంపాదించకపోయినా ఆర్డర్ రాగానే మెటీరియల్ తేవడం, డిజైనింగ్ చేయడం.. త్వరగా వినియోగదారునికి అందించడం చేసేవాళ్లం. ఎంతోమంది చిన్నారులను మా దుస్తులతో అందంగా ఉంచుతున్నాం అనే ఆలోచన మాలో హుషారుని ఇచ్చింది’ అని వియని చెప్పారు. సెలబ్రిటీల నుంచి... ఇన్స్టాగ్రామ్ ద్వారా త్వరలోనే ప్రముఖుల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇనాయా ఖేము, తైమూర్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మెహర్ బేడి ధుపియా వంటి పిల్లలంతా ప్రముఖ సెలబ్రిటీల పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలే మా ‘బుల్లి క్లయింట్లు’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ముగ్గురు తల్లులు. శోభా డే మనవరాళ్ళు, లిసా రే కుమార్తెలు వీరి ప్రచారంలో ఇప్పుడు భాగమయ్యారు. ‘ఓయి ఓయి’ కి మిగతా ఆన్లైన్ షాపింగ్ సైట్స్ వేదికగా నిలిచాయి. ట్రిక్స్ అండ్ టిప్స్ సరసమైన ధరలకు స్మార్ట్ క్యాజువల్ బ్రాండ్‌ని అందిస్తూ వచ్చారు. తల్లిదండ్రులకు పెప్పీ ప్రింట్ల నుండి పలాజో సెట్ల వరకు ఒకే చోట దొరికే సదుపాయం కల్పించారు. దీంతో వ్యాపారాన్ని షాపుల ద్వారానూ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో హాప్స్కాచ్తో ‘ఓయి ఓయి’ని విజయవంతంగా ప్రారంభించారు. లిటిల్ మఫెట్, ఫస్ట్క్రీ, మింత్రాతో కలిసి పనిచేయడం ఈ బ్రాండ్‌కు మరింత సహాయపడింది. ఆర్డర్లు .. అవార్డులు రెండుసార్లు కిడ్స్స్ట్రాపెస్, ఇండియా కిడ్స్ బ్రాండ్ అవార్డు, స్మార్ట్ దుస్తులు పిల్లల విభాగంలో అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లలో ఒకటిగా పేరు సంపాదించింది ఓయి ఓయి. 2021 నాటికి నెలకు 10,000 ఆర్డర్లు పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ 3 మామ్స్. కోవిడ్–19 ప్రభావం ఈ బ్రాండ్ కార్యకలాపాలపైనా చూపింది. అయితే లాక్డౌన్ ముగిసిన నాటి నుంచి అత్యధిక అమ్మకాలూ జరిగాయని ఈ ముగ్గురు తల్లులూ సగర్వంగా చెబుతున్నారు. -
మాకొద్దీ యోయో టెస్టు!
చెన్నై: ఐపీఎల్ బరిలోకి దిగబోతున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ‘ఓల్డేజ్ హోం’గా చెప్పవచ్చు. ధోని (37 ఏళ్లు), బ్రేవో (35), డు ప్లెసిస్ (34), హర్భజన్ (38), రాయుడు (33), మురళీ విజయ్ (34), వాట్సన్ (37), జాదవ్ (33), తాహిర్ (39 ఏళ్లు)లతో ఈ జాబితా బాగా పెద్దగానే ఉంది. గత ఏడాది జట్టును విజేతగా నిలపడంలో వీరిలో చాలా మంది కీలక పాత్ర పోషించినా... ఫిట్నెస్ పరంగా అందరూ అంతంత మాత్రమే. వీరందరికీ ‘యోయో టెస్టు’ పెడితే ఫలితాలు ఎలా ఉండవచ్చో ఊహించుకోవచ్చు! బహుశా ఇదే కారణంతో కావచ్చు చెన్నై తమ ఆటగాళ్లకు యోయో టెస్టు ఉండదని ప్రకటించేసింది. టీమిండియాకు ఇది తప్పనిసరిగా మారినా, అందరూ అదే అమలు చేయాల్సిన అవసరం లేదని చెన్నై ట్రైనర్ రాంజీ శ్రీనివాసన్ అన్నాడు. ఫుట్‌బాల్‌లాంటి ఆటలకు మాత్రమే అది అవసరం ఉంటుందని అతను తేల్చి చెప్పాడు. యోయోకు బదులుగా తమ ఆటగాళ్లను పరీక్షించేందుకు 2 లేదా 2.4 కిలోమీటర్ల పరుగు మాత్రమే నిర్వహిస్తున్నామని రాంజీ వెల్లడించారు. ‘బోల్ట్ స్ప్రింట్ చేస్తే నేను కూడా అదే చేయాలని లేదు. కోహ్లి చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు. అందరు ఆటగాళ్లు భిన్నంగా ఉంటారని తెలుసుకోవాలి. కాబట్టి యోయో అందరికీ అవసరం లేదని గుర్తించాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో చెన్నై అటగాళ్ల సందడి
-
గ్రేసియా పుట్టినరోజు.. చెన్నై సందడి..
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్‌లు హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విటర్ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. లీగ్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో చెన్నై తలపడనుంది. రైనా గారాలపట్టి వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆటగాళ్లు సందడి చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. Here is your midnight dose of cuteness to begin a super happy Wednesday! #WhistlePodu #GraciaTurns2 @ImRaina @_PriyankaCRaina @msdhoni @DJBravo47 @Geeta_Basra 🦁💛 pic.twitter.com/UbIRi7m0F6 — Chennai Super Kings (@ChennaiIPL) 15 May 2018 -
రైనా తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం
చెన్నై: టీమిండియాకు దూరమైనా... ఐపీఎల్ పది సీజన్లలో ఒక్క మ్యాచ్‌కు దూరం కాని రికార్డు సురేశ్ రైనాది. కానీ... గాయంతో ఈసారి రెండు మ్యాచ్‌లకు గైర్హాజర్ కానున్నాడు. కోల్‌కతాతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కండరాల నొప్పితో సతమతమైన చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్... తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో 15న పంజాబ్, 20న రాజస్తాన్‌లతో జరిగే మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడని చెన్నై జట్టు వర్గాలు వెల్లడించాయి. -
చెన్నైకి ఎదురుదెబ్బ..రెండు మ్యాచ్‌లకు రైనా దూరం
సాక్షి, స్పోర్ట్స్ : ఐపీఎల్ మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పాయింట్ల లిస్టులో తొలిస్థానంలో ఉన్న చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్కే)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు సురేన్ రైనా గాయంతో తర్వాతి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీంతో వచ్చే ఆదివారం(ఏప్రిల్ 15న) కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 20న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లకు రైనా లేకుండానే సీఎస్కే బరిలోకి దిగుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ వేసిన 10వ ఓవర్లో సింగిల్ తీసే సమయంలో రైనా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. కాలి గాయానికి వారం రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో సీఎస్కే ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎస్కే ఆటగాడు కేదార్ జాదవ్ సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెల్సిందే. తాజాగా రైనా కూడా గాయపడటం సీఎస్కేకి పెద్ద ఎదురు దెబ్బే. చేతివేలి గాయంతో బాధపడుతున్న ఫాఫ్ డుప్లెసిస్ ఆదివారం మ్యాచ్ నాటికి కోలుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్ సమయంలో గాయపడిన మురళీ విజయ్ ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయారు. తర్వాత కోలుకున్నా కోల్కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. రైనా గాయపడటంతో ఆయన స్థానంలో మురళీ విజయ్‌కు ఆడే అవకాశం రావచ్చు. -
నేటి నుంచి మొయినుద్దౌలా టోర్నీ
►బరిలో 10 జట్లు ►ఎయిరిండియా తరఫున రైనా సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా హైదరాబాద్ క్రికెట్లో అంతర్భాగంగా ఉన్న ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ నెల 31న ఫైనల్ నిర్వహిస్తారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష, కార్యదర్శులు జి.వివేకానంద్, టి.శేష్ నారాయణ్ టోర్నమెంట్ విశేషాలను వెల్లడించారు. 1930 నుంచి జరుగుతున్న ఈ టోర్నీని ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 10 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ప్రత్యర్థులతో నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్–2 టీమ్‌లు సెమీస్‌కు చేరతాయి. గ్రూప్ ‘ఎ’లో హెచ్‌సీఏ ఎలెవన్, ఆంధ్ర కోల్ట్స్, కాగ్, గోవా, విదర్భ జట్లు... గ్రూప్ ‘బి’లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఎయిరిండియా, బరోడా, కేరళ, కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్లు ఉన్నాయి. ‘తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఈసారి కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ జట్టును ఆడిస్తున్నాం. ఈ టీమ్‌తో పాటు హెచ్‌సీఏ తరఫున బరిలోకి దిగుతున్న రెండు జట్లలో కూడా ఆటగాళ్లను పూర్తిగా వారి ప్రతిభ, స్కోర్లను బట్టే ఎంపిక చేశాం. ఈ విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి ప్రదర్శించలేదు’ అని వివేకానంద్ చెప్పారు. టోర్నీలో పాల్గొంటున్న జట్లలో ఎక్కువ మంది వర్ధమాన ఆటగాళ్లే ఉన్నారు. అయితే ఇటీవల భారత జట్టులో చోటు కోల్పోయిన సురేశ్ రైనా ఎయిరిండియా తరఫున బరిలోకి దిగుతున్నాడు. అతనితో పాటు టెస్టు ఆటగాడు జయంత్ యాదవ్, నమన్ ఓజా, రజత్ భాటియా మాత్రమే కాస్త గుర్తింపు ఉన్న క్రికెటర్లు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 లక్షలు. ‘అసలు’ బంగారాన్ని తీసుకురండి... మీడియా సమావేశంలో మొయినుద్దౌలా వారసులు ఫక్రుద్దీన్, నిఖత్ కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల క్రితం అసలు గోల్డ్ కప్‌ను ఎవరో దొంగిలించి దాని స్థానంలో నకిలీది ఉంచారని ఆరోపణలు వచ్చాయి. దానిపై పలు విధాలుగా విచారణ జరిపినా అసలేం జరిగిందో మాత్రం తేలలేదు. ఇప్పుడైనా తమ తాతగారు ఇచ్చిన అసలు గోల్డ్ కప్‌ను కనుగొనాలని ఫక్రుద్దీన్ కోరారు. దీంతో పాటు గతంలో ఉన్న విధంగా హెచ్‌సీఏ మొయినుద్దౌలా క్లబ్ జట్టును కూడా పునరుద్ధరించాని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ తగు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అసలు బంగారంతో మరో కప్‌ను సిద్ధం చేస్తామని చెప్పారు. నేటి మ్యాచ్‌లు హెచ్‌సీఏ ఎలెవన్(vs)ఆంధ్ర కోల్ట్స్ గోవా(vs) విదర్భ హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్(vs) కేరళ బరోడా(vs) కంబైన్డ్ డిస్ట్రిక్స్ ఎలెవన్ -
‘యువ’ మెరుపుల్...
ఐపీఎల్–10లో యువ ఆటగాళ్ల హవా ‘యువరాజ్, రైనాలను కలిపి చూస్తే రిషభ్ పంత్. అంతలా నన్ను ఆకట్టుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో అతను ఆడిన తీరు అద్భుతం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ బౌలింగ్ సూపర్. సిరాజ్, థంపి భవిష్యత్ బౌలింగ్‌కు భరోసా కల్పించారు’ యువ కెరటాలపై సచిన్ కామెంట్స్ ఇవి. నిజమే... ఈ బ్యాటింగ్ దిగ్గజం అన్నట్లు ఐపీఎల్–10కు ఈ యువధీరులంతా కొత్త శోభ తెచ్చారు. – సాక్షి క్రీడావిభాగం ♦ భవిష్యత్ ఆశాకిరణాల్లో కచ్చితంగా రిషభ్ పంత్ ఒకడు. 19 ఏళ్ల ఈ ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఈ సీజన్లో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా చేజింగ్‌లో అతని ఎదురుదాడి అద్భుతం. తమ తొలి మ్యాచ్‌లో బెంగళూరుకు చుక్కలు చూపించిన పంత్ (57)... ప్రత్యర్థి జట్టును ఓడించినంత పని చేశాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక గుజరాత్ లయన్స్ పాలిట సింహ స్వప్నంగా మారాడు. సిక్సర్ల జడివానతో పరుగుల వర్షం (56 బంతుల్లో 97; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) కురిపించాడు. ఐపీఎల్–10లో ఇది ఆరో అత్యుత్తమం. ఓవరాల్‌గా 165.61 స్ట్రయిక్ రేట్‌తో 366 పరుగులు చేశాడు. ♦ ముంబై ఇండియన్స్ యువ సంచలనం నితీశ్ రాణా. ఈ 23 ఏళ్ల బ్యాట్స్‌మన్ జట్టు కీలక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. చేజింగ్‌లో విన్నింగ్ పెర్ఫార్మెన్స్కు పెట్టింది పేరు. కోల్‌కతాతో జరిగిన పోరులో భారీ లక్ష్యఛేదనలో 28 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అతని జోరుముందు చక్కని బౌలింగ్ వనరులున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పప్పులూ ఉడకలేదంటే అతిశయోక్తికాదు. అనుభవజ్ఞులైన రోహిత్‌శర్మ, బట్లర్, పొలార్డ్‌లు విఫలమైన చోట వీరోచిత పోరాటం చేశాడు. ముంబైకి వరుస విజయాలందించాడు. గుజరాత్, పంజాబ్‌ల బౌలింగ్‌నూ చీల్చి చెండాడాడు. ఈ సీజన్లో ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లోనే 30.27 సగటుతో 333 పరుగులు చేశాడు. ♦ రాహుల్ త్రిపాఠి... ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపిన బ్యాటింగ్ సెన్సేషన్. ధోని మార్గదర్శనంలో ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన ఈ యువ బ్యాట్స్‌మన్ వచ్చిన అవకాశాల్ని చక్కగా సద్విని యోగం చేసుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 391 పరుగులు చేసిన రాహుల్ ఈ సీజన్ టాప్–10 స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఓపెనింగ్‌లో విలువైన భాగస్వామ్యాలు జతచేసిన త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు)... కోల్‌కతాపై ఒంటిచేత్తో గెలిపించాడు. స్టోక్స్ సహా స్మిత్, ధోని పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడిన ఈడెన్ గడ్డపై సిక్సర్ల మోత మోగించాడు. ♦ యార్కర్ల సూపర్ పేసర్ బాసిల్ థంపి. ఈ లీగ్‌లో గుజరాత్ లయన్స్ తరఫున ఆకట్టుకున్న యువ బౌలర్. వికెట్ల పరంగా (11) గొప్ప ప్రదర్శన కాకపోవచ్చు. కానీ అతని బౌలింగ్ తీరు... దూసుకెళ్లే బంతుల్లో పదును... అంత ఆషామాషీ కాదు. అందుకే ఐపీఎల్ జ్యూరీ అతని ప్రదర్శనను గుర్తించింది. ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును అందించింది. గంటకు 140 కి.మీ. స్థిరమైన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించే సహజమైన శైలి అతని సొంతం. అతని షోకు ఒక్క సచినే కాదు... భారత కెప్టెన్ కోహ్లి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కితాబిచ్చారు. ♦ విదేశీ ఆటగాళ్లలో సూపర్ సర్ప్రైజ్ మాత్రం సునీల్ నరైన్‌దే! కోల్‌కతా నైట్‌రైడర్స్ గత టైటిల్ విజయాలకు స్పిన్ మంత్రాన్ని నమ్ముకుంది. కానీ ఈసారి బ్యాట్‌తో అది కూడా... ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా నరైన్ ఆల్‌రౌండర్ అవతారమెత్తాడు. అతని దూకుడు ఎలా ఉందంటే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కూడా ఆ వేగాన్ని అందుకోలేకపోయారు. అందుకే ఈ సీజన్లోనే వేగవంతమైన అర్ధసెంచరీ అవార్డు అతని బ్యాట్‌నే వరించింది. ఈ సీజన్లో నరైన్ 172.30 స్ట్రయిక్ రేట్‌తో 224 పరుగులు చేశాడు. మేటి బ్యాట్స్‌మెన్ అయిన డివిలియర్స్ (216), గేల్ (200), యూసుఫ్ పఠాన్ (143), కోరే అండర్సన్ (142)ల కంటే ముందు వరుసలో ఉన్నాడు. అలాగని బౌలింగ్‌లో విఫలం కాలేదు. 6 పరుగుల ఎకానమి రేట్‌తో 10 వికెట్లు కూడా తీశాడు. బెంగళూరుపై నరైన్ 15 బంతుల్లోనే చేసిన అర్ధసెంచరీ ఈ టోర్నీలోనే హైలైట్‌గా నిలిచింది. ♦ వేలంలో అందరి కళ్లు బెన్ స్టోక్స్‌పైనే! అంచనాలకు అనుగుణంగా రూ.14.5 కోట్లతో రైజింగ్ పుణే పంచన చేరిన స్టోక్స్... కొన్ని ఆరంభ మ్యాచ్‌ల్లో తేలిపోయినా... తర్వాత తన విలువేంటో చూపాడు. ఈ సీజన్లో నమోదైన ఐదు సెంచరీల్లో అతనిదీ ఓ శతకముంది. మరో వైపు రూ. 12 కోట్లు పెట్టి బౌలర్ టైమల్ మిల్స్‌ను కొనుగోలు చేసిన బెంగళూరు జట్టుకు అతను ఏమాత్రం ఉపయోగపడలేదు. ఐదు మ్యాచ్‌లే ఆడిన అతను ఐదు వికెట్లు తీసి నిరాశపరిచాడు. -
'చహల్' చల్
► 6 వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ ► చివరి టి20లో భారత్ సంచలన విజయం ► 75 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు ► 2–1తో సిరీస్ కోహ్లి సేన సొంతం ‘ఆరో నంబర్’ ఆటగాడు అద్భుతం చేశాడు. తన మణికట్టు మాయాజాలం చూపిస్తూ చిన్నస్వామి మైదానంలో చరిత్రను తిరగరాశాడు. గుగ్లీలు, ఫ్లిప్పర్లతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను విలవిల్లాడించిన యజువేంద్ర చహల్ భారత జట్టుకు ఆహా అనిపించే గెలుపును అందించాడు. తన తొలి ఓవర్లో వికెట్‌తో శుభారంభం... మూడో ఓవర్లో వరుస రెండు బంతుల్లో కీలక బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసి ప్రత్యర్థి కోట బద్దలు... చివరి ఓవర్లో మరో మూడు వికెట్లు... గతంలో ఏ భారత బౌలర్‌కూ సాధ్యం కాని రీతిలో ఆరు వికెట్లతో లెగ్‌స్పిన్నర్ చహల్ ఆటాడుకున్నాడు. టెస్టులు, వన్డేల బాటలోనే ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ కూడా గెలిచి భారత్ తమ విజయాల జోరును పరిపూర్ణం చేయగా, ఇంగ్లండ్ నిరాశతో పర్యటనను ముగించింది. ముందుగా ధోని, రైనా మెరుపులకు తోడు యువరాజ్ పవర్ కూడా జత కలిసి భారత్ 202 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అయితే మైదానం చిన్నది, గత రికార్డు వల్ల ఇది అసాధ్యమైన లక్ష్యంలా అనిపించలేదు. ఒకదశలో 119/2తో ఇంగ్లండ్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ సమయంలో చహల్ దండయాత్ర మొదలైంది. అతనికి తోడుగా బుమ్రా నిలిచాడు. అంతే... ఇంగ్లండ్ ఆటగాళ్లు అవుటయ్యేందుకు క్యూలో నిలబడ్డారు. 19 బంతుల వ్యవధిలో కేవలం 8 పరుగులకు తమ చివరి 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ తలవంచింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ సున్నాకే పరిమితమైన స్థితిలో ఆ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా, భారత ఆటగాళ్ల సంబరాలకు అంతులేకుండా పోయింది. బెంగళూరు: తొలి రెండు టి20ల్లో అంతంత మాత్రం ప్రదర్శన కనబర్చిన భారత్ కీలకమైన చివరి మ్యాచ్‌లో జూలు విదిల్చింది. భారీ స్కోరు చేయడంతో పాటు ప్రత్యర్థిని కుప్పకూల్చి సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టి20లో భారత్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సురేశ్ రైనా (45 బంతుల్లో 63; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. రెండో వికెట్‌కు రాహుల్‌తో 37 బంతుల్లో 61 పరుగులు జోడించిన రైనా, ఆ తర్వాత మూడో వికెట్‌కు ధోనితో 37 బంతుల్లో 55 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత చహల్ (6/25) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ 16.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. రూట్ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్ (21 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–1తో నెగ్గింది. చహల్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. పరుగుల మోత... సిరీస్‌లో వరుసగా మూడోసారి కూడా టాస్ ఓడిన భారత్ మూడోసారి కూడా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో ఆడిన మనీశ్ పాండే స్థానంలో రిషభ్ పంత్‌కు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. రెండో ఓవర్ తొలి బంతికే లేని పరుగు కోసం ప్రయత్నించి రాహుల్‌తో సమన్వయ లోపంతో కోహ్లి (2) రనౌట్ కావడంతో భారత్‌కు షాక్ తగిలింది. అయితే ఈ దశలో రైనా, రాహుల్ (18 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జోరు తగ్గకుండా బ్యాటింగ్‌కు కొనసాగించారు. చాలా కాలం తర్వాత తనదైన శైలిలో ఆడిన రైనా సిక్సర్లతో చెలరేగాడు. జోర్డాన్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో 14 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 53 పరుగులకు చేరింది. అలీ వేసిన బంతిని స్టేడియం బయటకు కొట్టిన తర్వాత మరుసటి ఓవర్లో రాహుల్ బౌల్డ్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. స్టోక్స్ వేసిన ఈ బంతి ‘నోబాల్’ అయినా, అంపైర్లు దానిని గుర్తించలేకపోయారు. మరోవైపు రైనా దూకుడు కొనసాగింది. రషీద్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో 39 బంతుల్లోనే రైనా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో ధోని మెరుపు షాట్లు భారత్‌కు భారీ స్కోరు అందించాయి. యువరాజ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు) కూడా క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు శివాలెత్తాడు. తొలి పది ఓవర్లలో 78 పరుగులు చేసిన భారత్, తర్వాతి పది ఓవర్లలో 124 పరుగులు చేయడం విశేషం. టపటపా... ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే బిల్లింగ్స్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం రాయ్ (23 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్), రూట్ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ధాటిగా ఆడిన వీరిద్దరు రెండో వికెట్‌కు 29 బంతుల్లోనే 47 పరుగులు జోడించిన తర్వాత మిశ్రా బౌలింగ్‌లో రాయ్ వెనుదిరిగాడు. రూట్ జాగ్రత్తగా ఆడగా, మోర్గాన్ చెలరేగిపోయాడు. ఈ దశలో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే చహల్ వరుస బంతుల్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది. ఆ తర్వాత బుమ్రా కూడా విజృంభించడంతో కొద్ది సేపటికే భారత జట్టు విజయం ఖాయమైంది. అసహనం నుంచి అభినందనల వరకు... తన తొలి బంతికి సిక్సర్ ఇచ్చిన చహల్ మూడో బంతికే వికెట్ తీసి భారత్‌కు శుభారంభం అందించాడు. అయితే మరుసటి బంతికే సునాయాస రనౌట్ అవకాశాన్ని అతను పోగొట్టాడు. కవర్స్ దిశగా రూట్ బంతిని ఆడగా, నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ నుంచి రాయ్ చాలా ముందుకు వచ్చేశాడు. కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌తో బౌలర్‌కు బంతిని అందించాడు. అయితే రెప్పపాటులో పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయిన చహల్ దానిని కీపర్ వైపు విసిరాడు. దాంతో రాయ్ రనౌట్ కాకుండా తప్పించుకున్నాడు. ఈ సమయంలో జట్టు మొత్తం అతనిపై అసహనం వ్యక్తం చేసింది. కానీ చివర్లో వరుస వికెట్లతో జట్టును గెలిపించిన క్షణాన అదే సహచరుల అభినందనల వర్షంలో అతను తడిసిముద్దవడం విశేషం. బ్రాడ్... కాదు కాదు జోర్డాన్! భారత్ ఇన్నింగ్స్ 18వ ఓవర్... జోర్డాన్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని ధోని సింగిల్ తీయడంతో యువరాజ్‌కు స్ట్రైకింగ్ వచ్చింది. తర్వాతి నాలుగు బంతులు అతను ఆడిన తీరు చూస్తే పదేళ్ల క్రితంనాటి యువీ గుర్తుకొచ్చాడు. ప్రతీ బంతిని తుత్తునియలు చేస్తూ విరుచుకుపడిన యువరాజ్ వరుసగా 6, 6, 4, 6 బాదడంతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఓవర్లో ఆరు సిక్సర్లు కాకపోయినా, నాడు బ్రాడ్‌ను ఉతికేసిన తరహాలోనే ఈ సారి జోర్డాన్‌పై యువీ విరుచుకుపడ్డాడు. అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన రెండో బౌలర్ చహల్. టి20ల్లో భారత్ తరఫున ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. గతంలో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ మాత్రమే రెండుసార్లు ఆరేసి వికెట్లు తీశాడు. ఎట్టకేలకు అర్ధ సెంచరీ... 75 మ్యాచ్‌లు, 65 ఇన్నింగ్స్‌లు... పదేళ్ల టి20 కెరీర్లో వరల్డ్ కప్ మొదలు పలు చిరస్మరణీయ విజయాలు. కానీ ధోని ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క అర్ధసెంచరీ కూడా లేదు. ఈ మ్యాచ్‌కు ముందు అతని అత్యధిక స్కోరు 48 పరుగులు మాత్రమే. చివర్లోనే వచ్చి కొన్ని ధనాధన్ షాట్లతో మురిపించడమే తప్ప సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచే అవకాశం రాకపోవడం కూడా అందుకు ఒక కారణం. అయినా సరే ధోనిలాంటి హిట్టర్‌కు అదో వెలితిగానే ఉండిపోయింది. ఇప్పుడు మొత్తానికి అతను దానిని సాధించాడు. ఎనిమిదో ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ఈ మాజీ కెప్టెన్ తన పాత ఆటను చూపిస్తూ సాంప్రదాయేతర షాట్లతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే రెండు సిక్సర్లు బాదిన అతను, స్టోక్స్ ఓవర్లో రెండు చూడచక్కటి బౌండరీలు కొట్టాడు. 32 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అర్ధ సెంచరీ చేయడానికి ఇన్ని మ్యాచ్‌లు (76) ఎవరూ తీసుకోలేదు. మ్యాచ్‌కు ముందు ధోనిని భారత జట్టు సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించారు. కెప్టెన్‌గా అతను సాధించిన నాలుగు గొప్ప విజయాలను సూచిస్తూ నాలుగు స్టార్లు ఉండేలా ప్రత్యేకంగా చెక్కించిన ఫలకాన్ని జ్ఞాపికగా అందజేశారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: కోహ్లి (రనౌట్) 2; రాహుల్ (బి) స్టోక్స్ 22; రైనా (సి) మోర్గాన్ (బి) ప్లంకెట్ 63; ధోని (సి) రషీద్ (బి) జోర్డాన్ 56; యువరాజ్ (సి) బట్లర్ (బి) మిల్స్ 27; పంత్ (నాటౌట్) 5; పాండ్యా (రనౌట్) 11; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–4; 2–65; 3–120; 4–177; 5–191; 6–202. బౌలింగ్: మిల్స్ 4–0–31–1; జోర్డాన్ 4–0–56–1; ప్లంకెట్ 2–0–22–1; స్టోక్స్ 4–0–32–1; అలీ 4–0–30–0; రషీద్ 2–0–23–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) మిశ్రా 32; బిల్లింగ్స్ (సి) రైనా (బి) చహల్ 0; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 42; మోర్గాన్ (సి) పంత్ (బి) చహల్ 40; బట్లర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; స్టోక్స్ (సి) రైనా (బి) చహల్ 6; అలీ (సి) కోహ్లి (బి) చహల్ 2; ప్లంకెట్ (బి) బుమ్రా 0, జోర్డాన్ (స్టంప్డ్) ధోని (బి) చహల్ 0; రషీద్ (నాటౌట్) 0; మిల్స్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 127 వికెట్ల పతనం: 1–8; 2–55; 3–119; 4–119; 5–119; 6–123, 7–127, 8–127, 9–127, 10–127. బౌలింగ్: నెహ్రా 3–1–24–0, చహల్ 4–0–25–6, బుమ్రా 2.3–0–14–3, మిశ్రా 4–0–23–1; పాండ్యా 2–0–17–0, రైనా 1–0–22–0. -
ఎందుకీ అసహనం..?
► అదుపు తప్పుతున్న భారత క్రికెటర్లు ► అర్థం లేని స్పందనలు ఓటమి గురించి అడిగితే మా కుక్క పిల్లకు జ్వరం వచ్చిందనే క్రికెటర్ ఒకరు... రాజకీయాల గురించి అడిగితే నీకు బుద్ధి లేదనేవారొకరు... కోచ్ గురించి అడిగితే పెళ్లామా, పక్కింటావిడా అని ప్రశ్నించేదొకరు... రిటైర్మెంట్ గురించి ప్రశ్నిస్తే మీ ఇంట్లో ఎవరున్నారు అనేదొకరు... ఇవన్నీ చూస్తుంటే మన క్రికెటర్లలో ఇటీవలి కాలంలో అసహనం బాగా పెరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రకమైన ‘ట్రెండ్’ను వీరు మొదలు పెడుతున్నారు. ప్రశ్న ఒకటి అయితే దానికి పొంతన లేని సమాధానం ఇస్తూ తమ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా లేక ఏం చెప్పినా చెల్లుతుందనే అహంతో అలా ప్రవర్తిస్తున్నారా! ఆటతోనే కాదు మాటలతో కూడా గారడీ చేయడం భారత వన్డే, టి20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వెన్నతో పెట్టిన విద్య. చాలా సందర్భాల్లో అతని మాటలు త్రివిక్రమ్ డైలాగుల్లా పేలతాయి. సూటిగా తన అభిప్రాయం చెబుతూనే, సరదాగా నవ్వులు తెప్పించే విధంగా కూడా ఆ మాటలు ఉండేవి. అయితే అతనిలో కూడా అసహనంపాలు పెరిగినట్లే అనిపిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు రిటైర్మెంట్ గురించి అడిగితే కాస్త ఆగ్రహంగానే ‘నేను ఒక్కసారి చెబితే కొన్ని రోజులు, నెలల కోసం చెప్పినట్లే’ అంటూ సమాధానమిచ్చాడు. ఇక వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత అయితే అతడిని చూస్తే అసలు ధోనియేనా అనిపించింది. ఆటతీరును విశ్లేషించమని అడిగిన పాపానికి మేం గెలవాలని మీకు లేనట్లుంది అంటూ ఎదురుదాడికి దిగాడు. వెస్టిండీస్‌తో ఓటమి తర్వాత రిటైర్మెంట్ గురించి అడిగిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌కు క్లాస్ పీకడమే కాదు...ఇదే ప్రశ్న భారత విలేకరి అడిగితే సమాధానం భిన్నంగా ఉండేది అంటూ లేని అసహనం ప్రదర్శించాడు. దేనినైనా ‘లైట్’ తీసుకుంటూ కూల్‌గా కనిపించే కెప్టెన్ ఇలా గట్టు దాటడం కొత్తగా అనిపించింది. అదే బాటలో తమ్ముళ్లు...: ధోనికి క్రికెట్లో రైనా, అశ్విన్ అత్యంత ఆత్మీయులు. తాజాగా వారి సమాధానాలు వింటే అసహనంతో, ఒకదానితో మరొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పడాన్ని కూడా అతడిని చూసే నేర్చుకున్నారేమో అనిపిస్తుంది. వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ పరాజయం గురించి అడిగితే అశ్విన్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ‘నేను తర్వాతి రోజునుంచి పత్రికలు చదవలేదు. మా కుక్కకు బాగా జ్వరం వచ్చింది. దానికి స్ట్రోక్ తగిలింది. జీవితంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని ఆ రోజు తెలుసుకున్నా’ అంటూ తలతిక్కగా మాట్లాడటమే కాదు, ఆ తర్వాత ప్రశ్న అడిగిన జర్నలిస్ట్‌తో వాదన కూడా పెట్టుకున్నాడు. రైనా అయితే పరిధి దాటి ‘భార్యతో సౌకర్యమా, ప్రియురాలితో సౌకర్యమా’ అంటూ కోచ్ గురించి తలాతోక లేకుండా మాట్లాడాడు. వీరు కనీసం తాము చేసిన వ్యాఖ్యలపై ఆ తర్వాత కూడా కనీస వివరణ ఇవ్వలేదు. భజ్జీ రూటే వేరు: ఇక హర్భజన్ సింగ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో వాదనకు దిగాడు. వరల్డ్ కప్‌లో మ్యాచ్ అవకాశం రావడం లేదంటూ వ్యాఖ్యానించిన ఒక వ్యక్తిని చెడామడా తిట్టేశాడు. తాజాగా ఒక పోలీసు అధికారి మహిళపై దాడి చేస్తున్న ఫోటోను ట్విట్టర్లో పెట్టి ప్రధానికి ట్యాగ్ చేశాడు. దాంతో రాజకీయాల్లోకి వస్తున్నారా అంటూ ఒక అభిమాని అడగడంతో భజ్జీ చెలరేగిపోయాడు. ‘నువ్వు పెద్ద వెధవవు. ప్రధాని కాబట్టి ట్యాగ్ చేశాను. కానీ ఒక పార్టీపై అభిమానంతో కాదు. మీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది. నేనే గనక పోలీస్‌ను అయితే ముందు నిన్ను లోపలేసేవాడిని. నోర్మూసుకో’ అంటూ తన పంజాబీ ఆగ్రహాన్ని చూపించాడు. సమాధానమివ్వలేరా...: మన క్రికెటర్లంతా ఇంతగా అసహనం, ఆగ్రహం ప్రదర్శించేందుకు అవన్నీ ఏమైనా వివాదాస్పద ప్రశ్నలా లేక సమాధానం సరిగ్గా ఇస్తే పరువు పోతుందా! అవును, కాదు అంటూ పొడిగా బదులిచ్చి దానికి అక్కడే ఫుల్స్టాప్ పెట్టవచ్చు. ధోనిలాంటి మాటకారి అయితే దీనిపై సమాధానం చెప్పలేను అంటూ సులువుగా తప్పించుకోవచ్చు. కానీ వీరెవరూ తమ ‘లోపలి మనిషి’ని దాచుకోవడం లేదు. మామూలు సమాధానంతో ముగించాలని కోరుకోవడం లేదు. లెక్కలేని తనం, స్టార్లం కాబట్టి ఏమైనా చెప్పవచ్చు అన్న ధోరణే ఇందులో కనిపిస్తోంది. ఒక రకమైన తప్పుడు సంప్రదాయానికి వీరు బీజం వేస్తున్నారు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన ఆటగాళ్లు చీటికిమాటికీ అసహనంతో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. మున్ముందు ఆటగాళ్లు తమ మాటల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. లేదంటే ఆటకంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచే ప్రమాదం ఉంది. -
వర్ణ రంజితం కావాలి
నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ నెట్న్ర్రేట్పై ధోనిసేన దృష్టి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగానే... తెల్ల గోడ వెలిసిపోయినట్లు అనిపించింది. మన నీలి రంగు మెరుపు తగ్గిందనే ఆందోళన కలిగింది. తర్వాత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేయగానే... ప్రత్యర్థిపై పచ్చరంగు చల్లి బల్లే బల్లే అంటూ గంతులేశాం. ఇప్పుడు ప్రత్యర్థిపై అన్ని రంగులూ కలిపి బలంగా చల్లాల్సిన సమయం వచ్చింది. ఏదో సాదాసీదా గెలుపు గులాల్‌తో సరిపెట్టకుండా రంగ్‌దే బసంతి అంటూ రంగుల్లో ముంచెత్తాలి. హోళీ వేల యావత్ దేశం ధోనిసేన నుంచి ‘కలర్‌ఫుల్’ విజయాన్ని ఆశిస్తోంది. పాక్‌ను కసితీరా ఓడించినా... మరో పక్క అడపాదడపా విజయాలతో పక్కలో బల్లెంలా మారుతున్న బంగ్లాదేశ్‌నూ తక్కువ అంచనా వేయకూడదు. తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉన్నందున ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారీ విజయం సాధించి నెట్న్‌ర్రేట్‌ను మెరుగు పరుచుకోవాలి. సెమీస్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రక్రియలో నెట్న్‌ర్రేట్ కూడా అవసరం కావచ్చు మరి. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ మూడో లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. నేడు (బుధవారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిన ధోనిసేన ఇక్కడా నెగ్గితే సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరో వైపు ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న బంగ్లా ఓడితే అధికారికంగా టోర్నీనుంచి నిష్ర్కమిస్తుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు సాధ్యమైనంతగా రన్‌రేట్‌ను పెంచుకోవాలని కూడా భారత జట్టు భావిస్తోంది. రైనా, ధావన్‌లపై ప్రత్యేక దృష్టి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. మూడు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ప్రత్యేకంగా మరో నెట్స్‌లో ధావన్, రైనాల చేత ప్రాక్టీస్ చేయించారు. అంతా బాగుందని చెబుతున్నా ప్రస్తుతం జట్టు ఫామ్, ఆటతీరును చూస్తే వీరిద్దరు రాణించడమే ముఖ్యమని జట్టు గుర్తించినట్లుంది. వీరిద్దరికి అన్ని రకాల బౌలింగ్‌లు వేయిస్తూ శాస్త్రి సాధనను పర్యవేక్షించారు. అందరికంటే ముందుగా వచ్చిన ధావన్ ఆఖర్లో వెళ్లగా, రైనా కూడా సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. అశ్విన్ బౌలింగ్‌కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం కనిపించింది. ఆసియా కప్‌లో ఇటీవలే రెండు సార్లు బంగ్లాదేశ్‌తో తలపడి గెలవడం, ఇరు జట్లలో పెద్దగా మార్పులు కూడా లేకపోవడంతో టీమిండియా అదే జోరులో హ్యట్రిక్ విజయంపై దృష్టి పెట్టింది. జట్టులో మార్పులకు కూడా ఇక ఏ మాత్రం అవకాశం లేదు. నైరాశ్యంలో బంగ్లాదేశ్: సోమవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఐసీసీ నిషేధం కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో గత మ్యాచ్‌లో టాస్ సమయంలోనే కెప్టెన్ మషఫ్ ్రమొర్తజా మొహంలో ఒకింత నైరాశ్యం కనిపించింది. ప్రధాన బౌలర్ అయి ఉండీ అతను ఒక్క ఓవర్ మాత్రమే వేయడం అతని మానసిక పరిస్థితిని సూచిస్తోంది. జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన బంగ్లాదేశ్ ఇక ముందంజ వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ ఫామ్, దూకుడు చూస్తే భారత్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వగల జట్టుగా కనిపించింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు, ఆస్ట్రేలియాకు తలవంచింది. ఆసీస్‌తో ఆడని తమీమ్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో మరోసారి బంగ్లా సీనియర్ షకీబ్‌పై ఆధార పడుతోంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), మిథున్, సర్కార్, షబ్బీర్, షకీబ్, షువగత, మహ్ముదుల్లా, ముష్ఫికర్, సక్లాయిన్, అల్ అమీన్, ముస్తఫిజుర్. నేనూ... నా నోకియా... ఆశిష్ నెహ్రా సాధారణంగా పెద్దగా మీడియాలో హడావిడి చేయడు. గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకునే రకం. అయితే మంగళవారం మీడియా సమావేశంలో అతను చేసిన వ్యాఖ్య నవ్వులు పంచింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఫోటోలతో రచ్చ చేస్తున్న ధోరణి పెరిగిపోవడంపై ప్రశ్నకు అతను సరదాగా జవాబిచ్చాడు. ‘మీరు ఎవరిని అడుగుతున్నారో చూడండి. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. ట్విట్టర్, ఇన్‌స్టగ్రామ్ వాడను. ఇప్పటికీ ఎప్పటిదో నోకియా ఫోన్‌నే వాడుతున్నాను. కాస్త పాతకాలం మనిషిలాగా కనిపించవచ్చు కానీ ఇలాగే ఉంటాను. పత్రికలూ చదవను కాబట్టి సోషల్ మీడియా సంగతులు నేను పట్టించుకోను’ అని నెహ్రా అన్నాడు. ► 4 భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ నాలుగు టి20లు జరిగితే అన్నింటిలోనూ భారత్ గెలిచింది. పిచ్, వాతావరణం చిన్నస్వామి సాధారణంగా బ్యాటింగ్‌కు మంచి వేదిక. విండీస్, లంక మధ్య జరిగిన మ్యాచ్ పిచ్‌నే దీని కోసం ఉపయోగిస్తున్నారు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ముందు రోజు నగరంలో వాతావరణం కాస్త చల్లబడినా... వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఉండకపోవచ్చు. -
సమరానికి సై
► ఉద్వేగాల పోరుకు రంగం సిద్ధం ► నేడు భారత్, పాకిస్తాన్ ఢీ ► టీమిండియాకు చావోరేవో ► గెలిస్తేనే నిలిచే అవకాశం భారత జట్టు పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించేసింది. అవును... ఇది ఆటకంటే సరిహద్దు పోరుగా మారిపోయిందని అశ్విన్ చెప్పడంతోనే ఈ ప్రపంచకప్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో అర్థమైపోయింది. టీమిండియా దృష్టిలో పాక్‌తో పోరు గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో స్పష్టమైంది.సాధారణ క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు... ప్రజల భావోద్వేగాలు కూడా దీంతో పెనవేసుకున్నాయి. కోట్లాది మంది ఆశలు ముడిపడి ఉన్నాయి. కొన్నాళ్ల క్రితమే ఇరు జట్లు తలపడి ఉండవచ్చు. కానీ పాక్ ఆడుతోంది భారత గడ్డపై. ఇక్కడ ఫలితం మనకు వ్యతిరేకంగా వస్తే తట్టుకోవడం కష్టం. నాలుగు రోజుల క్రితం ఎవరూ ఊహించలేదు... భారత జట్టు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి వస్తుందని. పటిష్టమైన మన జట్టు ముందు పేలవంగా కనిపించిన పాకిస్తాన్‌తో కూడా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆడాల్సి వస్తుందని. ఒకవైపు గత రికార్డు మనవైపు నిలబడుతుండగా... మరోవైపు కోల్‌కతా ప్రత్యర్థిపై ప్రేమ కురిపిస్తుండగా... ప్రపంచకప్‌లో నేడు చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఈడెన్ సిద్ధమైంది. కోల్‌కతా నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ప్రపంచకప్‌లో ప్రతీ అభిమాని ఉత్సుకతతో ఎదురు చూస్తున్న మ్యాచ్ వచ్చేసింది. టోర్నీ సూపర్-10 దశ గ్రూప్-2 పోరులో భాగంగా నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక్కడి చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం మ్యాచ్‌కు వేదిక అవుతోంది. తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన భారత్‌పై కాస్త ఒత్తిడి ఉండగా, ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పాక్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. తీవ్ర సాధన... గురువారం ప్రాక్టీస్ చేసేందుకు ముగ్గురు భారత ఆటగాళ్లే రాగా, పాక్ సభ్యులు మాత్రం సీరియస్‌గా ప్రాక్టీస్ చేశారు. దీనిపై అశ్విన్, వారికి కష్టపడే స్వభావం ఎక్కువేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచ్ ముందు రోజు మాత్రం మన జట్టు సుదీర్ఘ సమయం పాటు సాధనలో గడపడం చూస్తే మనోళ్లు మ్యాచ్ పట్ల ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థమవుతుంది. ఒకరి తర్వాత మరొకరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఒకే రౌండ్‌తో సరిపెట్టకుండా పలువురు బ్యాట్స్‌మెన్ మరోసారి నా వంతు అన్నట్లుగా రొటేషన్‌లో పదే పదే సాధన చేస్తూ పోయారు. ముఖ్యంగా ధోని చాలా సేపు బ్యాటింగ్ చేయగా... ఆరంభంలోనే ప్రాక్టీస్ ముగిం చిన కోహ్లి అందరి సెషన్ అయిపోయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా స్పిన్‌ను సాధన చేశాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రత్యేక శ్రద్ధతో జట్టుకు దూరంగా వేరే నెట్స్ వద్ద రోహిత్, రైనాలతో ప్రాక్టీస్ చేయిస్తూ వారికి తగిన సూచనలిచ్చాడు. బౌలర్లు కూడా అశ్విన్, హర్భజన్, నేగి నిరంతరాయంగా మన బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌కు చేయడం చూస్తే స్పిన్‌పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లే కనిపించింది. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి షమీ ఫిట్నెస్ మెరుగైనట్లు కనిపిం చింది. అతను కూడా చాలా సేపు బౌలింగ్ చేశాడు. మొత్తంగా చూస్తే భారత ఆటగాళ్లలో మాత్రం ఈ మ్యాచ్ గురించి ఒక రకమైన కసి కనిపిస్తోంది. ఇక్కడా ఓడితే టోర్నీలో భారత్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. మూడు విజయాలు ఉంటేనే కచ్చితంగా సెమీస్ చేసే అవకాశం ఉంది. రెండు ఓడాక మరో రెండు గెలిచినా చాలా సమీకరణాలు సరిపోవాల్సి ఉంటుంది. జోష్‌లో పాక్... ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం తర్వాత పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో 200 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా ఆ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాధ్యతారాహిత్యానికి చిరునామాగా కనిపించిన కెప్టెన్ ఆఫ్రిది నాలుగో స్థానంలో బరిలోకి దిగి చెలరేగడం జట్టు స్థైర్యాన్ని పెంచింది. తొలి మ్యాచ్‌లో గెలుపుతో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న పాక్, భారత్‌పై వరల్డ్ కప్ రికార్డును సవరించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం భారత్ సెషన్ ముగిసిన తర్వాత పాక్ జట్టు ఫ్లడ్‌లైట్ల కింద సుదీర్ఘ సమయం పాటు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. ఆమిర్‌కు అభిమానంతో... అవసరానికి మించి ఆమిర్‌ను పొగుడుతున్నారని రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు గాక... కానీ మన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మాత్రం ఆ కుర్రాడిపై తన అభిమానాన్ని దాచుకోలేకపోతున్నాడు. ఆసియా కప్‌లో ఆమిర్ బౌలింగ్‌పై అనేక ప్రశంసలు కురిపించిన కోహ్లి కోల్‌కతాలో మరో సారి అతడిని అభిమానంగా పలకరించాడు. కొద్ది సేపు మాట్లాడుతున్న తర్వాత కోహ్లి ... తన ప్రత్యేక బ్యాట్ ఒకదానిని ఆమిర్‌కు బహుమతిగా ఇవ్వడం విశేషం. అంతకుముందు ప్రాక్టీస్ ముగించుకున్న కోహ్లి, ఆఫ్రిది చాలా సేపు ముచ్చటించుకున్నారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా/షమీ. పాకిస్తాన్: ఆఫ్రిది (కెప్టెన్), షర్జీల్, షహజాద్, హఫీజ్, అక్మల్, మాలిక్, వసీం, సర్ఫరాజ్, రియాజ్, ఆమిర్, ఇర్ఫాన్. పిచ్, వాతావరణం పాక్, బంగ్లా మ్యాచ్ జరిగిన పిచ్‌నే ఈ మ్యాచ్ కోసం కూడా వాడుతున్నారు. కాబట్టి మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. నగరంలో వాతావరణం సాధారణంగా ఉంది. వార్మప్ మ్యాచ్‌లనుంచి ఒక్కసారి కూడా మ్యాచ్‌లకు ఇబ్బంది ఎదురు కాలేదు. శనివారం కూడా వర్ష సూచన లేదు. ఈ మ్యాచ్ అంటే యాషెస్ పోరుకంటే ఎక్కువ. పాక్‌తో పోరు అంటే ప్రజలు ఉద్వేగంగా మారిపోతారు. అయితే ఆటగాళ్లుగా మేం అలాంటి భావనలను మైదానం బయట వదిలేసి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఒక మ్యాచ్ ఓడాం సరే, ఇక ముందు మేం మరింత ప్రమాదకర ప్రత్యర్థులమని ఎందుకు అనుకోకూడదు. - అశ్విన్, భారత బౌలర్ కచ్చితంగా మాకంటే భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ కప్ అంటే మేం ఓడిపోతామని అందరి మనసుల్లో అలా నాటుకుపోయింది. చరిత్ర మాకు అనుకూలంగా లేకపోయినా చరిత్ర మారుతుంది కూడా. మేం దీనిని క్రికెట్‌లాగే చూస్తున్నాం తప్ప వారిలా సరిహద్దు సమస్యలా కాదు. నిజాయితీగా చెప్పాలంటే ఇవన్నీ కలగలిస్తే గతంలోకంటే ఈసారి మేం గెలిచే అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నాయని మాత్రం చెప్పగలను. -వఖార్ యూనిస్, పాకిస్తాన్ కోచ్ రాత్రి గం. 7.30నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
మూడు ఈడెన్‌లూ సరిపోవు
► కోల్‌కతాలో రేపు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ► టిక్కెట్ల కోసం అభిమానుల ఆరాటం రెండు జట్లలోనూ ఉద్వేగం కోల్‌కతాలో క్రికెట్ అభిమానులకు సహనం తక్కువ... ఓటమిని అసలు భరించలేరు... ఈడెన్‌గార్డెన్స్‌కు సమీపంలోని చౌరస్తాలో గురువారం ఉదయం కనిపించిన బ్యానర్ ఇది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ ఇలాంటి చేష్టల వల్ల మరింత ఒత్తిడిలో పడటం ఖాయం. గతంలో భారత్ విఫలమైన అనేక సందర్భాల్లో కోల్‌కతా అభిమానులు చేసిన ‘అల్లరి’అందరికీ తెలిసిందే. అలాంటి వేదికలో ఇప్పుడు ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఈ టి20 ప్రపంచకప్‌కే హైలైట్ పోరుగా అభివర్ణిస్తున్న భారత్, పాకిస్తాన్ రేపు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఐసీసీ ఆన్లైన్లో టిక్కెట్లు అమ్మేయడంతో... ఎలాగైనా టిక్కెట్ సంపాదించుకోవాలని ఈడెన్ చుట్టూ అభిమానులు తిరుగుతున్నారు. కోల్‌కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి బాబోయ్... ఏంటీ ఫోన్లు... మూడు ఈడెన్‌గార్డెన్స్ ఉన్నా ఈ తాకిడికి తట్టుకోలేం... టిక్కెట్లు ఇవ్వడం మా వల్ల కాదు... బెంగాల్ క్రికెట్ సంఘంలోని ఓ సీనియర్ అధికారి గురువారం వ్యక్తం చేసిన బాధ ఇది. మామూలుగానే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే టిక్కెట్ల కోసం క్యూలు కడతారు. ఇక ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ఊరుకుంటారా..! కానీ ఈసారి ఐసీసీ భారత మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్లైన్లో లాటరీ ద్వారా అమ్మింది. దీంతో స్థానికంగా క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం నానాపాట్లు పడుతున్నారు. ప్రస్తుతం నగరాన్ని క్రికెట్ వేడి బలంగా తాకింది. ఎలాగైనా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను చూడాలని ఎంత డబ్బైనా పెట్టి టిక్కెట్లు కొనాలని అభిమానులు తిరుగుతున్నారు. వీరావేశపరులు కోల్‌కతా అభిమానులకు ఆవేశం ఎక్కువ. 1966లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మొదలైన రగడ ఇప్పటికీ అడపాదడపా సాగుతూనే ఉంది. 1996లో ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ఈడెన్‌లో అభిమానులు చేసిన రచ్చ ఐసీసీ ఇప్పటికీ మరచిపోలేదు. 1999లో ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ అవుటయ్యాక మైదానంలో సీసాలు విసిరి అంతా ఆగం చేశారు. దీంతో స్వయంగా సచిన్ వెళ్లి అభిమానులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇలాంటి వేదికలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే సహజంగానే భారత క్రికెటర్లపై ఒత్తిడి పెరగడం సహజం. పాక్‌కు కలిసొచ్చిన వేదిక ప్రపంచకప్‌ల చరిత్రలో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. అదే సమయంలో ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్‌పై గెలవలేదు. ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ టి20లు జరగలేదు. కానీ నాలుగు వన్డేలు ఆడితే అన్నీ పాకిస్తాన్ గెలిచింది. ఇక తాజాగా ఈసారి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇదే వేదికలో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. తమ దేశం నుంచి నేరుగా ఇక్కడికే వచ్చిన పాక్ జట్టు దాదాపుగా ఈ పరిస్థితులకు అలవాటు పడిపోయింది. అటు భారత్ కూడా టోర్నీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఇక్కడే ఆడింది. బలమైన వెస్టిండీస్‌ను ఆ మ్యాచ్‌లో ధోనిసేన చిత్తు చేసింది. ఈ వేదిక మీద అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ చెలరేగి ఆడతాడు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి తరువాత భారత జట్టు ఇక ప్రతి మ్యాచ్‌లోనూ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో కోల్‌కతా వచ్చింది. ప్రాక్టీస్‌కు ముగ్గురే... బుధవారం సాయంత్రం కోల్‌కతా చేరిన భారత జట్టు గురువారం కూడా దాదాపుగా హోటల్‌కే పరిమితమయింది. ప్రాక్టీస్ ఆప్షనల్ కావడంతో కేవలం రైనా, రహానే, నేగి మాత్రమే స్టేడియానికి వచ్చారు. కోచ్ సంజయ్ బంగర్ సాయంతో రైనా పుల్ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో కూడా కేవలం ఐదుగురు మాత్రమే ప్రాక్టీస్‌కు వచ్చారు. ఆసియాకప్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్లు ఢాకాలో మ్యాచ్‌కు ముందు రోజు ఒకే చోట ఒకే సమయంలో ప్రాక్టీస్ చేశారు. అయినా ఒకరినొకరు పలకరించుకోలేదు. ఈసారి మాత్రం ప్రాక్టీస్ సమయంలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. భారత స్టార్ రైనా, పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. కనిపించగానే ఆలింగనం చేసుకున్న ఈ ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ కనిపించారు. -
అలసత్వం తగదు
న్యూజిలాండ్ స్పిన్నర్ల ప్రతిభ కంటే మా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యమే ఓటమికి ప్రధాన కారణం... తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ ధోని అభిప్రాయం ఇది. అవును... మాకు ఎదురే లేదనే దృక్పథంతో క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో చేసిన ఘోరమైన తప్పుల వల్లే కివీస్ చేతిలో అనూహ్య పరాభవం ఎదురయింది. అయితే తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి షాక్ తగలడం కూడా ఒక రకంగా మంచిదే. అలసత్వం లేకుండా ఆడాలనే విషయం అర్థమైతే విజయాల బాటలోకి వెళ్లొచ్చు. నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి టి20 ప్రపంచకప్ తొలిసారి 2007లో భారత్ గెలిచినప్పుడు... ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలోనే భారత్ ఓడిపోయింది. కానీ కప్ గెలిచింది..! ఈసారి కూడా మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం... అంటే కప్ గెలుస్తాం... ఓ భారత క్రికెట్ అభిమాని, ఆశాజీవి అభిప్రాయం ఇది. మంచిదే ఇంత సానుకూల దృక్పథం క్రికెటర్లలో కూడా ఉంటే అంతకంటే కావలసింది లేదు. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ ఎలాంటి దృక్పథం కనబరుస్తున్నామనేదే ముఖ్యం. గతంలో దారుణమైన పేస్ బౌలింగ్ పిచ్‌లు ఎదురైన ప్రతిసారీ భారత కెప్టెన్ లేదా టీమ్ డెరైక్టర్ నేరుగా తమ అసహనాన్ని ప్రదర్శించారు. కానీ ఈసారి మాత్రం నాగ్‌పూర్ పిచ్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయలేని పరిస్థితి. ‘తొలి రోజు నుంచి బంతి స్పిన్ తిరగకూడదని ఏ రాజ్యాంగంలో రాసుంది?’ అంటూ దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్‌లో టెస్టు విజయం తర్వాత రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. కాబట్టి పిచ్ గురించి ఏమీ మాట్లాడకుండా... తర్వాతి మ్యాచ్‌ల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించే భారత బృందం కసరత్తులు చేస్తోంది. అడుగడుగునా నిర్లక్ష్యం భారత జట్టులో నెహ్రా, బుమ్రా మినహా అందరూ బ్యాటింగ్ చేయగలవారే. అయినా అందరూ కలిసి చేసింది కేవలం 79 పరుగులు. మరో 11 బంతులు మిగిలుండగానే ఇన్నింగ్స్ ముగియడం అంటే టి20లో దారుణమైన వైఫల్యంగా భావించాలి. పరిస్థితిని గమనించి, పిచ్‌ను అర్థం చేసుకుని షాట్స్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. స్వీప్ ఆడబోయి ఎల్బీగా అవుట్ కావడం శిఖర్ ధావన్‌కు ఇది మొదటిసారేం కాదు. పదేపదే ఇలాగే అవుటవుతున్నాడు. తొలి ఓవర్లో పెద్దగా స్పిన్ కాని బంతికే వికెట్ ఇవ్వడం ద్వారా ధావన్ భారీ తప్పు చేశాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ అంత ముందుకు వెళ్లి ఆడాల్సిన అవసరం అసలే లేదు. రెండు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన తర్వాత వచ్చిన రైనా ఆడిన షాట్ నిర్లక్ష్యానికి పరాకాష్ట. చాలా క్యాజువల్‌గా బంతిని పుష్ చేసి వెనుదిరిగాడు. ఇక యువరాజ్, జడేజాల షాట్లలోనూ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని విషయాన్ని గ్రహించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ అండర్సన్ దూకుడు తగ్గించుకుని ఆడాడుగానీ, భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ అలాంటి పరిణతి చూపలేకపోయారు. కిం కర్తవ్యం..? ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన కొంపలు మునిగిపోవు. కానీ ఒక్క బ్యాట్స్‌మన్ చివరి వరకూ నిలబడితే గెలిచే చోట ఓడిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరికీ కావలసినంత అనుభవం ఉంది. ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ హీరోలే. కాబట్టి ఈ ఓటమి నుంచి వీలైనంత తొందరగానే కోలుకోవచ్చు. ఇక తర్వాతి మ్యాచ్ ఆడాల్సింది పాకిస్తాన్‌తో. సహజంగానే దేశంలో ఈ మ్యాచ్ గురించి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాకిస్తాన్‌తో ఆడే సమయంలో ఆటగాళ్లంతా రెట్టింపు కష్టపడతారు. కాబట్టి రెండో మ్యాచ్ సమయానికి కోలుకోవచ్చు. పాక్‌తో మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాటింగ్ పిచ్ సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా మన ఆటతీరుకు అనుకూలించే వికెట్. అయితే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని కివీస్‌తో పరాజయాన్ని వీలైనంత త్వరగా మరచిపోవాలి. ఇకపై ప్రతి మ్యాచ్ చావోరేవోలాంటిదే. ఇలాంటి సమయంలో ధోనిసేన మరింత మెరుగ్గా ఆడుతుందని ఆశిద్దాం. టోర్నీలో తొలి మ్యాచ్ ఓడితే ఆపై అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని కోసం మానసికంగా సిద్ధమయ్యాం. ప్రతీ మ్యాచ్ చావోరేవోలాగా మారిపోవడం వల్ల ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఈ ఓటమి ఒకందుకు మంచిదే. మాకూ, దేశానికి మేలు చేసింది. ఎందుకంటే జట్టు పరంగా, అభిమానులపరంగా అందరికీ ఒక హెచ్చరిక లభించినట్లయింది. ఇప్పుడు సరిగ్గా సమస్య ఏమిటి, లోపం ఎక్కడుంది తెలిసింది కాబట్టి మేం ఇకపై ఏం చేయాలో తెలుస్తుంది. దాని ప్రకారం వ్యూహాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. - ధోని -
ఆఖరి సన్నాహకం!
నేడు భారత్ రెండో వార్మప్ మ్యాచ్ దక్షిణాఫ్రికాతో పోరు ‘తుది’ జట్టు బరిలోకి దిగే అవకాశం ముంబై: ఈ ఏడాది ఆడిన 11 టి20 మ్యాచ్‌లలో 10 విజయాలను సాధించిన భారత్ జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదలుపెట్టి శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు ప్రత్యర్థి ఎవరైనా ధోని సేన విజయయాత్రకు అడ్డు ఉండటం లేదు. అయితే ఈ దూకుడుకు కాస్త ముందు దక్షిణాఫ్రికా మనకు పరాభవం మిగిల్చింది. అదీ సొంతగడ్డపై 0-2తో ఓడిన తీరు అటు ఆటగాళ్లు, ఇటు అభిమానులు కూడా మరచిపోలేదు. ఇప్పుడు ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టుతో మరోసారి తలపడే అవకాశం వచ్చింది. పేరుకు వార్మప్ మ్యాచే అయినా, జట్ల బలాబలాలను పరిశీలిస్తే హోరాహోరీ పోరు సాగవచ్చు. వరుసగా టి20 మ్యాచ్‌లే ఆడి కావాల్సినంత సన్నాహాలు చేసుకున్న టీమిండియాకు... మంగళవారం కివీస్‌తో జరిగే ప్రధాన టోర్నీ తొలి మ్యాచ్‌కు ముందు ఇదే ఆఖరి ప్రాక్టీస్. భారత్ ఆడిన తొలి మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్‌లో దాదాపు 25 వేల ప్రేక్షకులు హాజరు కావడం చూస్తే ఫ్యాన్స్, ప్రాక్టీస్ మ్యాచ్‌లను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారని అర్థమవుతుంది. రైనా ఫామ్‌లోకొచ్చేనా! భారత బ్యాటింగ్‌కు సంబంధించి కోహ్లి అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, రోహిత్ శర్మ కూడా అదరగొడుతున్నాడు. ఇక ఆసియా కప్ ఫైనల్‌తో ధావన్‌పై కూడా నమ్మకం పెరిగింది. చివర్లో హిట్టింగ్ చేసే ధోని గురించి ఆందోళన లేకపోగా, యువరాజ్ కూడా నిల దొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్న అంశం సురేశ్ రైనా బ్యాటింగ్. ప్రధాన బ్యాట్స్మెన్లలో అతను మాత్రమే కాస్త తడబడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణించిన అతను శ్రీలంకతో సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో చెప్పుకోదగ్గ రీతిలో ఆడలేదు. ఆసియా కప్‌లో రెండుసార్లు బ్యాటింగ్ అవకాశం రాకపోగా... రెండింటిలో విఫలమై, ఒక్క లంకతో మాత్రం అతి కష్టమ్మీద కొన్ని పరుగులు చేయగలిగాడు. వెస్టిండీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి ఒకే బంతి ఎదుర్కోవడం అతనికి పెద్దగా పనికి రాలేదు. ఇప్పుడు తన బ్యాట్‌కు పదును పెట్టేందుకు రైనాకు ఇదే సరైన సమయం. ఇక్కడ రాణించి ఫామ్‌లోకి వస్తే అసలు పోరులో అతని గురించి ఆందోళన ఉండదు. గత మ్యాచ్‌లో రహానే, నేగిలకు అవకాశం ఇచ్చినా, ఈ వార్మప్‌లో అసలైన తుది 11 మందినే ఆడించే అవకాశం ఉంది. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు ఇదే బృందంతో ఫలితం సాధించడంపై జట్టు దృష్టి పెట్టింది. బౌలింగ్‌లో కూడా అంతా ఊహించినట్లే ఉన్నా... షమీ పునరాగమనంతో ఆ ఒక్క స్థానం విషయంలో అస్పష్టత నెలకొంది. పూర్తి ఫిట్నెస్ను అందుకునే ప్రయత్నంలో ఉన్న షమీని సిద్ధం చేసేందుకు ధోని అతనికే అవకాశం ఇవ్వవచ్చు. సఫారీలు సిద్ధం... సొంతగడ్డపై 1-2తో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓడిన అనంతరం భారత్ చేరిన దక్షిణాఫ్రికా తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆ జట్టు కూడా ఎక్కువ ప్రయోగాలకు పోకుండా ఇటీవలి మ్యాచ్ ఆడిన తుది జట్టునే ఆడించవచ్చు. కెప్టెన్ డు ప్లెసిస్, డివిలియర్స్, డి కాక్, మిల్లర్‌లాంటి హిట్టర్లకు తోడు ఆమ్లా కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో సఫారీల బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో స్టెయిన్, రబడ, అబాట్‌లపై జట్టు ఆ జట్టు ఆధారపడుతోంది. అయితే ఐపీఎల్ అనుభవంతో రాటుదేలిన ఆల్‌రౌండర్లు డుమిని, మోరిస్, వీస్ కీలకం కానున్నారు. వీరిలో దాదాపు అందరికీ భారత్‌లో ఆడిన అనుభవం ఉండటం ఆ జట్టుకు అనుకూలాంశం. -
గుజరాత్ లయన్స్ కెప్టెన్‌గా రైనా
చీఫ్ కోచ్‌గా బ్రాడ్ హాడ్జ్ న్యూఢిల్లీ: ఐపీఎల్లో రాజ్‌కోట్ ఫ్రాంచైజీకి చెందిన జట్టును మంగళవారం ఆవిష్కరించారు. ‘గుజరాత్ లయన్స్’ పేరుతో ఈ టీమ్ బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, చీఫ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాడ్జ్‌లను నియమించారు. ఎనిమిదేళ్లు కలిసి ఆడినందున ధోనిని ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసని రైనా అన్నాడు. ‘నేను, మహీ కలిసి కొన్ని ఫైనల్స్ ఆడాం. కాబట్టి అతన్ని అడ్డుకోవడం ఎలాగో తెలుసు. ఈసారి ధోనిని జడేజా అవుట్ చేస్తే బ్రేవో డాన్స్ చేస్తాడు. చెన్నై తరఫున నేను, జడేజా, మెకల్లమ్, బ్రేవో కలిసి ఆడాం. ఇప్పుడు ఫాల్క్‌నర్ రావడంతో జట్టులో సమతుల్యత పెరిగింది. వేలంలో కూడా మంచి ఆటగాళ్లు వస్తారని ఆశిస్తున్నా. వేలంలో ఉన్న దేశవాళీ, విదేశీ ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదువలేదు’ అని రైనా పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ తనను మెరుగైన క్రికెటర్‌గా తీర్చిదిద్దిందన్నాడు. -
రామలక్ష్మణులు విడిపోయారు
భారత క్రికెట్లో వాళ్లిద్దరూ రామలక్ష్మణుల్లాంటివారు. భారత్ తరఫున ఇంతకాలం కలిసే ఆడారు. ఇక ఐపీఎల్లో అయితే ఈ ఇద్దరి బంధం అసామాన్యం. చెన్నై జట్టుకు బ్రాండ్ అంబాసిడర్స్‌లా ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా కలిసే వెళ్లారు... కలిసే తిరిగారు... కష్టాల్లో ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. సంతోషాన్ని ఇద్దరూ పంచుకున్నారు. మైదానంలో, వెలుపలా వాళ్లిద్దరినీ చూడటానికి రెండు కళ్లూ చాలేవికావు. అలాంటి వాళ్లు ఇప్పుడు విడిపోయారు. ఐపీఎల్లో కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్ ఈ ఇద్దరినీ చెరో జట్టులో ఎంపిక చేసుకున్నాయి. ఇక వచ్చే రెండు సీజన్లు పుణే తరఫున ధోని... రాజ్‌కోట్ తరఫున రైనా... క్రికెట్ మైదానంలో బ్యాట్లతో యుద్ధం చేయబోతున్నారు. పుణేకు ధోని, రాజ్‌కోట్‌కు రైనా ముంబై: ఊహించినట్లుగానే ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోనిని... సంజీవ్ గోయెంకాకు చెందిన పుణే ఫ్రాంచైజీ తీసుకుంది. సురేశ్ రైనాను ఇంటెక్స్ మొబైల్స్‌కు చెందిన రాజ్‌కోట్ ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. సస్పెన్షన్ వేటు పడిన చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీల ఆటగాళ్ల కోసం మంగళవారం ఏర్పాటు చేసిన ఐపీఎల్ డ్రాఫ్ట్ కేవలం పది నిమిషాల్లోనే ముగిసింది. 50 మంది క్రికెటర్లు ఉన్న ఈ డ్రాఫ్ట్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు చెరో రూ. 39 కోట్లు ఖర్చు చేసి ఐదుగురు ఆటగాళ్ల చొప్పున ఎంపిక చేసుకున్నాయి. వచ్చే రెండేళ్లు ఈ క్రికెటర్లంతా కొత్త జట్ల తరఫున ఆడతారు. పాత ఫ్రాంచైజీలకు చెందిన మిగిలిన ఆటగాళ్లు ఫిబ్రవరి 6న జరిగే సాధారణ వేలంలో అన్ని ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉంటారు. కొత్త ఫ్రాంచైజీలు మిగిలిన చెరో రూ. 27 కోట్లతో ఆ వేలంలో పాల్గొంటాయి. ఏప్రిల్ 9 నుంచి మే 29 వరకు ఐపీఎల్-9 పోటీలు జరుగుతాయి. ఎంపిక జరిగిందిలా.... జట్టు కోసం బీసీసీఐకి ఏడాదికి రూ.16 కోట్లు చెల్లిస్తున్నందున పుణే జట్టుకు తొలి ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మరో ఆలోచన లేకుండా ‘న్యూ రైజింగ్ కన్సార్టియం’ ధోనిని ఎంపిక చేసుకుంది. రాజ్‌కోట్ జట్టు తమ తొలి ఆటగాడిగా రైనాను తీసుకుంది. ఆ తర్వాత పుణే రహానేను ఎంచుకుంటే... ఇంటెక్స్ సంస్థ రాజ్‌కోట్‌కే చెందిన జడేజాను జట్టులోకి తీసుకుంది. తమ మూడో క్రికెటర్‌గా పుణే జట్టు స్పిన్నర్ అశ్విన్ వైపు మొగ్గుచూపితే... రాజ్‌కోట్ మెకల్లమ్‌ను తమ ఖాతాలో చేర్చుకుంది. ఆ తర్వాత పుణే స్టీవ్ స్మిత్‌ను ఎంచుకుంటే... రాజ్‌కోట్ ఫాల్క్‌నర్‌ను తీసుకుంది. ఇక అందుబాటులో ఉన్న వారిలో తమ చివరి ఆటగాడిగా పుణే డుప్లెసిస్‌ను తీసుకోగా... రాజ్‌కోట్ జట్టు ఆల్‌రౌండర్ బ్రేవోను సొంతం చేసుకుంది. ఆటగాళ్ల అసలు మొత్తం వేరు! ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన డబ్బులకు, వాళ్లకు ఇచ్చే అసలు మొత్తానికి తేడా ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తమ వేలం డబ్బు (రూ. 66 కోట్లు)లో నుంచి ఈ ఐదుగురి కోసం రూ.39 కోట్లు తగ్గించుకుంటాయి. ఈ డ్రాఫ్ట్‌లో తొలి ఆటగాడిని తీసుకోగానే జట్టు పర్స్నుంచి రూ.12.5 కోట్లు తగ్గుతాయి. ఆ తర్వాత ఒక్కో ఆటగాడిని తీసుకున్న కొద్దీ వరుస క్రమంలో రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. అంటే తొలి క్రికెటర్‌గా ధోనినే కాదు... ఏ ఆటగాడిని ఎంపిక చేసుకున్నా రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. దీని అర్థం ధోనికి రూ.12.5 కోట్లు చెల్లిస్తారని కాదు. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కూడా ఇవ్వొచ్చు. గత ఫ్రాంచైజీ (చెన్నై)తో ధోనికి ఉన్న ఒప్పందం ప్రకారం ఎంత మొత్తం దక్కుతుందో అంత ఇవ్వాలి. ఈ మొత్తం ఎంత అనేది బయటకు తెలియదు. హైలైట్స్ * ఐపీఎల్లో ధోని, రైనా వేర్వేరు జట్ల తరఫున ఆడటం ఇదే తొలిసారి. * రహానే మినహా రాజస్తాన్‌లోని మిగతా భారత ఆటగాళ్లలో ఏ ఒక్కర్ని కూడా రెండు ఫ్రాంచైజీలు తీసుకోలేదు. * చెన్నై జట్టులోని ఏడుగుర్ని తీసుకుంటే, రాజస్తాన్ నుంచి ముగ్గురు మాత్రమే కొత్త ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు. * ఎంపిక చేసుకున్న 10 మందిలో ఏడుగురు ఆటగాళ్లు తమ జాతీయ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీళ్లలో నలుగురు పుణేలో, ముగ్గురు రాజ్‌కోట్‌లో ఉన్నారు. * రాజ్‌కోట్ తీసుకున్న ఐదుగురిలో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. * గతంలో జడేజా మూడు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. అందులో చెన్నై, రాజస్తాన్ సస్పెన్షన్ బారినపడగా, కొచ్చి టస్కర్స్ కేరళ మొత్తానికి రద్దయ్యింది. * మొత్తం పది మందిలో భారత్ (5), ఆస్ట్రేలియా (2), దక్షిణాఫ్రికా (1), న్యూజిలాండ్ (1), వెస్టిండీస్ (1) ఆటగాళ్లున్నారు. కెప్టెన్‌గా రైనా? రాజ్‌కోట్ ఫ్రాంచైజీ తమ జట్టు పగ్గాలు రైనాకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ స్టార్ మెకల్లమ్ కూడా రేసులో ఉన్నాడు. అయితే గతంలో చెన్నై తరఫున కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉండటం, భారత క్రికెటర్ కావడం వల్ల... జట్టు బ్రాండ్ ఇమేజ్ కోసం రైనా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. రాజ్‌కోట్ తమ తొలి ప్రాధాన్యం కూడా తనకే ఇవ్వడం, మరోవైపు గవాస్కర్ లాంటి మాజీల సలహాలు కూడా రైనా పేరును ముందుకు తెచ్చాయి. జడేజా స్థానిక ఆటగాడు అయినప్పటికీ.. గతంలో ఏ స్థాయి క్రికెట్లోనూ తను జట్టుకు సారథ్యం వహించలేదు. మరోవైపు పుణే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకుండా ధోనిని సారథిగా ఎంచుకుంటుంది. వాట్సన్‌ను వదిలేశారు ఈ డ్రాఫ్ట్‌లో ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, మైక్ హస్సీపై రెండు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరం. మెకల్లమ్, ఫాల్క్‌నర్, డు ప్లెసిస్‌లు రేసులోకి రావడం, కేవలం ఐదుగుర్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉండటంతో వాట్సన్‌ను పట్టించుకోలేదు. మరోవైపు దేశవాళీ ఆటగాళ్ల గురించీ ఎవరూ ఆలోచించలేదు. ఏ జట్టులో ఉన్నా బరిలోకి దిగాక క్రీడాస్ఫూర్తితోనే ఆడతా. ధోనితో తలపడినప్పుడు కూడా దీన్ని పాటిస్తా. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్‌కోట్‌లో చాలా మ్యాచ్‌లు ఆడా. ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. జడేజా స్థానికుడు. ఇద్దరం కలిసి ఇక్కడి పరిస్థితులను అనుకూలంగా మల్చుకుంటాం. -సురేశ్ రైనా మా ప్రణాళిక ప్రకారమే రైనాను తొలుత ఎంచుకున్నాం. స్థానిక ఆటగాడు, లోయర్ ఆర్డర్లో హిట్టర్ కావడం వల్ల రెండో క్రికెటర్‌గా జడేజాను తీసుకున్నాం. జట్టును సమతుల్యం చేయడానికే ఎక్కువ మంది ఆల్రౌండర్లను తీసుకున్నాం. మేం ఇప్పటికే ఒకరిద్దరు కోచ్‌లతో సంప్రదింపులు జరుపుతున్నాం. చీఫ్ కోచ్ ఎవరన్నది తేలాక వేలానికి సంబంధించిన వ్యూహం రచించుకుంటాం. దాని ప్రకారం వెళ్తాం. -కేశవ్ బన్సల్ (ఇంటెక్స్ డెరైక్టర్) మాది కొత్త ఫ్రాంచైజీ. దాన్ని బలోపేతం చేసుకోవడానికి, బ్రాండ్‌ను విస్తరించుకోవడానికి ధోని చాలా అవసరం. అందుకే అతని వైపు మొగ్గాం. అంతకుమించిన మరో అవకాశం మాకు లేదు. అలాగే మిగతా వారిలో కూడా కోరుకున్న ఆటగాళ్లనే తీసుకున్నాం. మనోజ్ తివారి, అశోక్ దిండాలతో కూడా చర్చలు జరుపుతున్నాం. -సుబ్రతో తాలుక్దార్ (పుణే ప్రతినిధి) రాజ్‌కోట్‌కు పుణేకు -
‘ఇద్దరు’ ఫామ్‌లోకి వచ్చేదెప్పుడు?
వరుసగా విఫలమవుతున్న కోహ్లి, రైనా భారత్‌ను దెబ్బతీస్తున్న ఆటతీరు బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి... ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో టి20 సిరీస్ గల్లంతు... ఈ వరుస పరాజయాలతో అందరి దృష్టి భారత కెప్టెన్ ధోనిపైనే నిలిచింది. అతని స్థానాన్ని ప్రశ్నించడంపైనే ఆసక్తి చూపిన విమర్శకులు మరోవైపు వైఫల్యం గురించి ఆలోచించే ప్రయత్నం చేయలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోకపోయినా... భావి కెప్టెన్ అంటూ మోసిన విరాట్ కోహ్లి ఇప్పుడు బ్యాటింగ్‌లోనే తడబడుతున్నాడు. వన్డేల్లో ఫినిషింగ్ అంటే ధోనికి సరిజోడు సురేశ్ రైనా. చివరి ఓవర్లలో ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్ దిశ మార్చడంలో అతనికి అతనే సాటి. గత కొన్నేళ్లలో జట్టు భారీ స్కోరు సాధించినా... భారీ లక్ష్యాలను ఛేదించినా వాటిలో రైనా కీలక పాత్ర పోషించాడు. కానీ అతను ఇప్పుడు ఒక్కో పరుగు కోసం శ్రమిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. దక్షిణాఫ్రికాతో తొలి టి20 మ్యాచ్‌లో రోహిత్‌కు అండగా నిలుస్తూ 43 పరుగులు చేసిన కోహ్లి ఆ తర్వాతి మూడు ఇన్నింగ్స్‌లలో చేసిన స్కోర్లు వరుసగా 1, 11, 12. జట్టు నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ ఆటతీరు ఇలా ఉంటే అది కచ్చితంగా ఫలితంపై పడుతుంది. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన ఆటగాడు తేలిపోవడంతో తర్వాతి లైనప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక రైనా టి20లు, వన్డేల్లో వరుసగా 14, 22, 3, 0 పరుగులు చేశాడు. దశాబ్దానికిపైగా జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న బ్యాట్స్‌మెన్ నుంచి ఇలాంటి స్కోర్లు రావడం జట్టును ఆందోళనపరిచే అంశం. ఆత్మవిశ్వాసం లోపించిందా: ‘భాయ్... నువ్వైతే ఫామ్‌లోకి వచ్చేశావ్. మరి నేనేం చేయాలి’... తన బ్యాటింగ్ గురించి ధోనికి కోహ్లి ప్రశ్న ఇది. దానికి సమాధానమిస్తూ మహి... ‘చాలా సింపుల్. నీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు. కెప్టెన్సీపై కాదు’ సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ జోక్‌లో వ్యంగ్యమే కాదు. వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే భారత టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాక ఆ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లి... వన్డేల్లో మాత్రం తేలిపోయాడు. కెప్టెన్‌గా ఆరు టెస్టుల్లో కోహ్లి 63.2 సగటుతో 696 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అదే ధోని నాయకత్వంలో వన్డేల్లో బరిలోకి దిగిన 17 మ్యాచ్‌లలో కేవలం 28.64 సగటుతో 401 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై శతకం బాదిన తర్వాత వరుసగా 12 ఇన్నింగ్స్‌లో కోహ్లి కనీసం అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలం కావడం అతని కెరీర్లో ఎప్పుడూ లేదు. ఆశ్చర్యం అనిపించినా 2010 నుంచి 2014 వరకు ఐదేళ్ల పాటు వన్డేల్లో భారత టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ ఈ ఏడాది టాప్-5లో కూడా లేడు. అతను పరుగులు చేయకపోవడం కంటే క్రీజ్‌లో అసౌకర్యంగా కనిపించడం కొత్తగా అనిపిస్తోంది. తొలి వన్డేలో షార్ట్ ఫైన్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చాడు. రెండో వన్డేలోనైతే అతని రనౌట్ ఆత్మహత్యా సదృశ్యం. స్ట్రైకింగ్ ఎండ్ నుంచి ఫీల్డర్‌ను స్పష్టంగా చూస్తూ రహానే కంటే మంచి ‘వ్యూ’లో ఉండి, అతను వద్దంటున్నా పరుగు కోసం దూసుకురావడం అర్థం లేనిది. కోహ్లి రెండు వన్డేల్లోనూ ఒక్క బౌండరీ కూడా కొట్టలేక పోయాడంటే అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో అర్థమవుతోంది! తనకిష్టమైన మూడో స్థానం నుంచి మార్చారనే అసంతృప్తి ఉందని వినిపిస్తున్నా... ఎక్కడైనా ఆడగల సామర్థ్యం ఉన్న అతనిలాంటి స్టార్ ప్లేయర్‌కు అది పెద్ద సమస్య కాదు. జోరు తగ్గిపోయింది: సురేశ్ రైనా పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరంగా ఉంది. క్రీజ్‌లోకి వచ్చీ రాగానే దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయే రైనా కూడా షాట్లు ఆడేందుకు కిందా మీదా పడిపోతున్నాడు. టెస్టుల్లో ఎలాగూ లేని రైనా తన బ్రాండ్ టి20, వన్డేల్లో కూడా ప్రభావం చూపలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో పేలవంగా అవుటైన అతను... రెండో వన్డేలోనైతే లెగ్‌సైడ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. షార్ట్ పిచ్ బంతి ఆడలేని బలహీనత వల్ల వైడ్ కావాల్సిన బాల్‌కు కూడా వెనుదిరగడం అతనికే చెల్లింది! దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు రైనా నెదర్లాండ్స్ వెళ్లి మరీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత సొంతగడ్డపై ప్రాక్టీస్ కోసం ద్రవిడ్‌కు చెప్పి బంగ్లాదేశ్‌తో జరిగిన ఇండియా ‘ఎ’ సిరీస్‌లో ఆడాడు. అక్కడ తొలి రెండు వన్డేల్లో విఫలమైనా, చివరి మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో సన్నాహకాలు బాగున్నట్లే అనిపించింది. అయితే అసలు మ్యాచ్‌లలో ఫలితం దక్కలేదు. జట్టు కోసం లోయర్ ఆర్డర్లో ఆడేందుకు సిద్ధమైన ఏకైక ఆటగాడు అంటూ కెప్టెన్ ధోని ప్రశంసలైతే దక్కాయి కానీ ఆరో స్థానంలో ఆడటం జట్టుకు ఉపయోగపడలేదు. తన కెరీర్లో ఎక్కువ భాగం మంచి ప్రదర్శన కనబర్చిన ఐదో స్థానం వేర్వేరు కారణాలతో ఇప్పుడు ధోని తీసుకున్నాడు. నిజానికి ఇండోర్ మ్యాచ్‌లో అతనికి 23వ ఓవర్లోనే బ్యాటింగ్ అవకాశం వచ్చింది. గతంలో ఎక్కువ సార్లు 35-40 ఓవర్ల మధ్యలో వచ్చిన రైనాకు ఇది మంచి అవకాశం. కానీ ఇక్కడా అతను తడబడ్డాడు. మొత్తం జట్టు వైఫల్యంగా చూస్తుండటంతో రైనా సమస్యను ఎవరూ పెద్దగా గుర్తించలేదు. తనదైన శైలిలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడకపోతే ఇక విమర్శల గన్ అతని వైపు కూడా తిరుగుతుంది. దూకుడుకిదే సమయం: మరో ఆటగాడు శిఖర్ ధావన్ కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను 3, 11, 23, 23 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా రోహిత్‌తో పోటీ పడి అతను పరుగులు సాధించాల్సి ఉంది. ఇండోర్‌లాంటి అదృష్టం మళ్లీ మళ్లీ కలిసొస్తుందని గ్యారంటీ లేదు కాబట్టి ప్రధాన బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఇలాగే కొనసాగితే వన్డే సిరీస్ కూడా సఫారీలపాలు అయ్యే ప్రమాదం ఉంది. -సాక్షి క్రీడా విభాగం -
'రైనా, జడేజా, బ్రావోలు బెట్టింగ్ చేశారు'
లండన్: రోజుకో సంచనం రేపుతానన్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ అన్నట్టుగానే చేశారు. ఇప్పటివరకు రాజకీయ నేతలను మాత్రమే టార్గెట్ చేసిన ఆయన.. తాజాగా క్రికెటర్లకు కూడా బురద అంటించే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెయిన్ బ్రావోలు బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాత్రి ట్విట్టర్ లో పలు అంశాలు వెల్లడించారు. బాబా దీవాన్ అనే బుకీ ఈ ముగ్గురు ఆటగాళ్లకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడమేకాకుండా పలు చోట్ల ఫ్లాట్లు కూడా కొనిచ్చాడని చెప్పారు. ఇదే విషయమై ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్కు 2013 తాను రాసిన లేఖను మోదీ బహిర్గతం చేశారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు బెట్టింగ్, ఫిక్సింగ్ కు పాల్పడి అనర్హులుకాగా, మోదీ తాజా ఆరోపణలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. -
మహిళా సాధికారతకు స్టార్ క్రికెటర్ల అండ!
-
చెన్నై విశ్వరూపం
-
చెన్నై విశ్వరూపం
బెంగళూరు: కొడితే ఫోర్... లేదంటే సిక్సర్... టి20ల ద్వారా అభిమానులు కోరుకునే వినోదం ఇది. చెన్నై జట్టు సోమవారం సరిగ్గా ఇలాంటి వినోదాన్నే అందించింది. డాల్ఫిన్స్‌తో మ్యాచ్‌లో ఏకంగా 16 సిక్సర్లు... 17 ఫోర్లు బాది 20 ఓవర్లలోనే 242 పరుగులు సాధించింది. చాంపియన్స్ లీగ్‌లో అత్యధిక స్కోరు (2013లో ఒటాగో జట్టు కూడా ఇన్నే పరుగులు చేసింది) రికార్డును చెన్నై సమం చేసింది. సురేశ్ రైనా (43 బంతుల్లో 90; 4 ఫోర్లు; 8 సిక్సర్లు), రవీంద్ర జడేజా (14 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు)ల సంచలన హిట్టింగ్తో సూపర్ కింగ్స్... 54 పరుగుల తేడాతో డాల్ఫిన్స్‌పై నెగ్గింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 242 పరుగులు చేసింది. ఓపెనర్ మెకల్లమ్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు; 3 సిక్సర్లు), డు ప్లెసిస్ (19 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. ఈ మ్యాచ్ ద్వారా రైనా టి20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫ్రిలింక్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డాల్ఫిన్స్ 20 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డెల్పోర్ట్ (9 బంతుల్లో 34; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) విధ్వంసకర ఆటతీరు చూపినా ఫలితం లేకపోయింది. వాన్ విక్ (7 బంతుల్లో 17; 2 ఫోర్లు; 1 సిక్స్), డెల్పోర్ట్ కలిసి తొలి మూడు ఓవర్లలోనే 56 పరుగులు చేయడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగినా... చెన్నై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో మ్యాచ్ చేజారకుండా చూశారు. మోహిత్ శర్మకు నాలుగు, బ్రేవో, నెహ్రాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సురేశ్ రైనాకి దక్కింది. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) జోండో (బి) మహరాజ్ 7; మెకల్లమ్ (సి) స్మిత్ (బి) జోండో 49; రైనా (సి) డెల్పోర్ట్ (బి) ఫ్రిలింక్ 90; డు ప్లెసిస్ (సి) వాన్ జార్స్‌వెల్డ్ (బి) అలెగ్జాండర్ 30; ధోని (బి) ఫ్రిలింక్ 0; బ్రేవో (సి) వాన్ జార్స్‌వెల్డ్ (బి) అబోట్ 11; జడేజా నాటౌట్ 40; అశ్విన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 242. వికెట్ల పతనం: 1-8; 2-99; 3-164; 4-174; 5-190; 6-222. బౌలింగ్: మహరాజ్ 4-0-54-1; అబోట్ 4-0-37-1; అలెగ్జాండర్ 3-0-40-1; ఫ్రిలింక్ 4-0-52-2; ఫెలుక్వాయో 1-0-19-0; జోండో 2-0-19-1; స్మిట్ 2-0-17-0. డాల్ఫిన్స్ ఇన్నింగ్స్: వాన్ విక్ (బి) ఎల్బీడబ్ల్యు అశ్విన్ 17; డెల్పోర్ట్ (బి) మోహిత్ 34; చెట్టి (సి) మోహిత్ (బి) బ్రేవో 37; మహరాజ్ (బి) మోహిత్ 8; వాన్ జార్స్‌వెల్డ్ (సి) స్మిత్ (బి) బ్రేవో 30; జోండో (సి) రైనా (బి) నెహ్రా 9; స్మిట్ (రనౌట్) 0; ఫెలుక్వాయో (బి) మోహిత్ 22; ఫ్రిలింక్ (బి) నె హ్రా 6; అబోట్ (బి) మోహిత్ 5; అలెగ్జాండర్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 188. వికెట్ల పతనం: 1-34; 2-56; 3-90; 4-115; 5-138; 6-139; 7-139; 8-152; 9-165; 10-188. బౌలింగ్: నెహ్రా 4-0-42-2; అశ్విన్ 4-0-38-1; మోహిత్ 4-0-41-4; జడేజా 3-0-35-0; రైనా 1-0-14-0; బ్రేవో 4-0-17-2. -
సిరీస్ విజయంపై భారత్ దృష్టి
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక అనంతరం దీనిని భారత ‘ఎ’ జట్టుగా బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ అభివర్ణించాడు. కానీ ఇప్పుడు ఆ ‘ఎ’ జట్టును ఎదుర్కోవడానికే ప్రత్యర్థి ఆపసోపాలు పడుతోంది. తొలి వన్డేలో టీమిండియా ఏకపక్ష విజయం అనంతరం ఇప్పుడు బంగ్లాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరో వైపు ఆడుతూ పాడుతూ శుభారంభం చేసిన రైనా సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో మంగళవారం భారత్, బంగ్లాదేశ్ రెండో వన్డేలో తలపడనున్నాయి. బౌలర్లకు మరో అవకాశం గత మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప, రహానే , రైనా, రాయుడు రాణించడంతో భారత బ్యాటింగ్ విభాగం ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ భారత యువ బౌలర్లు కొంత మేరకే సఫలం కాగలిగారు. గాయంతో పూర్తి ఓవర్లు వేయలేకపోయిన మోహిత్ ఈ మ్యాచ్‌లో అందుబాటులో ఉంటాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. మరోవైపు బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ కోసం తస్కీన్ అహ్మద్‌కు స్థానం ఇచ్చే అవకాశం ఉంది. వర్షం ముప్పు!: రెండో వన్డేకు కూడా వాతావరణం ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం కూడా ఇక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. -
పచ్చదనం వైపు మహిళల పయనం
పర్యావరణం ఇక్కడ సైకిళ్లతో కనిపిస్తున్న అమ్మాయిలను ‘గో గ్రీన్ గర్ల్స్’(జి.జి.జి) అని పిలుస్తున్నారు. గత రెండేళ్లలో 2,500 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి పర్యావరణాన్ని రక్షించండంటూ పిలుపునిచ్చారు. కలకత్తా నుంచి కన్యాకుమారి వరకూ తమ పయనాన్ని కొనసాగించాలంటూ మొదలుపెట్టిన ఈ మహత్కార్యం ఇప్పటివరకూ ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా కొనసాగుతోంది. ‘ఉమెన్ ఎడ్వంచర్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా’ ఆధ్వర్యంలో సాగే ఈ సైకిల్ ప్రయాణంలో ఇరవై నుంచి యాభై ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు, ఏదో రకంగా పచ్చదనాన్ని కాపాడుకోవాలనే తపన ఉన్నవారు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ‘‘మన కోసం మనం చేసే పనుల కన్నా ప్రకృతిని కాపాడుకోవడం కోసం చేసే పనుల్లో తృప్తి ఉంటుంది. ‘ఉమెన్ ఎడ్వంచర్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా’వారు ఎప్పుడైతే జిజిజి గురించి చెప్పారో వెంటనే సభ్యురాలిగా చేరిపోయాను. ఇప్పటివరకూ మా ప్రయాణంలో బోలెడన్ని అనుభవాలు ఎదురయ్యాయి. అందమైన పల్లెటూళ్లు, ఇరుకిరుకు పట్టణాలు, చెట్లూ చేమలు, చెత్తా చెదారం...అన్నింటిని దాటుకుంటూ మా సైకిల్ చక్రాలు పచ్చదనంపై ప్రచారం చేసుకుంటూ ముందుకుసాగాయి’’ అంటూ చెప్పుకొచ్చారు కలకత్తాకు చెందిన బంగీ జంప్ ప్లేయర్ రూప. ఆమెలాంటి చాలామంది జి.జి.జిలో ఉన్నారు. మహారాష్ట్రకు సంబంధించి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళగా పేరుగాంచిన రైనా కూడా జిజిజిలో సభ్యురాలయ్యారు. చేరినప్పుడు చాలామంది ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. ‘‘ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. ప్రస్తుతం 2,500కి.మీల దగ్గర మా సైకిల్ చక్రాలు తమ పయనాన్ని కొనసాగిస్తున్నాయి. కుటుంబాన్ని కాపాడుకోవడంతో మహిళ పాత్ర ఎంత ఉంటుందో...ఈ భూమిని కాపాడుకోవడంలో కూడా తన పాత్ర పెద్దదే అన్న విషయాన్ని ప్రతి ఒక్క మహిళా గ్రహించాలి. అందుకే కేవలం మహిళలు మాత్రమే ఇందులో పాల్గొనాలనే నిబంధన పెట్టాం’’ అని చెప్పారు రైనా. కేవలం సాహసాలు చేసే మహిళలే కాకుండా జిజిజిలో సాధారణ మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ముందుకు రావడం వెనక ఉమెన్ అడ్వెంచర్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా వారి కష్టం చాలా ఉంది. తోటి మహిళలకు ఆదర్శంగా ఉంటూ వారిని కూడా తమ బృందంలో చేర్చుకోడానికి ప్రత్యేక కౌన్సెలింగ్‌ల కార్యక్రమం కూడా చేపట్టారు. లేదంటే చదువులు మాని, ఉద్యోగాలకు సెలవులు పెట్టి ఈ సైక్లింగ్‌లో పాల్గొనడానికి అంత సులువుగా ముందుకు రారు కదా! ‘‘నాకు సైకిల్ తొక్కడం అంటే చాలా భయం. గో గ్రీన్ గర్ల్స్ గురించి తెలియగానే సైకిల్ నేర్చుకున్నాను’’ అని చెప్పారు 30 ఏళ్ల రిష్నా ఠాకూర్. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రయాణించిన జిజిజి బృందానికి ప్రత్యేకంగా ఇన్ని కిలోమీటర్లని లక్ష్యమంటూ ఏమీ లేదు. కలకత్తా, తమిళనాడు, గుజరాత్, కేరళ, మహారాష్ట్రలలో ప్రయాణించిన గో గ్రీన్ గర్ల్స్ తమకెదురైన అనుభవాలను తోటివారితో సంతోషంగా పంచుకుంటున్నారు. పచ్చదనం గురించి వీలైనంత ప్రచారం చేస్తున్నారు. -
చెన్నై సూపర్ ‘సిక్స్’
మళ్లీ అదే పునరావృతం... ఓపెనర్ స్మిత్ అద్భుత ఇన్నింగ్స్...సూపర్ కింగ్స్ గెలుపు...ఐపీఎల్లో తమకు అలవాటైన రీతిలో ధోని బృందం మరో అలవోక విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా... ఆ జట్టు ముందు అది చిన్నదైపోయింది. ఫలితంగా సొంత గడ్డపై డేర్‌డెవిల్స్‌కు వరుసగా రెండో పరాజయం తప్పలేదు. ఈ సీజన్లో చెన్నైకి ఇది వరుసగా ఆరో విజయం. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీపై కూడా ఇది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. - ధోనిసేన ఖాతాలో మరో విజయం - 8 వికెట్లతో ఢిల్లీపై గెలుపు - చెలరేగిన స్మిత్, రైనా న్యూఢిల్లీ: ఐపీఎల్-7లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. అనంతరం చెన్నై 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (51 బంతుల్లో 79; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), రైనా (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) చెన్నైని గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 44 బంతుల్లోనే 86 పరుగులు జోడించడం విశేషం. స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చెలరేగిన కార్తీక్ ఓపెనర్లు విజయ్ (30 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), డి కాక్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించి ఢిల్లీ జట్టుకు శుభారంభం అందించారు. అయితే అనవసరపు పరుగుకు ప్రయత్నించి డి కాక్ రనౌట్ కాగా, మోహిత్ బౌలింగ్‌లో కెప్టెన్ పీటర్సన్ (0) తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే దినేశ్ కార్తీక్ ఆరంభంనుంచి చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ వేగం పెంచాడు. ముఖ్యంగా మోహిత్, జడేజాల బౌలింగ్‌లో చెలరేగిన అతను 35 బంతుల్లో టోర్నీలో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తక్కువ వ్యవధిలోనే కార్తీక్‌తో పాటు శుక్లా, విజయ్ వెనుదిరిగారు. ఈ దశలో డుమిని (17 బంతుల్లో 28 నాటౌట్; 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (18 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించారు. మోహిత్ వేసిన 18వ ఓవర్లో డుమిని వరుసగా 4 ఫోర్లు కొట్టగా, 20వ ఓవర్లో జాదవ్ వరుసగా 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విరుచుకు పడ్డాడు. ఆఖరి 5 ఓవర్లలో ఢిల్లీ 56 పరుగులు చేసింది. మెరుపు ఆరంభం... ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు స్మిత్, మెకల్లమ్ (35 బంతుల్లో 32; 5 ఫోర్లు) మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఉనాద్కట్ వేసిన నాలుగో ఓవర్లో స్మిత్ వరుసగా 3 సిక్సర్లు బాదడంతో చెన్నై పవర్‌ప్లేలో 49 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం మెకల్లమ్ వెనుదిరిగాడు.మరో వైపు స్మిత్ జోరు మాత్రం తగ్గలేదు. భారీ సిక్సర్లతో చెలరేగిన అతను 38 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సీజన్లో అతనికి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌కు రైనా జత కలిసిన తర్వాత సూపర్ కింగ్స్ మరింత వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. చివర్లో స్మిత్ అవుటైనా, ధోని (12 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (రనౌట్) 24; విజయ్ (సి) డు ప్లెసిస్ (బి) జడేజా 35; పీటర్సన్ (బి) మోహిత్ 0; కార్తీక్ (సి) మోహిత్ (బి) హిల్ఫెన్హాస్ 51; శుక్లా (సి) పాండే (బి) అశ్విన్ 0; డుమిని (నాటౌట్) 28; జాదవ్ (నాటౌట్) 29; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1-36; 2-37; 3-108; 4-119; 5-120. బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-34-1; పాండే 3-1-26-0; మోహిత్ 4-0-51-1; జడేజా 4-0-23-1; అశ్విన్ 4-0-29-1; స్మిత్ 1-0-9-0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) విజయ్ (బి) పార్నెల్ 79; మెకల్లమ్ (సి) విజయ్ (బి) శుక్లా 32; రైనా (నాటౌట్) 47; ధోని (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.4 ఓవర్లలో 2 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1-82; 2-168. బౌలింగ్: షమీ 4-0-42-0; పార్నెల్ 4-0-25-1; ఉనాద్కట్ 3.4-0- 47-0; నదీమ్ 4-0-27-0; శుక్లా 4-0-31-1. -
ఈ వారంలోనే టోర్నీని అవిష్కరించనున్న ధోనీ,రైనా
-
వీడని ముసురు..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాను రెండు రోజులుగా ముసురు వాన వీడడం లేదు. అంతటా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తం భించింది. కడెం, ఖానాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దహెగాం మం డలంలోని ఎర్రవాగు, వేమనపల్లి పరిధిలోని నీల్వా యి, బతుకమ్మ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎర్రవాగు ఉప్పొంగడం తో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలి చా యి. నీల్వాయి, బతుకమ్మ వాగుల పరిధిలో ని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వాగు ప్రవాహం ప్రమాదకరంగా ఉండడం తో అత్యవసర వేళల్లో తప్పనిపరిస్థితుల్లో గ్రామస్తులు నాటు పడవలను ఆశ్రయించి ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు వాగుదాటలేక పాఠశాలలకు డుమ్మా కొట్టారు. నీల్వాయి వాగుపై వంతెన నిర్మాణం లేకపోవడంతో ప్రతిసారీ ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. పంటలకు ఊరట జూలై, ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురియ గా.. ఆ తరువాత నెల రోజులపాటు వర్షం జాడ లేకుండా పోయింది. అయితే.. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వాన పం టలకు ఊరటనిచ్చిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిన్నామొన్నటి వరకు వర్షాలు లేక అల్లాడిన పంటలు ఈ వర్షాలు కాసింత ఉపశమనం కలిగించాయి. కాగా.. ఖానాపూర్ మంలం బాబాపూర్(కె) గ్రామ శివారులో శుక్రవారం గోదావరిలో చిక్కుకు న్న నలుగురు పశువుల కాపరులను శని వా రం అధికారులు సురక్షితంగా బయటకు తీ సుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడం తో ఓ గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో దాని ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. కాగా.. దిగువ ప్రాం తాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేయకపోవడంతో వరదతో ఇబ్బందులు తప్పడంలేదు.