sriramsagar project
-
శ్రీరాంసాగర్‌కు పూడిక సమస్య
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పద్దెనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న బృహత్తర శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక సమస్య భవిష్యత్తులో పెద్ద అవరోధం కానుంది. ఈ జలాశయాన్ని 1978లో 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. తరువాత 1996లో ‘ఏపీఈఆర్‌ఎల్’చేపట్టిన సర్వేలో.. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయినట్లు నిర్ధారించారు. అప్పటి నుంచి 2024 వరకు.. అదే నీటి నిల్వ సామర్థ్యాన్ని అధికారులు చూపుతూ వచ్చారు. తరువాత కొన్ని నెలల క్రితం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ జలాశయం నీటి నిల్వ 1,091 అడుగులు, 80.5 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. జలాశయంలోకి ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదలతో.. ఏటా 0.8 టీఎంసీల పూడిక వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఏటా వచ్చి చేరుతున్న పూడిక.. అధికారులు చెబుతున్న లెక్కల కంటే ఎక్కువ ఉంటుందని, జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం చెబుతున్న లెక్కల కంటే తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం కేవలం 70 టీఎంసీలు ఉంటుందని వాదనలున్నాయి. అధికారులు ప్రకటించిన 80.5 టీఎంసీలపై అనేక అనుమానాలున్నాయి. కాగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ.. ఆయకట్టు అలాగే ఉంటోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయకట్టుకు సాగునీరు అందించడమనేది గగనమే అని అర్థమవుతోంది. మూడేళ్లుగా జలాశయంలోకి 70 టీఎంసీల మేర నీరు చేరగానే.. వరద గేట్ల ద్వారా గోదావరి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. ప్రాజెక్ట్ జలాశయంలో పూడిక తీసివేతకు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పూడిక తొలగించకపోతే భవిష్యత్తులో తాగునీటి ప్రాజెక్టుగానే మిగిలిపోయే పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు అంటున్నారు. -
యాసంగికీ బేఫికర్
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా గుర్తింపు పొందిన శ్రీరాంసాగర్ జలాశయం వచ్చే యాసంగి పంటకు సైతం భరోసా ఇస్తోంది. ఈ ఏడాది ఎస్సారెస్పీలోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అనుకున్న సమయానికే నిండింది. ఇప్పటివరకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద కారణంగా జలాశయంలోకి ఈ సీజన్లో మొత్తం 245 టీఎంసీల నీరు వచ్చింది. దిగువ గోదావరిలోకి, కెనాల్స్ ద్వారా మొత్తం 171 టీఎంసీలు బయటకు వెళ్లింది. ఇప్పటికీ జలాశయం నిండుకుండలా ఉంది. దీంతో విడతలవారీగా నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ వానాకాలం పంటకు సమృద్ధిగా నీటిని వదిలారు. అయినా పూర్తి స్థాయి నీటిమట్టంతో జలాశయం.. వచ్చే యాసంగి పంటకు సైతం సరిపడా నీటిని అందించే స్థితిలో ఉంది. యాసంగికి నీరు వదిలినప్పటికీ.. ఇంకా మిగులు జలాలుండే పరిస్థితి ఉంది. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ఈ నెల 28 వరకు ఎగువ మహారాష్ట్ర నుంచి వరద..సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎగువ మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజ్ గేట్లను ఈ నెల 28న మూసివేయనున్నారు. అప్పటివరకు శ్రీరాంసాగర్ జలాశయంలోకి వరద కొనసాగుతుంది. జలాశయం నుంచి వచ్చే నవంబర్ రెండోవారం వరకు వానాకాలం పంటకు నీటిని విడుదల చేయనున్నారు. అయినా జలాశయంలో 70 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంటుంది. దీంతో యాసంగి పంటకు ఢోకా లేకుండా పోయింది. ఎస్సారెస్పీ కింద ఉన్న ఉమ్మడి కరీంగనర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు ఒక పంటకు నీరివ్వాలంటే 56 టీఎంసీల నీరు జలాశయంలో ఉండాలి. ఈ నేపథ్యంలో రెండో పంటకు బేఫికర్ అయింది. ఎస్సారెస్పీలోకి ప్రస్తుతం 12వేల క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, 80.5 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. డిసెంబర్ రెండో వారం నుంచి యాసంగి పంటకు నీటి విడుదల మొదలవు తుంది. వారబందీ ప్రకారం నీటి విడుదల చేస్తారు.మొత్తం 245 టీఎంసీల నీరు రాక..శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఇప్పటివరకు ఈ సీజన్లో మొత్తం 245 టీఎంసీల నీరు రాగా, 171 టీఎంసీలు బయటకు వెళ్లింది. వరద గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 96.25 టీఎంసీలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 4.90 టీఎంసీలు, వరద కాలువ ద్వారా 34.2 టీఎంసీలు, కాకతీయ కాలువ ద్వారా 25.50 టీఎంసీలు, సరస్వతి కాలువ ద్వారా 1.44 టీఎంసీలు, లక్ష్మి కాలువ ద్వారా 0.46 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.63 టీఎంసీలు వదిలారు. ఆవిరి రూపంలో 5.08 టీఎంసీల నీరు ఖర్చయింది. ఎస్సారెస్పీలోకి జూన్ నెలలో ఎగువ నుంచి 3.99 టీఎంసీలు, జూలైలో 27.25 టీఎంసీలు, ఆగస్టులో 33.48 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 154.43 టీఎంసీలు, అక్టోబర్‌లో 24.71 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. -
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
రైతన్నను ఆదుకుంటున్న కాకతీయ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా చేసే కాకతీయ కాలువలో నీరు నిల్వ ఉంచడంతో అన్నదాతలను ఆదుకుంటుంది. దీంతో కాకతీయ కాలువ ఆధారంగా పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువలో వేసవిలో కూడ నీటిని నిల్వ ఉంచడంతో రైతులు పంటలకు నీరు అందించుకున్నారు. కాలువ నీటి ఆధారంగా రైతులు ఎప్పుడో కరెంటు మోటార్లను బిగించుకున్నారు. కిలోమీటర్ల మేరా పైపులైన్లు వేసుకున్నారు. ప్రస్తుతం కాలువలో నీరు నిల్వ ఉండటం వల్ల రైతులు మందస్తుగానే పసుపు , మక్క పంటలను సాగు చేశారు. ప్రస్తుతం కాలువ నుంచి నీటి సరఫరా చేస్తున్న నీటి ద్వారానే పంటలు సాగవుతున్నాయి. పైపులైన్ల ద్వారా నీటి సరఫరా.. కాకతీయ, వరద కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు కాలువలకు మోటర్లు బిగుంచుకుని పైపులైన్ వేసుకున్నారు. పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసుకుంటూ పంటలకు నీరు అందిస్తున్నారు. కొందరు రైతులు నాలుగైదు కిలోమీటర్ల వరకు పైపులైన్ వేసుకుని నీటి సరఫరా చేసుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి పసుపు పంటను విత్తడంలో రైతులు బిజీగా ఉన్నారు. రెండు కాలువల్లో నీరు... కాకతీయ వరద కాలువల పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా నీరు ఉండటంతో రైతులు ముందస్తుగానే పంటలను విత్తుతున్నారు. సాధారణంగా మిరుగు కార్తే వరకు పంటలు విత్తకుండ తొలకరి కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం కాకతీయ కాలువలో, వరద కాలువల్లో భారీగా నీరు నిల్వ ఉండటం వల్ల ఎలాంటి నీటి భయం లేకుండా రైతులు ముందుగానే మక్క, పసుపు పంటను సాగు చేస్తున్నారు. కాకతీయ కాలువకు పరివాహక ప్రాంతాలుగా ఉన్న మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి, మండలాల రైతులు, వరద కాలువకు పరివాహక ప్రాంతాలుగా ఉన్న మోర్తాడ్, బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల రైతులు విత్తనాలు విత్తడం ఇప్పటికే 70 శాతం పూర్తయ్యయంటే నీటి భరోసా ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లీకేజీ రూపంలో వస్తున్న నీటిని కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ వద్ద గేట్లు దించి కాలువలో నిల్వ ఉంచారు. వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించి కాలువలో నిల్వ ఉంచారు. దీంతో పంటలకు నీటి లోటు లేకుండ రైతులకు పూర్తి భరోసా లభిస్తుంది. రెండు కాలువల్లో నీరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు..
సాక్షి, అమరావతి: గోదావరి ప్రధాన పాయపై శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగుకే బోర్డు పరిధిని పరిమితం చేయాలని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. పరిధిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడాన్ని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ దృష్టికి తీసుకెళ్లామని సబ్ కమిటీ కన్వీనర్ బీపీ పాండే తెలిపారు. గోదావరి బోర్డు పరిధి, స్వరూపంపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సోమవారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. బోర్డు నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2 కింద ఉన్న ప్రాజెక్టుల సమాచారాన్ని తక్షణమే అందజేయాలని సబ్ కమిటీ కన్వీనర్ బీపీ పాండే కోరారు. ఇప్పటికే ప్రాజెక్టుల సమాచారం ఇచ్చామని ఏపీ తరఫున సమావేశంలో పాల్గొన్న గోదావరి డెల్టా సీఈ పుల్లారావు వివరించారు. తెలంగాణ సర్కార్ ఇప్పటికీ ప్రాజెక్టుల సమచారాన్ని ఇవ్వకపోవడంపై కన్వీనర్ బీపీ పాండే అసహనం వ్యక్తం చేశారు. దాంతో తమ ప్రభుత్వంతో చర్చించి ప్రాజెక్టుల సమాచారాన్ని ఇస్తామని తెలంగాణ సీఈ మోహన్‌కుమార్ చెప్పారు. -
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి మహారాష్ట్ర, స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పోటెత్తింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని గోదావరి దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్, నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగుల నుంచి వరద ఉధృతం కావడంతో సోమవారం అర్ధరాత్రి 12 గేట్లు ఎత్తిన అధికారులు.. మంగళ వారం మధ్యాహ్నానికి 24 గేట్లను ఎత్తి లక్ష క్యూసె క్కులు నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా 87 వేల క్యూసెక్కుల వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి 40 వేల క్యూసెక్కులు వస్తుండగా, స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి మిగతా వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (90 టీఎంసీల సామర్థ్యం) అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2,500 క్యూసె క్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువకు నీటి విడుదలతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 36.15 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని జెన్కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. -
వేగంగా పునరుజ్జీవం
పునరుజ్జీవన పథకంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం సమీపంలోని వరద కాలువ 0.100 మీటర్ల వద్ద మూడో పంప్ హౌజ్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. పైప్‌లైన్ ఫిట్టింగ్, వరద కాలువ నుంచి ఎత్తిపోసే గేట్లకు సంబంధించిన సిమెంట్ నిర్మాణం పనులు చేపట్టారు. విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. వరద జలాలు అందుబాటులో ఉండే రెండు నెలల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి రివర్స్ పంపింగ్ చేసేలా నీటి పారుదల శాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు వడివడిగా సాగుతున్నాయి. నిర్దేశిత సమయంలోగా ఈ పథకం పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ పనులపై దృష్టి సారించడంతో పను లు వేగవంతమయ్యాయి. పంప్‌హౌస్ పనులతో పాటు, ఇతర నిర్మాణ పనుల న్నీ జూలై 15లోగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్సారె స్పీ జలాశయం సమీపంలోని వరద కాలువ 0.100 మీటర్ల వద్ద చేపట్టిన మూడో పంప్ హౌజ్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. తొలుత మొదటి పంప్‌హౌజ్, రెండో పంప్‌హౌస్ నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మూడో పంప్‌హౌస్ పనులు కాస్త నత్తనడకన సాగాయి. తాజాగా మళ్లీ ఈ పనుల్లో కదలిక వచ్చినట్లయింది. ఇప్పుడు వడివడిగా సాగుతున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పైప్‌లైన్ ఫిట్టింగ్, వరద కాలువ నుంచి ఎత్తిపోసే గేట్లకు సంబంధించిన సిమెంట్ నిర్మాణం పనులు చేపట్టారు. మరోవైపు పంప్‌హౌస్ నడిపేందుకు అవసరమైన విద్యుత్ కోసం సబ్‌స్టేషన్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. నీటిని ఎస్సారెస్పీలోకి ఎత్తి పోసే చోట కూడా సిమెంట్ నిర్మాణం పనులను చేపట్టారు. మహారాష్ట్ర మిగులు జలాలే ఆధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపేందుకు ప్రభుత్వం ఈపునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి రివర్స్ పంపింగ్ చేసేలా నీటి పారుదల శాఖ ఈ పథకానికి రూపకల్పన చేసింది. వరద జలాలు అందుబాటులో ఉండే రెండు నెలల పాటు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసుకునేలా డిజైన్ చేశారు. ఈ పనులకు 2017లో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ వద్ద శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.1,091 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం 2017లో పరిపాలన అనుమతులు జారీ చేసింది. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. ఈ మేరకు రూ.927.12 కోట్లతో 2017 ఆగస్టులో పనులకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వరద కాలువ మూడు చోట్ల పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. త్వరలో ముగియనున్న పొడగించిన గడువు.. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2017 ఆగస్టు నుంచి 15 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కాలేదు. దీంతో 2018లో పనులు పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును (ఈఓటీ) ప్రభుత్వం పొడగించింది. పొడగించిన ఈ గడువు కూడా ఈనెల 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇదీ పనుల ప్రగతి.. వరద కాలువ 0.100 మీటర్ల వద్ద చేపట్టిన మూడో పంప్‌హౌస్ పనులు ఇప్పటి వరకు 71 శాతం పూర్తయినట్లు నీటిపారుదల శాఖ పేర్కొంటోంది. 10.19 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ పూర్తయింది. కాంక్రీట్ పనులు.. 2.19 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను, 1.47 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తయింది. ఇంకా 72 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పంప్‌హౌస్ వద్ద నుంచి రోజుకు 11,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకునేలా ఎనిమిది పంపులను బిగించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. పంపులను నడిపేందుకు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. ఒక్కో పంప్‌కు 6.5 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా మొత్తం 52 మెగావాట్ల విద్యుత్ కావాల్సి ఉంది. ఇందుకోసం రెంజర్ల వద్ద రెండు భారీ విద్యుత్ టవర్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఎనిమిది చొప్పున డ్రాఫ్ట్ట్యూబులు, డ్రాఫ్ట్ట్యూబ్కోన్లు, స్టేరింగ్లు, పిట్లైనర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. వీలైనంత తొందరలో పూర్తి చేయిస్తాం.. రివర్స్ పంపింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి చేయిం చేందుకు చర్యలు చేపట్టాము. వీలైనంత తొందరలో పనులు పూర్తి చేసేలా చూస్తు న్నాము. నిర్దేశిత గడువులోగా ఈ పనులు జరుగుతాయి. శ్రీకాంత్, పర్యవేక్షక ఇంజినీర్, వరదకాలువ -
ఎస్సారెస్పీ నీటి విడుదలకు గ్రీన్‌సిగ్నల్!
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలను కాపాడటంతోపాటు రబీలో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన నీటి విడుదలకు ప్రణాళిక ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ మొదటి దశలో దిగువమానేరు ఎగువన ఉన్న 5 లక్షలు, దిగువన 2.30 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడేందుకు నీటిని సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారు. జలసౌధలో సాగునీటి శాఖామంత్రి హరీష్‌రావు సంబంధిత ఇంజినీర్లతో జరిపిన సమీక్షలో ఇంజినీర్ ఇన్‌చీఫ్ మురళీధర్‌రావు, ఎస్సారెస్పీ రెండోదశ చీఫ్ ఇంజినీర్ నాగేందర్రావు, వరదకాలువ, దేవాదుల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ అనిల్‌కుమార్, శ్రీరాంసాగర్ మొదటి దశ చీఫ్ ఇంజినీర్ శంకర్, సంబంధిత ప్రాజెక్టుల ఎస్ఈ, ఈఈలు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఇప్పటికే ఆన్ఆఫ్ పద్ధతితో మూడుతడులు ఇచ్చామని చీఫ్ ఇంజినీర్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 65 టీఎంసీలు, దిగువమానేరులో ఎనిమిది టీఎంసీల నీరు ఉందని తెలిపారు. మానేరు ఎగువన పంటలు కాపాడటానికి ఇంకా 18 టీఎంసీలు అవసరమవుతాయని, మిషన్ భగీరథ అవసరాలకు మినహాంచుకుని దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఆన్ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వగలమని కరీంనగర్ ఏసీఈ శంకర్ మంత్రికి వివరించారు. శ్రీరాంసాగర్ మొదటిదశలో ఉన్న మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటను కాపాడటానికి నీరు సరఫరా ఆన్ఆఫ్ పద్ధతిలో ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో మొత్తం 244 చెరువులు ఉన్నాయని, వాటిని నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీరు రాలేదని, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని. ఈ చెరువుల కింద ఆయకట్టును రక్షించుకోవడానికి, తాగునీటికి లోయర్ మానేరు డ్యాం నుంచి తక్షణమే నీటిని రెండో దశ పరిధిలోని చెరువులను నింపడానికి విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను కూడా నింపడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇంజినీర్లు కాలువల వెంట తిరుగుతూ నీటి నిర్వహణ చేయాలని సూచించారు. రాత్రివేళల్లో కూడా కాలువల మీద తిరగాలని, కాలువలను తెగ్గొట్టే ప్రయత్నాలను నిరోధించాలని అన్నారు. కాలువల గండ్లను పూడ్చడానికి జేసీబీ, టిప్పర్లను, ఇసుకబస్తాలను రెడీగా ఉంచుకోవాలని అన్నారు. జిల్లా రెవెన్యు యంత్రాంగం ఇంజినీర్లకు సహకరించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. టెయిల్టుహెడ్ పద్ధతిన నీటి నిర్వహణ చేయాలని సూచించారు. ఈ పద్ధతి గత రబీ సీజన్లో మంచి ఫలితాలను ఇచ్చిందని, చివరి భూములకు కూడా నీరు అందించగాలిగామని గుర్తుచేశారు. అలాగే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన దరిమిలా దేవాదుల ప్రాజెక్టు ఇంజినీర్లతో ఈ అంశంపై మంత్రి సమీక్షించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్పారెస్పీ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 65.81 టీఎంసీల నీరు ఉంది. ఈ ఏడాది కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు ఆశించిన మేరకు నీరు చేరింది. గతేడాదిలోనూ ప్రాజెక్టుకు నీరుచేరగా చెరువులు, కుంటలు నింపడంతో పాటు రబీ ఆయకటుŠుట్క ఆన్అండ్ఆప్ పద్ధతిన విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఆరేళ్లుగా తీసుకుంటే 2009లో ఆలస్యంగానైనా నిండుకుండలా మారింది. 2010లో పూర్తిస్థా యి నీటిమట్టానికి కూడా చేరుకోలేదు. 2012 లోనూ అదే పరిస్థితి. తిరిగి 2013లో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరింది. మిగులుజలాలు గోదావరిలోకి వదిలారు. 2014లో కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్ బోసిపోయింది. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్‌లో 1,60,578, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్గొండలో 2,87,508 ఎకరాలు సాగుకు దూరమయ్యయి. దీంతో ఆయకట్టు రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఏడాది వర్షాలు కురవడం ద్వారా 84.81 టీఎంసీలకు చేరింది. ఇప్పటికే ప్రాజెక్టు కింది చెరువులు నింపడంతో పాటు ఖరీఫ్‌కు కూడా నీళ్లు వదిలారు. ప్రస్తుతం 65.81 టీఎంసీల నీరుండగా.. మిషన్ భగీరథకు పోను ఎల్ఎండీ ఎగువ, దిగువల్లో 7.30 లక్షల ఎకరాలకు నీటి సరఫరా చేసేందుకు సమీక్ష అనంతరం మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాత నేపథ్యం పాత నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ (10 కొత్త జిల్లాలు) జిల్లాల్లోని 7.30 లక్షల ఎకరాలకు ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన నీటిని విడుదల చేయనున్నారు. -
గోదారి పారే దారేది?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా... బాబ్లీ నుంచి దిగువకు నీరు విడుదల కాలేదు... శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్ఆర్ఎస్పీ) పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలకు ప్రస్తుతం ఉన్నది 15.82 టీఎంసీలే... ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20 టీఎంసీలకు ప్రాజెక్టులో ఉన్న నీరు 13.489 టీఎంసీలే. ఈ పరిస్థితిల్లో ప్రాజెక్టులను మినహాయిస్తే బాబ్లీ దిగువ నుంచి 300 కిలోమీటర్ల గోదావరి పరీవాహక ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. జూలై నెలలో ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని చెరువుల్లో సైతం నీరు చేరలేదు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ గోదావరి నదీ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయని ఎస్సారెస్పీపై ఆధారపడ్డ రైతాంగం ఎదురుచూస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరిలోని నీటిని వదిలితే తప్ప దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడ్డ హైదరాబాద్ ప్రజానీకంతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ వంటి సంస్థలు, కరీంనగర్ పూర్వ జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఎ ల్లంపల్లి దిగువన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య నుంచి సాగే గోదావరి నిర్మాణంలో ఉన్న అన్నారం బ్యారేజీ వరకు ఎడారిని తలపిస్తోంది. ఆగస్టు నుంచి అక్టోబర్ లోపు భారీ వర్షాలు, తుపానులు వస్తే తప్ప గోదావరి డెల్టాలో ఎస్సారెస్పీపై ఆధారపడ్డ ఉత్తర తెలంగాణకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవు. ఎస్సారెస్పీలో ప్రమాదకర రీతిలో నీరు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు వరప్రదాయినిగా చెప్పుకునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాదకర స్థితికి చేరుకుంది. అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాల ప్రకారం మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూలై నుంచి అక్టోబర్ వరకు ఎత్తితే ఎస్సారెస్పీ నిండుతుంది. జూలై 1న బాబ్లీ గేట్లు ఎత్తినప్పటికీ, లక్ష క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయలేదు. ఎగువన బాబ్లీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోకపోవడమే అందుకు కారణంగా ఆ రాష్ట్ర సర్కారు చెపుతోంది. దీంతో ఎస్సారెస్పీకి ఇటీవలి కాలంలో వచ్చిన నీరు రెండు టీఎంసీలే. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్సారెస్పీలో గురువారం 15.82 టీఎంసీల నీటి మట్టం ఉంది. ఈ ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 30 అడుగుల లోటుతో 1061 అడుగులకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్సారెస్పీని నమ్ముకొని ఇప్పటికీ నార్లు పోయని ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల ప్రజలు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు. ఎల్లంపల్లిలో ఆరు టీఎంసీల లోటు హైదరాబాద్‌కు తాగునీటితో పాటు కరీంనగర్ ప్రాంతానికి సాగునీటిని, సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు నీరు అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ప్రస్తుతం లోటు నీటిమట్టంతో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 668 క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీరును వచ్చినట్టే ఔట్‌ఫ్లో చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌కు 280 క్యూసెక్కులు, సింగరేణికి 200 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 200 క్యూసెక్కుల వరకు విడుదల చేసే అధికారులు నీటి లోటుతో తగ్గించి వదులుతున్నారు. గూడెం, వేమునూరు, పెద్దపల్లి–రామగుండం మిషన్ భగీరథ సెగ్మెంట్‌కు కూడా ఇక్కడి నుంచే నీరివ్వాలి. వేసవి కాలంలోనే నీటి సరఫరాపై ఆంక్షలు విధించిన ప్రాజెక్టు అధికారులు కేవలం హైదరాబాద్‌కు, సింగరేణి, ఎన్టీపీసీలకు మాత్రమే నీటిని సరఫరా చేస్తూ కాపాడుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదతో ఆరు టీఎంసీల స్థాయి నుంచి 13 టీఎంసీలకు నీటిమట్టం పెరిగినప్పటికీ, పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోకపోతే హైదరాబాద్‌కు నీటి సరఫరాలో ఇబ్బంది ఎదురవుతుందని అధికారులు చెపుతున్నారు. ఎడారిని తలపిస్తున్న గోదావరి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి ఎగువకు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు నీరు కనిపిస్తుందే తప్ప మిగతా గోదావరి అంతా ఎడారిని తలపిస్తోంది. వర్షాలు కురిసిన తరువాత అక్కడక్కడ నిలిచిన నీటితో ఇసుకలో గడ్డి, పిచ్చిమెక్కలు మొలిచిన తీరు కనిపిస్తోంది. ఎల్లంపల్లి దిగువన నిర్మాణంలో ఉన్న సుందిళ్ల బ్యారేజీ వరకు గల 31 కిలోమీటర్ల దూరంలో సన్నని దార తప్ప గోదావరిలో నీరు లేదు. అక్కడి నుంచి 31.5 కిలోమీటర్ల దూరంలోని అన్నారం బ్యారేజీ వరకు అదే పరిస్థితి. అన్నారం నుంచి మేడిగడ్డ బ్యారేజీ వరకు ప్రాణహిత వరద పోటెత్తింది. ఇదే పరిస్థితి ఎస్సారెస్పీ నుంచి దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గల 140 కిలోమీటర్లలో ధర్మపురి వరకు ఎడారి పరిస్థితే. ధర్మపురి నుంచి నీటి ప్రవాహం కొంతమేర పెరిగింది. బాసర సరస్వతి చెంతనే నీరు లేని పరిస్థితి. బాబ్లీ దిగువన ఎస్సారెస్పీ వరకు కూడా నీటి ప్రవాహం లేక ఇసుక తిన్నెలు, పిచ్చిమొక్కలు గోదావరిలో కనిపిస్తున్నాయి. -
బాబ్లీ నీటిపై ‘మహా’ నాటకం!
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచే విషయంలో మహారాష్ట్ర కొత్త నాటకానికి తెరలేపింది. రాష్ట్రానికి దక్కాల్సిన చిన్నపాటి నీటి వాటాను అడ్డుకునేందుకు ఎత్తులు వేస్తోంది. మార్చిలో తెలంగాణకు రావాల్సిన 0.6 టీఎంసీ ల నీటిని విడుదల చేయలేమంటూ రాష్ట్రానికి లేఖ రాసింది. ఎగువన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ నిల్వలు ఉన్నందున బాబ్లీ నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన నీటిని విడుదల చేయాల్సిందేనంటూ రాష్ట్రం తెలిపింది. సుప్రీం చెప్పినా కూడా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను అడ్డుకునే బాబ్లీ ప్రాజెక్టుపై నాలుగేళ్ల కింద సుప్రీం తీర్పు వెలువరించింది. దీని ప్రకారం ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచాలని సూచించింది. మార్చి 1న గేట్లు ఎత్తి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని సూచించింది. ఈ ఆదేశాల మేరకు అక్టోబర్ 29న ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తింది. మళ్లీ మార్చి 1న వాటిని తెరవాల్సి ఉంది. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో కేవలం 0.048 టీఎంసీల మేర మాత్రనే నీరుందని మహారాష్ట్ర అంటోంది. దీంతో నీటి విడుదల సాధ్యం కాదని నాందేడ్ చీఫ్ ఇంజనీర్ ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాశారు. మహారాష్ట్రలో బాబ్లీ ఎగువన ఉన్న గైక్వాడ్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 102.73 టీఎంసీలకు గానూ 77.77 టీఎంసీల నిల్వలున్నాయి. గైక్వాడ్ దిగువన విష్ణుపురి ప్రాజెక్టులోనూ 2.7 టీఎంసీల సామర్థ్యానికి గాను 2 టీఎంసీల నిల్వలున్నాయి. ఎస్సారెస్పీలో 26 టీఎంసీలే.. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90.313 టీఎంసీల సామర్థ్యా నికి గాను 26.98 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో డెడ్‌స్టోరేజీని పక్కనబెడితే లభ్యత జలాలు 10 టీఎంసీలకు మించి ఉండవు. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిందేనంటూ ఎస్సారెస్పీ ప్రాజెక్టు అధికారులు నాందేడ్ చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాశారు. దీనిపై మహారాష్ట్ర ఎలాంటి నిర్ణయం చేస్తుందో వేచి చూడాలి. -
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పనులు ప్రారంభం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన చేసిన రెండు రోజులకే పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపడమే పునరుజ్జీవన పథకం ప్రధాన ఉద్దేశం. వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ నుంచి 100 మీటర్ల దూరంలో నిర్మిస్తున్న మూడో పంపు నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. వరద కాలువ 102 కిలోమీటర్ నుంచి 73 కిలోమీటర్ వద్ద ఒక పంపు, 34 కిలో మీటర్ వద్ద రెండో పంపు, 100 మీటర్ల దూరంలో మూడో పంపు నిర్మాణం చేపట్టేలా డిజైన్ చేశారు. మూడో పంపు నిర్మాణ పనులు ముప్కాల్ మండల కేంద్ర శివారులో కొనసాగుతున్నాయి. ఒక్కో పంపు హౌస్ వద్ద 8 పంపులు నిర్మిస్తున్నారు. -
బాబ్లీ గేట్లు ఎత్తివేత
-
బాబ్లీ గేట్లు ఎత్తివేత
నాందేడ్: మహారాష్ట్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు కలిసి ఈ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచారు. నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లు తెరవడంతో నీరు కిందకు వస్తోంది. కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు అధికారులు శనివారం గేట్లు ఎత్తారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలోనే గోదావరి నీరు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి చేరనుందని అధికారులు తెలిపారు. -
లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తి
► టార్గెట్ 68 మిలియన్ యూనిట్లు ► ఇప్పటివరకు ఉత్పత్తి అయింది 68.17 ఎం.యూ. ► నెలాఖరులోపు మరింత పెరగనున్న ఉత్పత్తి బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలని విద్యుత్‌సౌధ లక్ష్యం విధించింది. టార్గెట్ దాటడంపై జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు మరో ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది నిల్.. కాకతీయ కాలువకు నీటి విడుదల ద్వారా స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గతేడాది ఎగువ ప్రాంతాల నుంచి చుక్క నీరు రాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయలేదు. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 12 మిలియన్ యూనిట్లే విద్యుదుత్పత్తి జరిగింది. మూడేళ్ల తరువాత ఈ సంవత్సరమే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. టార్గెట్ తక్కువే.. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈ ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం దాటడం హర్షణీయమే కానీ, విధించిన లక్ష్యమే చాలా తక్కువ. వాస్తవానికి 90 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టు ద్వారా కనీసం 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని గతంలో నిర్దేశించారు. ఒక్క టీఎంసీ నీటితో ఒక మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు వచ్చిన సమయంలో స్థానిక జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రికార్డు స్థాయిలో 137 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ప్రాజెక్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం 102 టీఎంసీల నీరు గోదావరి పాలైనా, రబీ ప్రారంభం నాటికి ప్రాజెక్టులో 80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా 68 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి పెద్ద గొప్పేమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గత మూడేళ్లలో ఈసారే అత్యధికంగా ఉత్పత్తి కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల ఉత్పత్తిని లెక్కలోకి తీసుకొని.. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని çవిద్యుత్ సౌధ నిర్ణయిస్తుంది. గత పదేళ్ల విద్యుత్ ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని సగటుగా లక్ష్యం నిర్దేశిస్తారు. దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు. – శ్రీనివాస్‌రావు, జెన్కో ఎస్ఈ, ఎస్సారెస్పీ -
మిషన్ కాకతీయ.. అంతా మాయ l
నందిపేట మండలం గాదెపల్లి గ్రామంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గిలకమ్మ చెరువును మిషన్ కాకతీయ కింద చేర్చి రూ.17.20 లక్షలు కేటాయించారు. వర్ని మండలం జాకోర గ్రామంలో బ్రాహ్మణకుంట, అక్బర్‌నగర్‌లో ఎర్రకుంటలు 10 ఎకరాల విస్తీర్ణం లేకున్నా మిషన్‌కాకతీయ కింద తీసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎక్కలవినికుంటకు ఆయకట్టు లేకున్నా మిషన్ కాకతీయ కింద ఎంపికచేసారు. గాంధారి మండల కేంద్రంలో ఒక చెరువుకు ఆయకట్టు లేకున్నా ఆయకట్టును ఎక్కువ చూపుతూ మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టారు. నిజామాబాద్ అర్బన్ : సాగుభూములకు జీవనాడులుగా ఉన్న చెరువులు, కుంటలకు జలకళతో పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం లక్ష్యం అధికారుల ఇష్టారాజ్యంతో నీరుగారుతోంది. ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులను వదిలి తక్కువ ఆయకట్టు ఉన్న కుంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆసలు ఆయకట్టు లేని కుంటలను, ఐదు నుంచి 20 ఎకరాల లోపు ఆయకట్టు గల కుంటలను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు ఎంపిక చేశారు. పలు మండలాల్లో అసలు తూములు, ఆలుగు నిర్మాణాలు లేని కుంటలను ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురైన చెరువులు, కుంటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం విడ్డూరంగా ఉందంటున్నారు. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, నవీపేట మండలాల్లో ఇలాంటి చెరువులనే ఎంపిక చేసారు. ఇప్పటికే జిల్లాలో అత్యధిక కుంటల్లో ఉపాధిహామీ పథకం కింద పూడికతీత పనులు, కట్టబలోపేతం పనులు చేయించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద ఖర్చుపెట్టిన రూ. 233.80 కోట్లలో సింహభాగం చెరువు పనులకే కేటాయించారు. దీంతో గుత్తెదారులు పూడికతీత కట్ట బలోపేతం పనులు వదిలి మిగతా పనులు చేస్తున్నారు. నామమాత్రంగా తూములు నిర్మించడం, మత్తడికి పై పూతలు పూసి మమ అనిపించేస్తున్నారు. పనులకు మంజూరైన నిధుల్లో పాతిక శాతం కూడా ఖర్చు చేయడం లేదు. నిధులను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పెద్ద చెరువులను వదిలేశారు.. జిల్లాలో ఆయకట్టు లేని కుంటలకు ప్రాధాన్యత ఇచ్చిన ఇంజనీర్లు వందల ఆయకట్టు ఉన్న చెరువులను వదిలేసారు.పెద్ద చెరువులను మిషన్ కాకతీయ కింద తీసుకుంటూ లక్ష్యం నెరవేర్చడంలో విఫలం కావడం, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో ఇంజనీర్లు చిన్నకుంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ఇలా జిల్లాలో వదిలేసిన పెద్ద చెరువులు 40 వరకు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. Mission Kakatiya, sriransagar project, -
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత
-
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ)కు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 4.50 లక్షల ఉండటంతో అధికారులు శనివారం ప్రాజెక్ట్ 42 గేట్లు ఎత్తివేశారు. రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1089 అడుగులకు చేరింది. కాగా ఇన్‌ఫ్లో 6 లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అంచనా. మూడేళ్ల తర్వాత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. మరోవైపు అధికారులు దిగువ ప్రాంతాలను కూడా ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేశారు. -
రంగు మారుతున్న ఎస్సారెస్పీ నీరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోని నీరు రెండు రోజులుగా రంగు మారుతోంది. నీరు పూర్తిగా పచ్చ రంగులోకి మారింది. ఎందుకు ఇలా మారుతుందో అర్థం కావటం లేదని అధికారులు అంటున్నారు. స్థానిక ప్రాంతాలలో కురిసిన వ ర్షాల వల్ల మూడు రోజులుగా ప్రాజెక్ట్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిలో ఎక్కడైనా రసాయానాలు కలుస్తున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్సారెస్పీ నీటి విడుదల వాయిదా
సారంగాపూర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వాయిదా పడింది. ఈ మూడు పట్టణాల్లోని చెరువులను నింపటానికి అర టీఎంసీ నీటిని గురు, శుక్రవారాల్లో వదలాల్సి ఉంది. అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం నాలుగు రోజులకు వాయిదా పడిందని ఎస్సారెస్పీ డీఈ చక్రునాయక్ తెలిపారు. అలాగే, వరంగల్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నీటిని ఈనెల 28వ తేదీ బదులు 29వ తేదీన విడుదల చేయనున్నట్లు డ్యాం అధికారులు పేర్కొన్నారు. -
భారీవర్షాలతో నిండుగా జలాశయాలు
-
భారీవర్షాలతో నిండుగా జలాశయాలు
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు వచ్చి చేరడంతో జలాశయాలలో భారీ స్థాయిలో నీరు చేరింది. శ్రీశైలం జలాశయంలో వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1.21 లక్షలు, ఔట్‌ఫ్లో 1.5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శ్రీకాకుళం జిల్లా వంశధార గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 87 వేల క్యూసెక్కులుగా ఉంది. కొత్తూరు మండలం మాతల వద్ద రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఒడిశా-ఆంధ్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మహదేవ్పూర్ మండలంలోని పెద్దంపేట, పంకెన, సర్వాయిపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 16 అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది. ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 1,069 అడుగులకు చేరింది.ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ** -
పర్యాటకులకు నిరాశే
బాల్కొండ, న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగన రూ.6 కోట్లతో ఇరిగేషన్ అధికారులు పార్కును ఏర్పాటు చేశారు. పనులు పూర్తి కావడంతో గత నెల 29న భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కలిసి పార్కును ప్రారంభించారు. కానీ ఈ ప్రారంభం అధికారులకు, పాలకులకు మాత్రమే. ఇంత వరకు ఒక్క పర్యాటకున్ని కూడా లోపలికి అనుమతించలేదు. కారణం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి పర్చేందుకు పార్కు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2009లో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. ఏడాది కాలంలో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లు దాటినా పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా అధికారులు పార్కును ఎవరు పర్యవేక్షించాలోనన్న అలోచనే చేయలేదు. తీరా పనులు పూర్తయ్యాక పర్యవే క్షణ చేసేందుకు తమ వద్ద సిబ్బంది లేరంటూ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. ఉన్న ప్రాజెక్ట్ సంరక్షణకే సిబ్బంది దిక్కు లేదు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసినా ఏరోజూ ఆవైపుగా ఆలోచన చేయలేదు. పార్కు సస్యశ్యామలంగా పచ్చదనంతో ఉండాలంటే ప్రతీరోజు కనీసం 20 మంది కూలీలు పనిచేయాలి. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ప్రస్తుతం ఏదైన ఏజెన్సీకి పర్యవేక్షణ బాధ్యతలు టెండర్ ద్వారా అప్పగించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను త్వరగా అప్పగిస్తే పార్కు సందర్శిస్తామంటూ పర్యాటకులు కోరుతున్నారు. ఇన్నాళ్లు ఏం చేశారు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పనులు అంటేనే అధికారులకు ఒకింత నిర్లక్ష్యం ఉంటుందని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. పార్కు పనులు సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా ఏడాది కాలంలో పూర్తి కావల్సిన పనులు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా పార్కును ఎలా తీర్చి దిద్దుతారో అధికారుల వద్ద పుటాలు పటాలున్నాయి. పార్కు ప్రారంభానికి ముందే ఎజె న్సీ ద్వారానో. లేక టూరిజం శాఖకో పార్కు పర్యవేక్షణ అప్పగించేలా మాత్రం అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు. పూర్తయిన తర్వాతనైనా పార్కు ప్రారంభానికి సత్వర చర్యలు ఎందుకు చేపట్టడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కు సమస్యను పరిష్కరించి, సందర్శనకు అనుమతివ్వాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. -
‘పిల్ల కాల్వల’కు అనుమతి
వరంగల్, న్యూస్‌లైన్: బీడు భూములు సాగులోకి రానున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద జిల్లాలో మరో 9వేల హెక్టార్లలో సాగు పెరగనుంది. కొన్నేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు ఇటీవలే మోక్షం లభించింది. దీంతో పిల్ల కాల్వల(ఫీడర్ ఛానల్స్) నిర్మాణానికి అనుమతి వచ్చింది. ప్రధానంగా డోర్నకల్ సెగ్మెంట్లోని కరువుతో ఉన్న మండలాలకు ఎస్సారెస్పీ నీటిని అందించేందుకు పిల్లకాల్వల నిర్మాణానికి చాలా ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేశారు. డీబీఎం-38 కింది నుంచి ఈ ప్రాంతానికి కాల్వలు తవ్వాలనే డిమాండ్ ఉంది. ఎట్టకేలకు డీబీఎం-38 పరిధిలో పిల్లకాల్వల నిర్మాణానికి నీటిపారుదల శాఖ ఒకే చెప్పింది. అయితే 9వేల హెక్టార్లకు ఎస్సారెస్పీ నీటిని అందించే విధంగా కాల్వల నిర్మాణానికి డిజైన్ చేశారు. దీంతో మరిపెడ, నర్సింహులపేట, డోర్నకల్, కురవి ప్రాంతాల్లోని బీడు భూములు సాగులోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.4కోట్లతో ఎస్సారెస్పీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి ప్రస్తుతం నీటిపారుదల శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ముందుగా డీబీఎం-38 పరిధిలోని 26(ఆర్) పరిధిలో మూడు కాల్వలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు 21 కిలోమీటర్ల పరిధి మేరకు మూడు కాల్వలను నిర్మించాలని, ఒక్కో దానికి రూ.30లక్షల చొప్పున వెచ్చించేందుకు అనుమతి వచ్చిందని, వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది వరకు పిల్వకాల్వల ద్వారా నీటిని అందించాలని వరంగల్ సర్కిల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పిల్ల కాల్వల నిర్మాణం, టెండర్లు, భూ సేకరణ తదితర అంశాలపై సోమవారం రాజధానిలో నీటిపారుదల శాఖ తెలంగాణ ప్రాంత కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోనే మూడు కాల్వలకు అనుమతి జారీ చేశారు. అంతేకాక మరికొంత ఆయకట్టుకు నీరందించేందుకు మరిన్ని కాల్వల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలో వాటికి కూడా నిధులు కేటాయించి అనుమతిస్తామని సమావేశంలో స్పష్టం చేశారు. అనుకున్న సమయంలో పిల్లకాల్వల నిర్మాణాలు పూర్తి చేస్తే.. ఎస్సారెస్పీ ఆయకట్టులో మరో 9వేల హెక్టార్లు చేరనున్నాయి. ఇన్ని రోజులు నీళ్లు లేక బీడుగా ఉన్న భూములు పంట పొలాలతో కళకళలాడనున్నాయి. -
వీడని ముసురు..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాను రెండు రోజులుగా ముసురు వాన వీడడం లేదు. అంతటా వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తం భించింది. కడెం, ఖానాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దహెగాం మం డలంలోని ఎర్రవాగు, వేమనపల్లి పరిధిలోని నీల్వా యి, బతుకమ్మ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎర్రవాగు ఉప్పొంగడం తో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలి చా యి. నీల్వాయి, బతుకమ్మ వాగుల పరిధిలో ని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వాగు ప్రవాహం ప్రమాదకరంగా ఉండడం తో అత్యవసర వేళల్లో తప్పనిపరిస్థితుల్లో గ్రామస్తులు నాటు పడవలను ఆశ్రయించి ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు వాగుదాటలేక పాఠశాలలకు డుమ్మా కొట్టారు. నీల్వాయి వాగుపై వంతెన నిర్మాణం లేకపోవడంతో ప్రతిసారీ ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. పంటలకు ఊరట జూలై, ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురియ గా.. ఆ తరువాత నెల రోజులపాటు వర్షం జాడ లేకుండా పోయింది. అయితే.. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వాన పం టలకు ఊరటనిచ్చిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిన్నామొన్నటి వరకు వర్షాలు లేక అల్లాడిన పంటలు ఈ వర్షాలు కాసింత ఉపశమనం కలిగించాయి. కాగా.. ఖానాపూర్ మంలం బాబాపూర్(కె) గ్రామ శివారులో శుక్రవారం గోదావరిలో చిక్కుకు న్న నలుగురు పశువుల కాపరులను శని వా రం అధికారులు సురక్షితంగా బయటకు తీ సుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కడెం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరగడం తో ఓ గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో దాని ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. కాగా.. దిగువ ప్రాం తాల్లోని ప్రజలను అధికారులు అలర్ట్ చేయకపోవడంతో వరదతో ఇబ్బందులు తప్పడంలేదు. -
ఎల్ఎండీ గేటెత్తారు..
తిమ్మాపూర్, కరీంనగర్, న్యూస్‌లైన్ : దిగువ మానేరు జలాశయం(ఎల్ఎండీ) పూర్తిస్థాయిలో నిండడంతో గురువారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా విడుదల చేసిన 6 వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం ఎల్ఎండీకి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 920 అడుగులు(24 టీఎంసీలు). ప్రస్తుతం ప్రాజెక్టులో 919.65 అడుగులు(23.372 టీఎంసీలు) నీరుండగా రిజర్వాయర్‌కు కాకతీయ కాలువతోపాటు వరద కాలువ ద్వారా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో గురువారం సాయంత్రం 4.40 సమయంలో సీఈ శంకర్ పదో నంబర్ గేటు ఎత్తి రెండు వేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. ప్రస్తుతం వరద కాలువ ద్వారా ఆరు వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగితే శుక్రవారం మరో గేటు ఎత్తే అవకాశముంది. వరద కాలువ నుంచి వచ్చే నీటిని గంట గంటకు లెక్కించి గేట్లు తెరవడం, లేదా మూయడం చేస్తామని సీఈ తెలిపారు. కార్యక్రమంలో జీవీసీ 4 ఎస్ఈ రుక్మారెడ్డి, తహశీల్దార్ భుజంగరావు, ఈఈ గుణవంతరావు, డీఈఈ రాములు, ఏఈ కాళిదాసు, కేడీసీసీబీ డెరైక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వర్క్ఇన్స్పెక్టర్లు అహ్మద్, బుచ్చయ్య తదితరులున్నారు. మరో గేటు ఎత్తే అవకాశం ఒక గేటు ఎత్తి మానేరుకు నీరు వదిలిన అధికారులు దిగువకు వెళ్లే కాకతీయ కాలువకు నీటి విడుదల గురువారం సాయంత్రం నిలిపివేశారు. ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతు కాగా మృతదేహం వెలికితీసేందుకు నీటి విడుదల ఆపాలని పోలీసుల కోరడంతో నిలిపివేశారు. గతంలో కాలువ మరమ్మతు జరిగిన ప్రదేశంలో మట్టి కొట్టుకుపోవడంతో అక్కడ ఇసుక సంచులు వేయడానికి చర్యలు చేపట్టారు. శుక్రవారం ఇసుక సంచులు కాలువలో వేస్తామని చెప్పారు. ఆ తర్వాతనే నీటిని మళ్లీ దిగువకు వదులుతామన్నారు. నీటిమట్టం పరిశీలనకు సెన్సార్బాల్స్ రిజర్వాయర్‌లో నీటి మట్టం పరిశీలనకు రిజర్వాయర్ ఇన్‌టేక్ వెల్ వద్ద సెన్సార్ బాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇన్‌ఫ్లో పెరగడంతో అలల తాకిడికి బయట నీటి మట్టం సరిగా అంచనా వేయలేకపోతున్నామని, అందుకే అలల తాకిడి ఉండని ఇన్‌టేక్ వెల్‌లో సెన్సార్ బాల్స్ ఏర్పాటు చేస్తే నీటి మట్టాన్ని సరిగ్గా అంచనా వేయడానికి వీలుంటుందని అధికారులు చర్చించారు. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని, దీనికి అంచనా వేయాలని సీఈ శంకర్ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు.