ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో నాగార్జున సాగర్ క్రస్టు గేట్లను సోమవారం అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. 8 గేట్లు ఎత్తి సుమారు అయిదు అడుగుల వరకు ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారు. కాగా రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయం వరకు నాగార్జుసాగర్‌లోని నీటిని సమీక్షించి గేట్ల సంఖ్య పెంచాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని సాగర్ ఎస్‌ఈ ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.