gates open
-
నిండుకుండలా నాగార్జున సాగర్.. 18 గేట్లు ఎత్తివేత
-
నాగార్జున సాగర్ 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు
-
పరవళ్లు తొక్కుతున్న నాగార్జున సాగర్.. పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
6 గేట్లు ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-
నాగార్జునసాగర్ గేట్లు ఓపెన్
-
రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/హొళగుంద: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులోకి 3.79 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 61,111 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 873.4 అడుగుల్లో 156.39 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 59 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయానికి ప్రాజెక్టు నిండిపోతుంది. మంగళవారం ఉదయం ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటి విడుదలను ప్రారంభించనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 53,774 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 510.2 అడుగుల్లో 132.01 టీఎంసీలకు చేరుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 2.68 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.25 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 3.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 3.04 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.98 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర ప్రవాహం తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 1.24 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. మొత్తం 33 గేట్లను ఎత్తి 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1.49 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులను వదులుతూ 1.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అటు జూరాల నుంచి కృష్ణా వరద, ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. -
శ్రీశైలం డ్యాం.. అందాలు చూడటానికి సిద్దమా!
శ్రీశైలం ప్రాజెక్ట్(నంద్యాల జిల్లా): శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో శనివారం గేట్లు ఎత్తనున్నారు. గురువారం సాయంత్రానికి డ్యాం నీటి మట్టం 880.20 అడుగులకు చేరుకుంది. మరో 4.80 అడుగులు పెరిగితే గరిష్టస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,65,255 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాంకు వస్తోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సగటున 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం నాటికి జలాశయ నీటిమట్టం 882 అడుగులకు పైబడి చేరుకోనుంది. దీంతో ఆదే రోజు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం ప్రాజెక్ట్ చేరుకుని డ్యాం రేడియల్క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 597 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. (క్లిక్: మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!) -
ఎస్బీఐ ఉద్యోగుల నిర్లక్ష్యం.. బ్యాంక్‌కు తలుపులు వేయకుండానే!
సాక్షి, ఖమ్మం: ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు ఎస్బీఐ ఉద్యోగులు బ్యాంకుకు తలుపులు వేయకుండానే వెళ్లిపోయిన ఘటన ఇది. ఈనెల 15వ తేదీ బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రతిరోజూ బ్యాంకు సమయం పూర్తయ్యాక స్ట్రాంగ్‌రూమ్‌తో పాటు అన్ని తలుపులకు షట్టర్లు, తాళాలు వేసి వెళ్తారు. అయితే, ఈనెల 15వ తేదీన సాయంత్రం మాత్రం ఉద్యోగులు విధులు ముగించుకుని ప్రధాన ద్వారం తలుపులు వేయకుండానే ఎవరికి వారు ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు అలాగే ఉండగా అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించి సర్పంచ్ జంగా పుల్లారెడ్డితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఏఎస్సై వి.వెంకటాచార్యులు, బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రకాష్ చేరుకుని వెంటనే బ్యాంకుకు మేనేజర్ రవికుమార్, ఉద్యోగులను పిలిపించారని సమాచారం. అధికారులు వచ్చాక పోలీసులతో కలిసి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ఎవరూ బ్యాంకులోకి ప్రవేశించలేదని నిర్ధారించుకున్న వారు. ఆతర్వాత తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారని తెలిసింది. కాగా, ఈ విషయం శుక్రవారం వెలుగులోకి రాగా.. వివరణ కోసం బ్యాంకు మేనేజర్ రవికుమార్‌కు ఫోన్ చేస్తే తర్వాత మాట్లాడుతానని బదులిచ్చారు. చదవండి: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్ -
హిమాయత్ సాగర్ : మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
-
శరణం అయ్యప్ప!
శబరిమల/తిరువనంతపురం: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేవాలయ తంత్రి(ప్రధాన పూజారి) కందరారు మహేశ్ మోహనరు, మెల్షంటి(ముఖ్య పూజారి) సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి పడి పూజ చేశారు. అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తుల అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది యువతులను తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే దేవస్థానం బోర్డు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ కనుమల్లోని పెరియార్ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులతోపాటు మండలపూజ మకరవిళక్కు, విషు పండగల సమయాల్లో మాత్రమే భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. మండల–మకరవిళక్కు సందర్భంగా రెండు నెలలపాటు ఆలయం తెరిచి ఉండనుంది. నిషేధాజ్ఞలు లేవు: కలెక్టర్ రుతుక్రమం వయస్సు మహిళలను కూడా ఆలయంలోకి పూజలకు అనుమతించవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు, వేలాదిగా పోలీసులను మోహరించినప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవని పత్తనంతిట్ట కలెక్టర్ ప్రకటించారు. శబరిమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. భక్తుల కోసం దేవస్వోమ్ బోర్డు పలు సౌకర్యాలు కల్పించింది. నీలాకల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 6,500 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ మహిళల బృందం వెనక్కి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన 30 మంది మహిళల బృందాన్ని పోలీసులు పంబలో అడ్డుకున్నారు. వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన మీదట అందులోని నిషేధిత 10–50 మధ్య వయస్సున్న 10 మందిని తిప్పిపంపి వేశామని పోలీసులు తెలిపారు. పంబ నుంచి శబరిమల ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ ఖండించింది. ప్రభుత్వ విధానం కారణంగా ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న వైఖరి క్రమంగా పలుచన కానుందని ఆ కమిటీ జనరల్ సెక్రటరీ పున్నల శ్రీకుమార్ తెలిపారు. శబరిమల రావాలనుకునే మహిళలు తమతో పాటు కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ స్పందించారు. ఆ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించడంలేదని వ్యాఖ్యానించారు. కేరళ సర్కారు తనకు భద్రత కల్పించినా కల్పించకున్నా ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల ఆలయ సందర్శనకు వెళ్తానని ఆమె ప్రకటించారు. గత ఏడాది ఉద్రిక్త పరిస్థితుల మధ్య తృప్తి దేశాయ్ ఆలయ సందర్శనకు ప్రయత్నించగా భారీ స్థాయిలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నారి భక్తురాలిని గుడిలోకి పంపిస్తున్న దృశ్యం -
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి
-
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
-
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో నాగార్జున సాగర్ క్రస్టు గేట్లను సోమవారం అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. 8 గేట్లు ఎత్తి సుమారు అయిదు అడుగుల వరకు ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు నాగార్జుసాగర్లోని నీటిని సమీక్షించి గేట్ల సంఖ్య పెంచాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని సాగర్ ఎస్ఈ ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కాగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. సాగర్ జలాశయ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు. ఇక ఎగువన కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది. దీంతో ఆ ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు వరద నీరు భారీగా వస్తుండటంతో ముందుస్తుగానే నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని మున్నేరు, పాలేరు, కీసర వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వీరులపాడు-దోమలూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కంచికచెర్ల మండలంలో నల్లవాగు, సద్దవాగు ఉధృతి కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల నీటి ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్‌కి సుమారు 21 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రస్తుతం బ్యారేజ్‌లోని నీటిమట్టం సాధారణ స్థాయి కంటే పెరిగింది. దీంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అదేశాలతో అధికారులు అలారం మోగించి.. ప్రకాశం బ్యారేజ్‌లోని 10 గేట్లు ఎత్తి దాదాపు 7,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పరీవాహక ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ఒడిస్సాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలలో శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో నదుల్లో నీటి మట్టం బాగా పెరిగింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. -
సాగర్ నీటి విడుదల
నాగార్జునసాగర్: సాగర్‌వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. దీంతో ఆదివారం రెండు రేడియల్ (13, 14) క్రస్ట్‌గేట్లు ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నర్సింహ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సునీల్‌తో కలసి ఉదయం తొమ్మిది గంటలకు కృష్ణమ్మకు పూజలు చేసి రెండు గేట్లు ఎత్తారు. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో మూడుగంటల అనంతరం గేట్లను మూసివేశారు. -
ఆల్మట్టి గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: ఎగువన కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి నిండుకుండగా మారడంతో మంగళవారం ఉదయం గేట్లెత్తారు. ఈ నీరంతా దిగువన ఉన్న నారాయణపూర్‌కు వస్తోంది. బుధవారం అక్కడ కూడా గేట్లు ఎత్తే అవకాశాలు ఉండటంతో.. తెలంగాణ వైపు మరో రెండు మూడ్రోజుల్లో కృష్ణమ్మ పరవళ్లు మొదలు కానున్నాయి. మరోవైపు తుంగభద్ర కూడా నిండేందుకు సిద్ధమైంది. వర్షాలు స్థిరంగా కొనసాగుతుండటం, ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు ఉండటంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కింద ఆయకట్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. జూరాలలోకి వచ్చే నీటితో 4.50 లక్షల ఎకరాలకు, శ్రీశైలానికి వచ్చే నీటితో మరో 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా నీటిపారుదల శాఖ పంపులు, మోటార్లు సిద్ధం చేసింది. జూరాలలో ప్రస్తుతం నిల్వ ఉన్న 5.6 టీఎంసీల నుంచి 2.5 టీఎంసీల నీటిని భీమా, నెట్టెంపాడు ఆయకట్టుకు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో మంగళవారం రాత్రి భీమా, నెట్టెంపాడులో ఒక్కో పంపును ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. 10 రోజుల్లోనే 95 టీఎంసీలు ఆల్మట్టి ప్రాజెక్టులోకి గత పదిరోజుల్లోనే సుమారు 95 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మంగళవారం సాయంత్రం సైతం 1.55 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1701.87 అడుగులకు నీరు చేరింది. 129.7 టీఎంసీలకుగానూ 113.07 టీఎంసీల నీటి లభ్యత ఉంది. మంగళవారం రాత్రికి నీటిమట్టం మరో నాలుగైదు టీఎంసీలకు పెరిగినట్లు కర్ణాటక నీటి పారుదల వర్గాలు తెలంగాణ అధికారులకు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం 18 గేట్లు ఎత్తి ఆల్మట్టి నుంచి దిగువన నారాయణపూర్‌కు స్పిల్‌వే, పవర్‌హౌజ్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్‌కు 37,906 క్యూసెక్కుల నీరు వస్తోంది. నారాయణపూర్ 37.64 టీఎంసీల సామర్థ్యానికి గానూ 29.80 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఎగువ నుంచి ప్రవాహాలు వస్తున్నందున బుధవారం సాయంత్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అదే జరిగితే జూరాలకు శుక్రవారం ఉదయానికి కృష్ణా ప్రవాహాలు నమోదవుతాయని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జూరాలలో 9.6 టీఎంసీల సామర్థ్యానికిగానూ 5.76 టీఎంసీల నిల్వ ఉంది. మరోవైపు తుంగభద్ర కూడా నిండేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ ఇప్పటికే 86.45 టీఎంసీల నిల్వలున్నాయి. 82 వేల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం తుంగభద్ర గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. గేట్లు ఎత్తితే దిగువ శ్రీశైలానికి శుక్రవారం నాటికి ప్రవాహాలు రానున్నాయి. 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి రెండుమూడ్రోజుల్లో దిగువకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, శ్రీశైలంపై ఆధారపడిన ఆయకట్టుకు నీటిని అందించేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమవుతోంది. జూరాల కింద లక్ష ఎకరాలకు నీటిని అందించడంతోపాటు భీమాలో రెండు ఫేజ్ల్లోని 6 మోటార్ల ద్వారా 1.70 లక్షల ఎకరాలు, నెట్టెంపాడులో రెండు స్టేజీల్లో 6 మోటార్ల ద్వారా 1.5 లక్షలు, కోయిల్‌సాగర్‌లో రెండు మోటార్ల ద్వారా 50 వేల ఎకరాలకు నీరివ్వడంతోపాటు 250 చెరువులను నింపాలని మంత్రి హరీశ్‌రావు ఇటీవల అధికారులను ఆదేశించారు. ఇక శ్రీశైలంపై ఆధారపడ్డ కల్వకుర్తిలో 5 మోటార్ల ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీరిచ్చి 400 చెరువులు నింపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తుంగభద్ర జలాలతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తయితే ఈ ఖరీఫ్‌లోనే ఆర్డీఎస్ కింద 86 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. జూలై నుంచే ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు మొదలవుతున్నందున ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలలో ఢోకా ఉండదని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
బాబ్లీ గేట్లు ఎత్తివేత
నాందేడ్: మహారాష్ట్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు కలిసి ఈ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరిచారు. నాందేడ్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్ట్ 14 గేట్లు తెరవడంతో నీరు కిందకు వస్తోంది. కేంద్ర జల వనరుల సంఘం ఆదేశాల మేరకు అధికారులు శనివారం గేట్లు ఎత్తారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచే ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలోనే గోదావరి నీరు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి చేరనుందని అధికారులు తెలిపారు. -
ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తివేత
అమరావతి: ఎగువ నుంచి వస్తున్నవరదతో ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజి 20 గేట్లను ఎత్తి 14, 340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద నీటి మట్టం 11.8 అడుగులు. కాగా, కాలువలకు 10, 097 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.