నాందేడ్: మహారాష్ట్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు కలిసి ఈ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచారు. నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లు తెరవడంతో నీరు కిందకు వస్తోంది. కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు అధికారులు శనివారం గేట్లు ఎత్తారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలోనే గోదావరి నీరు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి చేరనుందని అధికారులు తెలిపారు.