జిల్లాను రెండు రోజులుగా ముసురు వాన వీడడం లేదు. అంతటా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది.
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాను రెండు రోజులుగా ముసురు వాన వీడడం లేదు. అంతటా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తం భించింది. కడెం, ఖానాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దహెగాం మం డలంలోని ఎర్రవాగు, వేమనపల్లి పరిధిలోని నీల్వా యి, బతుకమ్మ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎర్రవాగు ఉప్పొంగడం తో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలి చా యి. నీల్వాయి, బతుకమ్మ వాగుల పరిధిలో ని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వాగు ప్రవాహం ప్రమాదకరంగా ఉండడం తో అత్యవసర వేళల్లో తప్పనిపరిస్థితుల్లో గ్రామస్తులు నాటు పడవలను ఆశ్రయించి ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు వాగుదాటలేక పాఠశాలలకు డుమ్మా కొట్టారు. నీల్వాయి వాగుపై వంతెన నిర్మాణం లేకపోవడంతో ప్రతిసారీ ప్రజలకు కష్టాలు తప్పడంలేదు.
పంటలకు ఊరట
జూలై, ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురియ గా.. ఆ తరువాత నెల రోజులపాటు వర్షం జాడ లేకుండా పోయింది. అయితే.. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వాన పం టలకు ఊరటనిచ్చిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిన్నామొన్నటి వరకు వర్షాలు లేక అల్లాడిన పంటలు ఈ వర్షాలు కాసింత ఉపశమనం కలిగించాయి. కాగా.. ఖానాపూర్ మంలం బాబాపూర్(కె) గ్రామ శివారులో శుక్రవారం గోదావరిలో చిక్కుకు న్న నలుగురు పశువుల కాపరులను శని వా రం అధికారులు సురక్షితంగా బయటకు తీ సుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడం తో ఓ గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో దాని ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. కాగా.. దిగువ ప్రాం తాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేయకపోవడంతో వరదతో ఇబ్బందులు తప్పడంలేదు.