
నాగార్జునసాగర్: సాగర్‌వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. దీంతో ఆదివారం రెండు రేడియల్ (13, 14) క్రస్ట్‌గేట్లు ఎత్తి 14వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నర్సింహ, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సునీల్‌తో కలసి ఉదయం తొమ్మిది గంటలకు కృష్ణమ్మకు పూజలు చేసి రెండు గేట్లు ఎత్తారు. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో మూడుగంటల అనంతరం గేట్లను మూసివేశారు.